E-Paper
Advertisement

ఖమ్మంలో రూ. 34 లక్షల ఎక్సైజ్ శాఖ కొత్త భవనం.. ప్రారంభానికి ముందే పగుళ్లు!

ఖమ్మంలో రూ. 34 లక్షల ఎక్సైజ్ శాఖ కొత్త భవనం.. ప్రారంభానికి ముందే పగుళ్లు!
Advertisement

Excise Office: ఇది ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని ఎక్సైజ్ శాఖ కొత్త కార్యాలయం. ప్రభుత్వ కార్యాలయం కోసం సుమారు 34 లక్షలతో నిర్మించారు. ఐదేళ్లు గడిచినా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. అటు అధికారులు మాత్రం ఏళ్లుగా అద్దె భవనంలోనే విధులు నిర్వహిస్తున్నారు.

స్థానికులు అనుమానాలు..

సొంత భవనం ఇలా ఉంటే ఎలా వినియోగంలోకి తీసుకురావాలన్నదే ప్రశ్న. భవనం గోడలకు పెద్దపెద్ద పగుళ్లు కనిపిస్తున్నాయి. తలుపులు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల ఊడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. గదుల్లో ఫ్లోరింగ్ కూడా కుంగిపోయింది. ప్రారంభోత్సవానికి ముందే భవనం ఈ స్థితికి చేరడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు సొంత భవనం నిరుపయోగంగా ఉంటే.. మరోవైపు అద్దె భవనంలోనే ఎక్సైజ్ కార్యాలయం కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వానికి అదనపు అద్దె భారం పడుతోందని స్థానికులు చెబుతున్నారు.

కార్యాలయాన్ని తరలిస్తారా?

Advertisement

నేలకొండపల్లితో పాటు కూసుమంచి, ముదిగొండ మండలాల ప్రజలకు ఈ కార్యాలయం సేవలు అందిస్తోంది. అలాంటి శాఖకు శాశ్వత భవనం ఉన్నా అది అందుబాటులోకి రాకపోవడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. భవనాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. నిర్మాణ లోపాలు ఉంటే గుర్తించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. ప్రజాధనంతో నిర్మించిన భవనం ప్రారంభానికి ముందే పాడైపోవడానికి కారణమేంటి? నిర్మాణ నాణ్యతపై సమగ్రంగా తనిఖీ చేశారా? మరమ్మతులు పూర్తయ్యాకే కార్యాలయాన్ని తరలిస్తారా?ఈ ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది.

Also read: దేశంలో 13 శాతం వర్షపాతం లోటు.. ఆహార భద్రతపై నిపుణులు ఆందోళన!

Tags

Related News

దేశంలో 13 శాతం వర్షపాతం లోటు.. ఆహార భద్రతపై నిపుణులు ఆందోళన!

మహారాష్ట్రలో డేంజర్ బెల్స్.. రైతు రుణాలు నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు!

రాజకీయాల్లోకి వచ్చి నష్టపోయా! లేకపోతే.. మరో పది హోటళ్లు పెట్టేవాడిని..! ఆల్తుఫాల్తు గాన్ని కాదు.. ఆదాయం ఊరికే రాలేదు…!

గులాబీకి సవాల్‌గా ఖైరతాబాద్ ఎన్నిక.. సరైన అభ్యర్థి ఎంపికకోసం మల్లగుల్లాలు..!

ఈ టోల్ ఫ్రీ 1064 నెంబర్‌కి ఫిర్యాదు చేసేముందు ఇది చదవండి.. వెలుగులోకి షాకింగ్ రిపోర్ట్!

నామినేటెడ్ పదవుల ఎంపికలో సీఎం రేవంత్ సంచలనం.. వారికే పెద్దపేట?

రేవంత్‌ పొలిటికల్‌ గేమ్‌లో సెల్ఫ్‌గోల్‌! అధికార పార్టీపై కౌంటర్‌ స్ట్రాటజీ అట్టర్‌ ఫ్లాప్.. తామే సీఎంకు అస్త్రాలను అంధించి..!

Big Stories

Advertisement
×