E-Paper
Advertisement

నేను ఎంతో అదృష్టవంతుడిని.. రష్మిక పోస్టుపై విజయ్ క్యూట్ రిప్లై!

నేను ఎంతో అదృష్టవంతుడిని.. రష్మిక పోస్టుపై విజయ్ క్యూట్ రిప్లై!
Advertisement

Rashmika -Vijay Devarakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే . వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ ఈ ఏడాది పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇలా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ జంట ఎప్పటికప్పుడు వారి ప్రేమను తెలియజేస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా రష్మిక మందన్న (Rashmika Mandanna) విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)పై తనకు ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరుస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. రష్మిక విజయ్ పెళ్లి తర్వాత నటిస్తున్న మొదటి చిత్రం రణబాలి (Ranabaali). ఈ సినిమా నుంచి ఇటీవల ఏందయ్యా స్వామి అంటూ సాగిపోయే పాటను విడుదల చేశారు.

అతను నా సొంతమైన క్రష్ తగ్గలేదు..

ఈ పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయిందని చెప్పాలి. అయితే తాజాగా ఈ పాటకు సంబంధించిన క్లిప్ రష్మిక తన ఇంస్టాగ్రామ్ స్టోరీగా షేర్ చేస్తూ విజయ్ దేవరకొండ పై తన ప్రేమను చాటారు. “అతడు పూర్తిగా నా సొంతమయ్యారు కానీ అతనిపై నాకున్న క్రష్ అస్సలు తగ్గలేదు ఇదేమి విచిత్రమో ” అంటూ ఆమె విజయ్ పై ఉన్న ప్రేమను బయటపెట్టింది. ఇలా రష్మిక పోస్ట్ చేయడంతో వెంటనే విజయ్ దేవరకొండ రష్మిక పోస్టుకు రిప్లై చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

జీవితాంతం నువ్వు నా దగ్గరే ఉంటావు..

Advertisement

విజయ్ దేవరకొండ రష్మిక చేసిన ఈ పోస్టుపై స్పందిస్తూ..”నేను చాలా అదృష్టవంతుడిని.. నేను జయం మన మిస్ అవుతాను కానీ జీవితాంతం నువ్వు నా దగ్గరే ఉంటావు” అంటూ రష్మికపై తన ప్రేమను వ్యక్తపరుస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా వీరిద్దరూ తమ మధ్య ఉన్న ప్రేమను బయట పెట్టడంతో అభిమానులు కూడా ఈ జంటను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ప్రేమగా ఉండాలి అంటూ కోరుకుంటున్నారు. ఇక విజయ్ దేవరకొండ రష్మిక జంటగా రణబాలి సినిమా ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

పెళ్లి తర్వాత మొదటి సినిమా..

పెళ్లి తర్వాత వీరిద్దరూ జంటగా నటిస్తున్న మొదటి సినిమా కావడంతో రణబాలి సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కూడా వీరిద్దరు భార్యాభర్తలుగా కనిపించబోతున్నారు రష్మిక జయమ్మ పాత్రలో నటించగా, విజయ్ దేవరకొండ సింగనమల బొబ్బిలి రణబాలి పాత్రలో కనిపించబోతున్నారు దసరా పండుగ పురస్కరించుకొని ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీ విడుదల కాబోతోంది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం సినిమాపై భారీగా అంచనాలను పెంచేసాయి. పెళ్లి తర్వాత విజయ్ రష్మిక నటించిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement

Also Read: బిగ్ బాస్10 లోకి ముగ్గురు వైల్డ్ కార్డు ఎంట్రీస్.. వచ్చి రావడంతోనే గొడవలు!

Related News

మరోసారి కోయంబత్తూర్ ఆసుపత్రికి రామ్ చరణ్… గాయం ఇంకా తగ్గలేదా?

గోంధళ్‌కు ఆస్కార్ ఎంట్రీ.. అనురాగ్ కామెంట్స్‌తో కొత్త ట్విస్ట్

ఐబొమ్మ రవికి సగం రిలీఫ్.. అసలు ట్విస్ట్ రూ.3 కోట్ల దగ్గరే!

రూ.100 కోట్ల డీల్.. దిల్ రాజు మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడా?

కింగ్ ఖాన్ కి భారీ షాక్.. రూ.2490 కోట్లు గోవిందా!

గణపతి పండగే.. కాని రాత్రి 11కి డీజేలు ఏంటి బాబోయ్! రేణు దేశాయ్ ఫైర్

బాలయ్య భామను చూస్తే చూపు తిప్పుకోలేం.. ఏం అందమో!

Big Stories

Advertisement
×