E-Paper
Advertisement

ఎన్టీఆర్ కి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా.. అది మాత్రం కంపల్సరిగా ఉండాల్సిందే?

ఎన్టీఆర్ కి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా.. అది మాత్రం కంపల్సరిగా ఉండాల్సిందే?
Advertisement

NTR:సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక్కో ఆహార పదార్థం అంటే అమితంగా ఇష్టం ఉంటుంది. ఆ ఆహారం కళ్ళ ఎదుట ఉంటే ఎలాంటి డైట్లో ఉన్నా సరే కచ్చితంగా ఆరగించాలి అనే కుతూహలం కూడా పెరిగిపోతుంది. కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల ఇష్టమైన ఫుడ్ ని కూడా పక్కన పెట్టేసి.. కష్టమైన వర్కౌట్స్ తో కాలాన్ని వెల్లదీస్తున్నారు సెలబ్రిటీలు. ఇకపోతే తమ సెలబ్రిటీలకు సంబంధించిన ఇష్టమైన ఆహార పదార్థాల గురించి తెలుసుకోవాలని అభిమానులు కూడా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్కి ఇష్టమైన ఫుడ్ ఏంటి ? దేనిని ఆయన చాలా ఇష్టంగా తింటారు ? అనే కామెంట్లు కూడా అభిమానుల నుంచి వ్యక్తం అవుతున్న నేపథ్యంలో సడన్గా ఎన్టీఆర్ కి ఇష్టమైన ఫుడ్ గురించి ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎన్టీఆర్ కి ఇష్టమైన ఫుడ్.. ఆదివారం అది ఉండాల్సిందే!

సాధారణంగా ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు తమకు ఇష్టమైన మాంసాహారాన్ని చాలా ప్రత్యేకంగా వండించుకొని మరీ తింటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక అందరిలాగే ఎన్టీఆర్ కూడా ఆదివారం వచ్చిందంటే చాలు తప్పనిసరిగా నాటుకోడి తందూరిని చాలా ఇష్టంగా తింటారట .ముఖ్యంగా ఇది ఎలా వండాలో కూడా ఆయనే స్వయంగా తన భార్యకు నేర్పించినట్లు సమాచారం. కోడి మొత్తాన్ని కాల్చి.. దానికి నెయ్యి, పెరుగు , కారం దట్టించి రోటీ తో తింటే ఆ మజాయే వేరు అంటూ చాలా సందర్భాలలో ఎన్టీఆర్ కూడా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఎన్టీఆర్ కి ఇష్టమైన ఈ ఆహారం గురించి తెలిసి అభిమానులు కూడా మేము కూడా ఒకసారి ట్రై చేస్తాం అనే రేంజ్ లో కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ కి ఇష్టమైన ఈ ఆదివారం ఫుడ్ సీక్రెట్ అందర్నీ ఆకట్టుకుంటుంది.

ఆంధ్ర వంటకాల స్పెషల్..

Advertisement

ఇక వీటితోపాటు తెలుగు సాంప్రదాయ వంటకాలు, నూనెలో బాగా వేయించిన పునుగులు, హైదరాబాద్ బిర్యానీ అంటే కూడా ఎన్టీఆర్ కి బాగా ఇష్టం. ముఖ్యంగా ఆంధ్ర వంటకాల కోసం గతంలో హైదరాబాదులోని కాకతీయ డీలక్స్ మెస్ ను ఎక్కువగా సిఫారసు చేసేవారు ఎన్టీఆర్.

ALSO READ:Kissik Talks: ఆ క్షణం చనిపోవాలనిపించింది – ప్రియా శెట్టి!

ఎన్టీఆర్ సినిమాలు..

Advertisement

ఎన్టీఆర్ కెరియర్ విషయానికి వస్తే స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన పదుల సంఖ్యలో సినిమాలు చేసి నేడు గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో గ్లోబల్ వైడ్ ఇమేజ్ తో పాటు జపాన్ వంటి దేశాలలో మరింత క్రేజ్ దక్కించుకున్నారు ఎన్టీఆర్. ఈ చిత్రం తర్వాత దేవర సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్.. హిందీలో వార్ 2 చిత్రంతో తొలి సినీ రంగ ప్రవేశం చేశారు. కానీ ఇది పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ప్రశాంత్ నీళ్ దర్శకత్వంలో డ్రాగన్ తో పాటు కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 సినిమాలలో నటిస్తున్నారు

Related News

వారి టార్చర్ వల్లే వదిలేసా -ఐశ్వర్య లక్ష్మీ

యష్ ‘టాక్సిక్’ కథ లీక్..ఆ సెంటిమెంట్ వింటే మైండ్ పోవాల్సిందే!

బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!

రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?

జయకృష్ణ సీక్రెట్ లీక్ చేసిన రషా.. ‘శ్రీనివాస మంగాపురం’ సెట్స్‌లో ఏం జరిగిందంటే?

మరో కొత్త సినిమాతో ‘లెనిన్ ‘డైరెక్టర్.. ఒక హిట్.. క్రేజీ హీరోతో ఛాన్స్!

NBK 111:బాబాయ్ కోసం అబ్బాయ్ ఎమోషనల్ మెసేజ్.. జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నాడంటే?

జాన్ అబ్రహం కొత్త ఇల్లు ఎంతో తెలుసా ..రేటు చూస్తే మతి పోవాల్సిందే !

Big Stories

Advertisement
×