Indiramma Canteens: భాగ్యనగర వాసులకు ఇది పండుగ లాంటి శుభవార్త.. దసరా పండుగ వేళ ఈ గుడ్ న్యూస్ చెప్పడానికి రేవంత్ సర్కార్ రెడీ అయ్యింది. హైదరాబాద్ వాసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 5 రూపాయలకే టిఫిన్ అందించే ఇందిరమ్మ క్యాంటీన్లును ఈ నెల చివరలో స్టార్ట్ చేసే యోచనలో జీహెచ్ఎంసీ ఉంది. దసరా పండుగ వేళ ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకం వైభవంగా ప్రారంభం కానుంది.
హైదరాబాద్ మహా నగరంలో పేదలు, కార్మికులు, సామాన్య ప్రజలకు సరసమైన ధరల్లో పౌష్టికాహారం అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ క్యాంటీన్ల స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా 5 రూపాయలు మాత్రమే చెల్లించి రుచికరమైన టిఫిన్ (బ్రేక్‌ఫాస్ట్) పొందవచ్చు. ఇది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో మరో ముందడుగు అని చెప్పవచ్చు. ఈ స్కీమ్ పాత అన్నపూర్ణ క్యాంటీన్లను మార్చి మరింత విస్తరణతో అమలు చేస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘అన్నపూర్ణ క్యాంటీన్లు’గా ప్రారంభమైన ఈ స్కీం రూ.5కు లంచ్ (మధ్యాహ్న భోజనం) అందించేది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ‘ఇందిరా క్యాంటీన్లు’గా మార్చి బ్రేక్‌ఫాస్ట్‌ను కూడా చేర్చింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరుతో ఈ పేరుతో ఈ స్కీంను అమలు చేస్తున్నారు. ఇది పేదల సంక్షేమానికి ఆమె చేసిన కృషిని గుర్తుచేస్తుంది. రేవంత్ సర్కార్ పేదలు, సామాన్యుల ఆకలి తీర్చడం కోసం ఇందిరమ్మ క్యాంటీన్లు తీసుకువచ్చింది.
ఈ స్కీం బ్రేక్‌ఫాస్ట్ మెనూలో ఇడ్లీ, ఉప్మా, పొంగల్, పూరి వంటి పౌష్టికరమైన భోజనం ఉంటుంది. ఇవి పోషకాహారం ఉన్న ధాన్యాలతో తయారు చేస్తారు. ప్రతి టిఫిన్ ప్లేట్ అసలు ధర రూ.19 కాగా.. బెనిఫిషరీలు కేవలం రూ.5 చెల్లిస్తారు. మిగిలిన రూ.14ను జీహెచ్‌ఎంసీ సబ్సిడీగా ఇస్తుంది. ఈ సబ్సిడీ హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్‌కు చెల్లిస్తారు. ఇది కిచెన్ ఆపరేషన్లను నిర్వహిస్తుంది. లంచ్ కూడా అదే ధరకు అందుబాటులో ఉంటుంది.
ALSO READ: Bandi Sanjay vs KTR: నీ అమెరికా బాగోతం మొత్తం బయటపెడుతా.. కేటీఆర్ కు బండి వార్నింగ్
ఈ సదుపాయం రోజువారి కూలీలు, నిరుద్యోగ అభ్యర్థులు, స్టూడెంట్స్ కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ స్కీం స్టార్ట్ కోసం భాగ్యనగర వాసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో దసరా పండుగ సందర్భంగా ఈ నెల చివరలో ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
ఇప్పటికే భాగ్య నగరంలో ఉన్న జీహెచ్ఎంసీ స్టాళ్లలో లంచ్ 5 రూపాయలకే అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదే స్టాళ్లలో వారంలో ఆరు రోజుల పాటు ప్రతి రోజు మార్నింగ్ సమయంలో టిఫిన్లు ప్రవేశ పెట్టనున్నారు. ఇంతకు ముందు నగరంలో మొత్తం 139 స్టాల్స్ నిర్వహణలో ఉండేవి. వీటి సంఖ్యను ప్రస్తుతం 150కి పెంచారు. ప్రస్తుతం నగరంలో 60 ప్రాంతాల్లో స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి. గతంలో ఉన్న స్టాల్స్‌తో కంపేర్ చేసి చూస్తే.. కొత్త స్టాల్స్ మూడింతల వెడల్పుతో విశాలంగా ఉన్నాయి. వీటి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.11.43 కోట్లు ఖర్చు పెట్టింది.