Vijay Deverakonda: అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయారు రౌడీ హీరో అలియాస్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) . హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించిన ఈయన.. నాని (Nani) నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో తొలిసారి ఫుల్ లెంగ్త్ పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరిని మెప్పించారు. ఈ సినిమా తర్వాత ‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరోగా మారి.. అర్జున్ రెడ్డి తో స్టార్ అయిపోయారు. ఇక ఆ తర్వాత చేసిన ‘గీతగోవిందం’ కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ద్వారక, డియర్ కామ్రేడ్, టాక్సీవాలా ఇలా పలు చిత్రాలు చేశారు.
కింగ్ డం మూవీతో మళ్లీ గాడిన పడ్డ విజయ్ దేవరకొండ..
ఇకపోతే ఈ మధ్యకాలంలో సినిమాలు చేస్తున్నారు కానీ సరైన సక్సెస్ లభించలేదని చెప్పవచ్చు. ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ‘లైగర్’ సినిమా చేశారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఊహించని డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత చేసిన ‘ఖుషీ’ సినిమా పర్వాలేదు అనిపించినా ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా మాత్రం డిజాస్టర్ గానే నిలిచింది. ఇక ఇప్పుడు అలా వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో ‘కింగ్డమ్’ సినిమా చేశారు. ఈ సినిమా జూలై 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.
ఆశ్చర్యపరుస్తున్న విజయ్ దేవరకొండ మూవీ లైనప్..
ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారు అనే విషయం వైరల్ గా మారగా.. ఆయన తదుపరి లైనప్ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లిస్టులో అందరూ బడా డైరెక్టర్లే ఉండడం గమనార్హం. ఇక విజయ్ దేవరకొండ నెక్స్ట్ నటించబోయే సినిమా లైనప్ విషయానికి వస్తే.. ప్రముఖ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ తో కలిసి రాయలసీమ నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత వి.కిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ పై ఆంధ్రాబ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేయనున్నారు విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ (Sukumar), డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) లతో కూడా సినిమాలు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తానికి అయితే అందరూ బడా డైరెక్టర్లనే లైన్ లో పెట్టిన రౌడీ హీరో ఈ సినిమాలతో ఎలాంటి స్థాయిని సొంతం చేసుకుంటారో చూడాలి.
కింగ్డమ్ సినిమా విశేషాలు..
కింగ్డమ్ సినిమా విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ హీరోగా .. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించారు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సత్యదేవ్ కీలకపాత్ర పోషించారు. అలాగే మలయాళ నటుడు వీపీ వెంకటేష్ విలన్ పాత్ర పోషించారు.
ALSO READ:Tollywood: సోషియో ఫాంటసీ మూవీతో అల్లరి నరేష్.. రేపే పూజా కార్యక్రమం!