Shah Rukh Khan Net Worth:ఇండియాలో రిచెస్ట్ యాక్టర్ ఎవరంటే టక్కున వినిపించే పేరు కింగ్ ఖాన్’ షారుఖ్.అవును ..ఏకంగా దాదాపు 12వేల కోట్లతో ఎవరికీ అందనంత దూరంలో ఉన్నాడు మరి.అయితే తాజాగా కింగ్ ఖాన్ సంపద విషయం లో ఒక క్రేజీ న్యూస్ వినిపిస్తుంది.అదేంటో తెలుసా ..ఈ బాలీవుడ్ బాద్షా తన సంపదలో ఏకంగా 2,490 కోట్లు రూపాయల సంపద ఆవిరి అయిపోయిందట.
అసలు విషయంలోకి వస్తే జీరో నుండి ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు బాలీవుడ్ కింగ్ ఖాన్ గా పాతుకుపోయిన షారుఖ్ ఆస్తి 2025లో 12,490 కోట్లుగా ఉందట.కానీ ఏడాది గడిచే లోపే ఈ 2026 కి వచ్చే సరికి తన ఆస్తి పదివేల కోట్ల రూపాయలకి చేరిందట.అంటే ఈ ఏడు ఏకంగా 2,490 కోట్ల రూపాయలని కోల్పోయాడన్న మాట.
ఎలా నష్టపోయాడంటే
వాస్తవానికి ఒకవైపు సినిమాలు, మరోవైపు ఐపీఎల్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ప్రొడక్షన్ హౌస్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, అనేక అంతర్జాతీయ బ్రాండ్ ఎండోర్స్‌మెంట్లు ..వంటివి ఎన్నో షారుక్ ఖాతాలో ఉన్నాయి.అయినప్పటికీ షారుఖ్ ఇంత పెద్ద మొత్తంలో ఎలా నష్టపోయాడని అనుకుంటున్నారా …. షారుఖ్ ఖాన్ బిజినెస్ హోల్డింగ్స్ షేర్ విలువల్లో వచ్చిన మార్పులు, రెడ్ చిల్లీస్ ఆధ్వర్యంలో నడుస్తున్న విఎఫ్ఎక్స్ ధరలు భారీగా పెరిగిపోవడం,తన ipl క్రికెట్ టీమ్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ యొక్క ప్రాంచైజీ యొక్క విలువ పడిపోవడం వంటి కారణాల వల్ల షారుఖ్ తన ఆస్తిలో చాలా భాగాన్ని కోల్పోయాడని తెలుస్తుంది.
ఇక ఇవే కాకుండా షారుక్ ఖాన్ సినిమాలు గత కొంతకాలంగా థియేటర్ లలో రిలీజ్ కాకపోవడం కూడా ఒక కారణం అని సమాచారం. 2023లో ‘పఠాన్’, ‘జవాన్’ వంటి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్లతో పాటు ‘డుంకీ’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించిన షారుఖ్ అప్పటి నుండి ఏకంగా మూడేళ్ళ పాటు ఖాళీగా ఉండటం కూడా సంపద ఆవిరియిపోవడానికి కారణం అని టాక్ వినిపిస్తుంది.
అయినా షారుకే నెంబర్ వన్
అయితే తన ఆస్తిలో ఇంత తగ్గుదల ఉన్నప్పటికీ ఇండియాలో రిచెస్ట్ యాక్టర్ గా షారుక్ ఖానే నిలవడం విశేషం. ఇక ఈ లిస్టు లో అమితాభ్ బచ్చన్ రూ. 4,000 కోట్ల ఆస్తితో రెండో స్థానంలో నిలవగా, సల్మాన్ ఖాన్ రూ. 3,000 కోట్లతో మూడో స్థానంలో ఉన్నట్టు తెలుస్తుంది.అయితే ఊహించని విధంగా హృతిక్ రోషన్ రూ. 2,500 కోట్ల ఆస్తితో నాలుగో స్థానంలో నిలవడం విశేషం.
డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా రిలీజ్
ఇక షారుఖ్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే తనకి ‘పఠాన్’ వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ ని అందించిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో కింగ్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెల్సిందే.ఇక ఈ సినిమాని
2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయబోతున్నారు కూడా.ఇక ఈసినిమాలో సుహానా ఖాన్, దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, రాణి ముఖర్జీ, జైదీప్ అహ్లావత్, అర్షద్ వార్సీ, అభయ్ వర్మ, రాఘవ్ జుయల్ వంటి స్టార్స్ కీ రోల్స్ చేస్తుండటం విశేషం.
also read :గణపతి పండగే.. కాని రాత్రి 11కి డీజేలు ఏంటి బాబోయ్! రేణు దేశాయ్ ఫైర్
ఏది ఏమైనా డిల్లీ నుండి వచ్చి సీరియల్స్ లో చిన్నా చితాకా పాత్రలు వేసుకుంటూ ఏకంగా ఇండియాలోనే రిచెస్ట్ యాక్టర్ గా నిలిచిన షారుఖ్ ఎందరికో ఇన్స్పిరేషన్ అని చెప్పకతప్పదు !