Usman Khawaja On Ricky Ponting: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును బాల్ టాంపరింగ్ (Ball tampering) వ్యవహారం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) ఇటీవల తన ఆత్మకథలో షాకింగ్ నిజాలను పంచుకున్నాడు. బాల్ టాంపరింగ్ వ్యవహారంలో ఆస్ట్రేలియా క్రికెటర్లందరూ దోషులేనని స్పష్టం చేశాడు. దీంతో మీడియాతో పాటు సామాజిక మాధ్యమాలలో ఈ బాల్ టాంపరింగ్ వ్యవహారం గురించి చర్చ నడుస్తోంది.
ఇలాంటి క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పై (Ricky Ponting) ఉస్మాన్ ఖవాజా సంచలన ఆరోపణలు చేసినట్టు మరో న్యూస్ బయటకు వచ్చింది. 2003 ప్రపంచ కప్ టోర్నమెంట్ సందర్భంగా రికీ పాంటింగ్ స్ప్రింగులు ఉన్న బ్యాట్లను వినియోగించాడని ఉస్మాన్ ఖవాజా పేర్కొన్నట్టు ఓ న్యూస్ వైరల్ గా మారింది. అందుకే 2003 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించినట్లు అతడు పేర్కొన్నాడని సమాచారం. దీంతో ఉస్మాన్ ఖవాజా చేసిన ఆరోపణలు వైరల్ గా మారాయి.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా ఇటీవల కాలంలోనే సబ్ర్ పేరుతో ఆత్మకథను రాసుకున్నాడు. ఇందులో తన పర్సనల్ లైఫ్ తో పాటు క్రికెట్ ఆస్ట్రేలియాలో జరిగిన సంఘటనలపై సంచలన విషయాలను బయటపెట్టాడు. ముఖ్యంగా 2018 కెప్టెన్ టెస్ట్ సందర్భంగా జరిగిన సాండ్ పేపర్ బాల్ టాంపరింగ్ అంశంపై షాకింగ్ నిజాలను పంచుకున్నాడు. ఈ ఘటనలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్ క్రాఫ్ట్ మాత్రమే బలి పశువులు అయ్యారని అతడు తెలిపాడు. కానీ ఆస్ట్రేలియా జట్టులో ఉన్న క్రికెటర్లు అందరూ బాల్ టాంపరింగ్ చేస్తారని బాంబు పేల్చాడు. డ్రెస్సింగ్ రూమ్ లోనే బాల్ టాంపరింగ్ ఎలా చేయాలనే దానిపైన చర్చ జరుగుతుందని స్పష్టం చేశాడు.
ప్రతి ఒక్కరూ బాల్ టాంపరింగ్ చేసి తీరాల్సిందేనని తెలిపాడు. 2018లో జట్టులో ఉన్న సభ్యులందరూ బాల్ టాంపరింగ్ చేస్తే కేవలం ముగ్గురు మాత్రం బలి అయినట్టు వెల్లడించాడు. దీంతో ఉస్మాన్ ఖవాజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే తన ఆత్మ కథలో మరో కీలక విషయాన్ని ప్రస్తావించినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ గా మారింది. 2003 ప్రపంచ కప్ టోర్నమెంట్ విజేతగా ఆస్ట్రేలియా నిలవడం వెనుక కుట్ర జరిగినట్టు అతను పేర్కొన్నాడట. ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ బ్యాట్ లో స్ప్రింగులు పెట్టుకొని బరిలోకి దిగడంతో వరల్డ్ కప్ గెలిచినట్టు ప్రస్తావించినట్లు చెబుతున్నారు. లేకపోతే 2003లో టీమిండియా చాంపియన్ అయ్యేదని అతడు పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ ఆరోపణ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.