E-Paper
Advertisement

తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలి: భట్టి విక్రమార్క

తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలి: భట్టి విక్రమార్క
Advertisement

Telangana Tourism: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి, రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. పర్యాటక అభివృద్ధి అంటే కేవలం పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడం మాత్రమే కాదని, తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయడం కూడా అందులో భాగమేనన్నారు. హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ‎గురువారం పర్యాటక, సాంస్కృతిక శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

అధికారులకు దిశానిర్దేశం

Advertisement

రాష్ట్రంలోని పర్యాటక ప్రాజెక్టులు, శాఖ పరిధిలోని ఆస్తుల వినియోగం, బడ్జెట్ కేటాయింపులు, ప్రైవేట్ పెట్టుబడులు, చారిత్రక కట్టడాల పరిరక్షణ, పర్యాటక బ్రాండింగ్ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పెట్టుబడులు, ఉపాధి, ఆదాయ అవకాశాలను పెంచుతూ రాష్ట్ర పర్యాటక రంగాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ పర్యాటక రంగంలో ప్రభుత్వ పెట్టుబడులతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యాన్ని విస్తృతం చేయాలని, పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ)విధానంలో కొత్త ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని సూచించారు.

ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే చర్యలు

Advertisement

ప్రభుత్వ నిధులపై మాత్రమే ఆధారపడకుండా పర్యాటక శాఖకు చెందిన ఆస్తులను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. భవనాలు ఉన్న ఆస్తులు, ఖాళీ స్థలాలు, పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆదాయాన్ని సమకూర్చే విధంగా ఆస్తులను అభివృద్ధి చేయడంతో పాటు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే చర్యలు చేపట్టాలని సూచించారు.

టెంపుల్, ఎకో, హిల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి..

‎తెలంగాణలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హిల్ టూరిజం తదితర విభాగాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలన్నారు. హైదరాబాద్‌కు వచ్చే దేశీయ, విదేశీ పర్యాటకులను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఆకర్షించేలా ప్రత్యేక పర్యాటక సర్క్యూట్లను అభివృద్ధి చేయాలన్నారు. ‎రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపదను కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యతలో కీలక భాగమన్నారు. కొత్త పర్యాటక ప్రాజెక్టుల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సూచించారు. ‎విద్యార్థుల్లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పర్యాటక ప్రాంతాలపై అవగాహన పెంచేందుకు ‘తెలంగాణ దర్శిని’ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు.

ప్రైవేట్ పెట్టుబడులపై సర్కార్ మార్క్ ప్రణాళిక!

‎లీజు విధానాలు, ప్రాజెక్టుల ఆర్థిక సాధ్యత, పెట్టుబడిదారుల ఆసక్తి వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి అవసరమైన మార్పులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రకృతి వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ.. పెట్టుబడులు, ఉపాధి, ఆదాయం పెరిగేలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.  ఈ సమాజంలో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి, ఫైనాన్స్ ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, ఫైనాన్స్ సెక్రటరీ స్నిగ్ధా పట్నాయక్, టూరిజం ఎండీ గౌతమి, పర్యాటకశాఖ డైరెక్టర్ రంజిత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: రోడ్డు భద్రతకు రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్.. టీజీ-మార్స్ ఏర్పాటు!

Tags

Related News

రోడ్డు భద్రతకు రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్.. టీజీ-మార్స్ ఏర్పాటు!

ఖైరతాబాద్‌లో బీజేపీకి అగ్ని పరీక్ష.. కిషన్ రెడ్డి ఏం చేస్తారు?

నిమజ్జనం చేస్తూ మూసీలో పడ్డ వ్యక్తి.. తృటిలో తప్పిన ప్రమాదం!

కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయి.. సజ్జనార్ తాట తీస్తాం.. పాడి కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు!

ఏ వేళలో ఏ విగ్రహం? ఖైరతాబాద్, బాలాపూర్ గణపయ్యల నిమజ్జనం టైమింగ్స్, రూట్ ప్లాన్ ఇదే!

మేం ఎన్నికలకు భయపడం.. ఖైరతాబాద్‌లోనూ కాంగ్రెస్‌దే గెలుపు: ఎంపీ చామల

ఆయిల్ పామ్ రైతులకు ఊహించని షాక్.. కేంద్రం నిర్ణయంపై భగ్గుమన్న మంత్రి తుమ్మల!

Big Stories

Advertisement
×