Puja Items: దేవుడి పూజలో ఎప్పుడైనా ప్రెష్‌గా ఉన్న వస్తువులనే వాడాలి అంటారు పండితులు. కానీ నాలుగు వస్తువులు మాత్రం ఎన్నిసార్లైనా వాడొచ్చని దాని వల్ల కలిగే దోషం ఏమీ ఉండదని చెప్తున్నారు. ఇంతకీ నాలుగు వస్తువులేంటి..? వాటిని తిరిగి ఎలా వాడాలి లాంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
హిందూ సాంప్రదాయంలో దేవుళ్లకు పూజ చేయడం అనేది ఒక ప్రయాసతో కూడుకున్న పని. పూజ చేసిన ప్రతిసారి దేవుడికి పాత వస్తువులు వాడకూడదు. పాత పూలు సమర్పించకూడదు. వాడిన వాటినే మళ్లీ వాడకూడదు. అలా వాడితే పూజా ఫలితం దక్కకపోవడమే కాదు.. పాత వస్తువులను వాడి పూజ చేసిన వ్యక్తికి దోషం అంటుంకుంటుందని శాస్త్రాల్లో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు. అయితే అదే శాస్త్రాల్లో నాలుగు వస్తువులు మాత్రం ఎన్ని సార్లైనా వాడొచ్చని ఉన్నట్టు పండితులు చెప్తున్నారు. అయితే ఆ వస్తువులు ఏంటి..? వాటిని తిరిగి పూజలో వాడే విధానం ఏంటి లాంటి పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గంగాజలం: హిందూ సాంప్రదయాంలో గంగాజలానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అలాంటి గంగాజలం ఎప్పటికీ పాతబడదట. గంగా జలాన్ని ఎన్నిసార్లైనా ఉపయోగించుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. అందుకే చాలా మంది గంగాజలాన్ని ఏళ్ల తరబడి ఇంట్లో భద్రంగా ఉంచుకుంటారు. ఎప్పుడు అవసరం వచ్చినా అదే గంగాజలాన్ని శుద్ది కోసం వినియోగిస్తారట.
బిల్వపత్రం: పరమ శివుడికి ఇష్టమైన అత్యంత ప్రీతికరమైనది బిల్వపత్రం. ఈ బిల్వపత్రం కూడా ఎన్నిసార్లు వాడినా పాతబడదట. ఇది ఎన్నిసార్లైనా వినియోగించవచ్చట. శివ లింగంపై బిల్వపత్రం ఓసారి సమర్పించినా మరోసారి అదే పత్రాన్ని శుద్ది చేసి శివ పూజలో ఉపయోగించవచ్చట. అలాగే శివుడికి ఈ బిల్వపత్రి అంటే చాలా ఇష్టం శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక్క దళం సమర్పించినా కూడా ఆయన కరుణిస్తాడట.
తామర పువ్వులు: శాస్త్రాలలో పాత పువ్వులు తిరిగి దేవుని పూజకు ఉపయోగించడం నిషిద్దం. అయితే ఈ నియమం తామర పువ్వులకు వర్తించదట. తామర పువ్వును కడిగి ఎన్నిసార్లైనా దేవుడికి సమర్పించవచ్చట. తర్వాత కడిగి మరొక పూజలో కూడా ఉపయోగించవచ్చట. ఇలా తామర పువ్వులను కడిగి ఐదు రోజుల వరకు లేదా అది వాడిపోయేవరకు ఉపయోగించవచ్చట.
తులసి: మహా విష్ణువు ప్రతికరమైనది తులసి. ఆ వాసుదేవుడి పూజలో తులసి తప్పనిసరిగా ఉండాలి. అయితే తులసి కొత్తగా లభించకపోతే పాత తులసినే మళ్లీ మళ్లీ పూజలో ఉపయోగించవచ్చట. ఇలా తులసి వాడిపోయే వరకు ఉపయోగించవచ్చని పండితులు సూచిస్తున్నారు. అయితే వాడిపోయిన తులసిని ఎప్పుడూ పడవేయకూడదట. ఎప్పుడైనా తులసిని పారే నీటిలో పడేయాలని సూచినస్తున్నారు. పారే నీరు లేని సమయంలో అయితే శుభ్రమైన ప్రదేశంలో వేయాలని పండితులు సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం – అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు.