Sudigali Sudheer Goat Movie:సుడిగాలి సుధీర్..పరిచయం అక్కరలేని పేరు ..మొదట్లో మెజీషియన్ గా మొదలెట్టిన కెరీర్ క్రమంగా జబర్దస్త్ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది.ఇక అప్పటి నుండి వెనుతిరిగి చూసుకొని ఈ సుధీర్ సినిమాల్లోనూ హీరో ఫ్రెండ్ గా కనిపించి మనల్ని అలరించాడు కూడా.ఇక ఆ తర్వాత సుధీర్ సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులే కొట్టేశాడు .
మూడేళ్ళ కిందట మొదలైన గోట్
అయినప్పటికీ ఎక్కడా టీవీ షోలు ఆపకుండా చేస్తూనే మధ్య మధ్యలో కాలింగ్ సహస్ర, గాలోడు,వాంటెడ్ పండుగాడు వంటి సినిమాలతో పర్లేదనిపించాడు.ఇక ఇదే క్రమంలో మూడేళ్ళ కిందట గోట్ అనే మరో సినిమాని కూడా మొదలెట్టాడు. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో దివ్య భారతి హీరోయిన్ గా మొదలైన ఈ సినిమా ఎన్నో అవాంతరాలతో మధ్యలో నిలిచిపోయింది.ముఖ్యంగా సినిమా దర్శకుడు నరేష్ కుప్పిలికి నిర్మాత మొగుళ్ల చంద్రశేఖర్ కి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో సినిమా వాయిదా పడినట్టు తెలుస్తుంది.
అసలు సినిమా రిలీజ్ అవుతుందా
ఒకవైపు షూటింగ్ ఆలస్యం కావడం, మరోవైపు సినిమా టీమ్‌కు సంబంధించిన విషయాలు బయటకు రావడంతో అసలు సినిమా రిలీజ్ అవుతుందా అన్న టాక్ కూడా వినిపించింది. దీనికి తోడు హీరోయిన్ దివ్య భారతి చేసిన కొన్ని కామెంట్స్ కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. దర్శకుడు నరేష్ కుప్పిలి తనతో తప్పుగా ప్రవర్తించారంటూ ఆమె చేసిన కామెంట్స్ ప్రాజెక్ట్‌పై బాగానే ప్రభావం చూపెట్టాయి .
నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్
ఇక అన్ని సమస్యలను దాటుకుని ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైందని మేకర్స్ అనౌన్స్ చేయడం విశేషం. తాజాగా నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా ‘గోట్’ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అఫీషియల్ గా తెలిపారు మేకర్స్ .దీంతో గతంలో కూడా ‘గోట్’ సినిమా అప్పుడు రిలీజ్ ..ఇప్పుడు రిలీజ్ అంటూ బోలెడు వార్తలు వినిపించాయి.మరి ఈ తేదీన అయినా సినిమా వస్తుందా లేక ఎప్పటిలాగే మేము ఇప్పట్లో రాలేము అంటూ పోస్ట్ పోన్ చేసుకుంటారా అన్న కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి.
కోరిక నేరవేరుస్తుందా లేక డిసప్పాయింట్ చేస్తుందా !
అయితే సినిమా రిలీజ్ సందర్భంగా సుధీర్, దివ్య భారతి రొమాంటిక్ లుక్‌లో ఉన్న కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్ . ‘ది వెయిట్ ఈజ్ ఓవర్’ అంటూ ఇచ్చిన క్యాప్షన్‌తో ఈసారి రిలీజ్ విషయంలో మేకర్స్ సీరియస్‌గా ఉన్నారనే తెలుస్తుంది.చూడాలి మరి అన్నట్టుగా సినిమా నిజంగానే వచ్చి సుడిగాలి సుదీర్ ఫ్యాన్స్ కోరిక నేరవేరుస్తుందా లేక ఎప్పటిలాగే డిసప్పాయింట్ చేస్తుందా !