E-Paper
Advertisement

బాలయ్య భామను చూస్తే చూపు తిప్పుకోలేం.. ఏం అందమో!

బాలయ్య భామను చూస్తే చూపు తిప్పుకోలేం.. ఏం అందమో!
Advertisement

Pragya Jaiswal:ప్రగ్యా జైస్వాల్..పరిచయం అక్కరలేని ఈ ముద్దుగుమ్మ ఇపుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది.అయితే ఎప్పటిలాగే గ్లామర్ షోలతోనో ,వెకేషన్ ట్రిప్స్ తోనో ,చిల్ అవుతున్న మూమెంట్స్ తోనో అనుకుంటున్నారా …కాదు వినాయక చవితి సందర్భంగా వినాయకుడి ముందు దిగిన ఫొటోలతో ..

గ్రీన్ ట్రెడిషనల్ డ్రెస్‌లో, వెనుక అందంగా అలంకరించిన వినాయకుడి మండపం ముందు చేతులు జోడించి కనిపించిన ఆమె ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఆ ఫొటోలకి “Only time of the year where cheating on your diet is acceptable” అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ కూడా ఫాలోవర్స్ ని ఫిదా చేస్తుంది.

Advertisement

లుక్ ఎవర్ గ్రీన్

ప్రగ్యా వేసుకున్న డ్రెస్ విషయానికి వస్తే . గ్రీన్ కలర్ ట్రెడిషనల్ డ్రెస్‌కు గోల్డ్ ఎంబ్రాయిడరీ, మ్యాచింగ్ జ్యువెలరీతో ఆమె లుక్ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.ముఖ్యంగా గణపయ్య ముందు చేతులు జోడించి నవ్వుతూ ఇచ్చిన పోజ్ ఫొటోకు నెటిజన్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.

Advertisement

అంతే కాకుండా ఆమె వెనుక ఉన్న గణేష్ మండపం అయితే మరో హైలైట్‌గా నిలిచిందనే చెప్పాలి. ఆరెంజ్, ఎల్లో కలర్‌లో వేలాడుతున్న బంతిపూల దండలు, చుట్టూ ఏర్పాటు చేసిన కలర్‌ఫుల్ ఫ్లవర్స్, మధ్యలో ఉన్న వినాయకుడి విగ్రహం.. మొత్తం సెటప్ చూస్తే ఇంట్లోనే చిన్నపాటి ఫెస్టివల్ సెలబ్రేషన్ జరిగినట్టుగా అనిపిస్తోంది.

 సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా

ప్రగ్యా జైస్వాల్‌ విషయానికి వస్తే సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తనదైన స్టాంప్ వేయడం తనకి అలవాటే. ఫ్యాషన్, ట్రావెల్, ఫిట్‌నెస్ అప్‌డేట్స్ పంచుకుంటూ అభిమానులకు డైలీ టచ్ లో ఉంటుంది కూడా.ఇక ఈ క్రమంలోనే ఆమె పెట్టే ప్రతి ఫొటోషూట్ లేదా వెకేషన్ పిక్స్ నెట్టింట క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.

అభిమానులకు మంచి విజువల్ ట్రీట్‌

తాజాగా చేసిన ఈ పోస్ట్ కూడా ఆమె గ్లామర్, లైఫ్‌స్టైల్ టేస్ట్‌ ఏంటో క్లియర్ గా చెప్పేస్తుంది.ఇందులో ఉన్న ఆమె గ్లామరస్ లుక్స్ అభిమానులకు మంచి విజువల్ ట్రీట్‌గా మారాయి. దీంతో ప్రగ్యా ఈజ్ బ్యాక్ అంటూ కొంతమంది కామెంట్ చేస్తుంటే పిక్స్ తగ్గించి సినిమాలు చేయొచ్చుగా అంటూ మరికొంతమంది సజీషన్ ఇస్తున్నారు.

 ఆమె కెరీర్‌ను మలుపు తిప్పిన ‘అఖండ’

ప్రగ్యా జైస్వాల్ మోడల్ గా కెరీర్ మొదలెట్టి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. క్రిష్ తెరకెక్కించిన చారిత్రక ప్రేమకథా చిత్రం ‘కంచె’లో తనదైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది.రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే ఆ చిత్రంలో ప్రగ్యా కనబరిచిన నటన, హోమ్లీ లుక్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి కూడా .

ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ, నందమూరి బాలకృష్ణ సరసన నటించిన ‘అఖండ’ చిత్రం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి, ప్రగ్యాకు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది.అయితే ఆ జోష్ ని తర్వాత కంటిన్యూ చేయకపోవడం గమనార్హం .

also read :గుప్పెడంత మనసు జగతి మేడం కొత్త రూట్.. ఫీజు మాత్రం చాలా తక్కువ!

మొత్తంగా సినిమాలు తగ్గించినా వరుస అప్ డేట్స్ ని అభిమానులతో షేర్ చేసుకుంటున్న ఈ భామ సినిమాలతో బిజీగా ఉండాలని కోరుకుందాం !

Tags

Related News

గణపతి పండగే.. కాని రాత్రి 11కి డీజేలు ఏంటి బాబోయ్! రేణు దేశాయ్ ఫైర్

నమ్మండి.. సాయం చేశా, ఇదిగో ప్రూఫ్.. పాపం సాయి ధరమ్ తేజ్!

ఆ సినిమా చేసి తప్పు చేసాను.. సదా అవకాశాలు కోల్పోవడానికి అదే కారణమా?

ప్యారడైజ్‌లో కేసీఆర్‌.. చూసి షాకవుతున్న ఆడియన్స్!

ఐదేళ్ల తరువాత కూడా నిలబడే ఉన్నాను..చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్న మెగా హీరో!

సందీప్ మాటలను నిజం చేయాలనిపిస్తోంది – ఫరియా అబ్దుల్లా

‘ప్యారడైజ్’ ఎక్కడ తేడా కొట్టిందో తెలుసా?

Big Stories

Advertisement
×