E-Paper
Advertisement

గణపతి పండగే.. కాని రాత్రి 11కి డీజేలు ఏంటి బాబోయ్! రేణు దేశాయ్ ఫైర్

గణపతి పండగే.. కాని రాత్రి 11కి డీజేలు ఏంటి బాబోయ్! రేణు దేశాయ్ ఫైర్
Advertisement

Renu Desai: వినాయక చవితి అంటేనే హంగామా ..దేవుడిని తెచ్చేముందు డప్పు దరువులు, తీసికెళ్ళేముందు డీజే పాటలు చాలా కామన్.కానీ ఇదే విషయంపై తనదైన శైలిలో ఫైర్ అవుతుంది నటి కమ్ డైరెక్టర్ రేణు దేశాయ్ .మరింతకీ ఈ వెటరన్ భామ వినాయక నిమర్జనాలని ఉద్దేశించి అసలేమందో ,అవెందుకు సోషల్ మీడియాలో అంతలా వైరల్ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం.

రేణు దేశాయ్ తాజాగా వినాయక ఉత్సవాల సందర్భంగా పోస్ట్ పెడుతూ .. తాను హిందూ ధర్మానికి లేదా గణపతి భక్తికి వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తూనే, పండుగ పేరుతో అర్ధరాత్రి వరకు పెద్ద శబ్దాలతో పాటలు, డ్యాన్సులు చేయడం మాత్రం ఆలోచించాల్సిన విషయమని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా రాత్రి 11 గంటల సమయంలో బాగా తాగి మాస్ పాటలకి డాన్స్ లు చేయడం మన ఆచారాల్లో భాగం కాదని తన అభిప్రాయాన్ని తెలిపింది.

Advertisement

6-7 గంటలలోపు ముగిస్తే మంచిది 

“Guys, I will never talk negative about our Dharma! No one is a bigger bhakt or follower and fan of Ganpati Bappa” అంటూ గణపయ్య పట్ల, మన హిందూ ధర్మం పట్ల తన అభిప్రాయన్ని,భక్తిని ముందే స్పష్టం చేసింది రేణు. వినాయకుడిని ఎవరైనా భక్తితో ,ఆనందంగా జరుపుకోవాలని, డప్పులు కొట్టడంలో అసలు సమస్యనే లేదని తెలిపింది.అయితే ఆ కార్యక్రమం అంతా సాయంత్రం 6-7 గంటలలోపు ముగిస్తే మంచిదని సూచించింది.

Advertisement

హంగామా చేస్తుంటే చాలా ఇబ్బంది

సరిగ్గా విమర్శకులు తమ బాణాలని ఎక్కు పెట్టారు. రేణు దేశాయ్ హిందూ వ్యతిరేఖి అని ,హిందూ ధర్మం పై అసలే మాత్రం నమ్మకం లేదని నెట్టింటి వేదికగా చెడుగుడు ఆడేశారు.దీంతో రేణు దేశాయ్ తను చెప్పిన మాటల పట్ల మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తానకి దేవుడి పట్ల ఎంతో నమ్మకం ఉందని, ఇక వినాయక ఉత్సవాలని జరుపుకోవద్దని ఎవరూ అందం లేదని,కానీ ఇలా అర్థరాత్రి దాటిన తర్వాత కూడా విపరీతమైన డీజేలు, సౌండ్స్ తో హంగామా చేస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని తెలిపింది.

ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, చిన్నపిల్లలు రాత్రివేళ పెద్ద శబ్దాలతో ఇబ్బంది పడే అవకాశం ఉందని ఆమె గుర్తు చేసింది. “వాళ్ల పరిస్థితిని కూడా ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి” అనే అర్థంతో తాను ఆ పోస్ట్ పెట్టానని క్లారిటీ ఇచ్చింది.

కాశీ మజిలీ అనే ott ఫిలిమ్ లో నటించిన రేణు 

ఇక రేణు దేశాయ్ విషయానికి వస్తే బద్రి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈమె అందులో హీరోగా నటించిన పవన్ కకళ్యాణ్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెల్సిందే.ఇక కళ్యాణ్ తో విడాకులు తీసుకుని  ప్రస్తుతం సింగిల్ గా ఉంటున్న రేణు తాజాగా కాశీ మజిలీ అనే ott ఫిలిమ్ లో నటించింది మెప్పించింది.

also read :బాలయ్య భామను చూస్తే చూపు తిప్పుకోలేం.. ఏం అందమో!

చూడాలి మరి రేణు దేశాయ్ ఇచ్చిన క్లారిఫికేషన్ పై ఎలాంటి కామెంట్స్ కురుస్తాయో !

Tags

Related News

కింగ్ ఖాన్ కి భారీ షాక్.. రూ.2490 కోట్లు గోవిందా!

బాలయ్య భామను చూస్తే చూపు తిప్పుకోలేం.. ఏం అందమో!

నమ్మండి.. సాయం చేశా, ఇదిగో ప్రూఫ్.. పాపం సాయి ధరమ్ తేజ్!

ఆ సినిమా చేసి తప్పు చేసాను.. సదా అవకాశాలు కోల్పోవడానికి అదే కారణమా?

ప్యారడైజ్‌లో కేసీఆర్‌.. చూసి షాకవుతున్న ఆడియన్స్!

ఐదేళ్ల తరువాత కూడా నిలబడే ఉన్నాను..చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్న మెగా హీరో!

సందీప్ మాటలను నిజం చేయాలనిపిస్తోంది – ఫరియా అబ్దుల్లా

Big Stories

Advertisement
×