OTT Movie : దుమ్మురేపే యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు చూడడానికి యూత్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అండర్ వరల్డ్ ప్రపంచం, గ్యాంగ్‌స్టర్‌ల మధ్య ఘర్షణలు, పోలీస్ వేటతో గ్రిప్పింగ్ బ్లడ్ బాత్ గా మారే సినిమాలు ఇటీవల కాలంలో చాలానే వచ్చాయి. దాదాపుగా ఇప్పుడు అలాంటి సినిమాలే ట్రెండింగ్. అలాంటి ఓ కన్నడ క్రైమ్ థ్రిల్లర్ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ మొదటి సీన్ నుండే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. రా వయోలెన్స్, మాస్ డైలాగ్స్, సూరి సిగ్నేచర్ స్టైల్‌తో అండర్‌వరల్డ్ రియలిస్టిక్ సీన్స్ తో ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ అభిమానులకు తప్పక చూడాల్సిన మూవీ.
Tagaru కన్నడ యాక్షన్ క్రైమ్ మూవీ. దునియా సూరి దర్శకత్వంలో, కె.పి. శ్రీకాంత్ నిర్మాణంలో వీనస్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్ పై రూపొందింది ఈ మూవీ. 2018 ఫిబ్రవరి 23న థియేటర్స్‌లో రిలీజ్ అయింది. Sun NXT ఓటీటీలో అందుబాటులో ఉంది. శివరాజ్‌కుమార్ (శివకుమార్), భవనా (పునర్వసు), ధనంజయ (దాలి), మన్వితా హరిష్ (పంచమి), వశిష్ట N. సిమ్హా (చిట్టె), దేవరాజ్, అచ్యుత్ కుమార్, కె.జె. సాచు, సుధాకర్, సుధీర్, సుధా బెలవాడి, అనితా భట్, ప్రశాంత్ సిద్ది, సుధీర్ ఉర్స్, గుజ్జల్ ఇందులో నటించారు. IMDbలో ఈ మూవీకి 7.9 రేటింగ్ ఉంది. శివరాజ్‌కుమార్, ధనంజయ అద్భుతమైన పర్ఫార్మెన్స్‌లు, చారణ్ రాజ్ మ్యూజిక్, మహేంద్ర సిమ్హా సినిమాటోగ్రఫీ ప్రశంసలు అందుకుంది. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 75 కోట్లు కలెక్ట్ చేసి, 2018లో కన్నడ బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. అలాగే ఈ మూవీ కన్నడ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్టర్ (ధనంజయ), బెస్ట్ విలన్ అవార్డులు గెలుచుకుంది.
కథ శివ కుమార్ (శివరాజ్ కుమార్) చుట్టూ తిరుగుతుంది. అతను ఒక ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పోలీసు ఆఫీసర్. సమాజంలో తప్పులు చేసే వారిని అంతం చేయాలని ప్రతిజ్ఞ పూనుతాడు. అయితే అతని జీవితంలో పునర్వసు (భవనా) అనే యువతి ప్రవేశిస్తుంది. ఆమె అతనితో ప్రేమలో పడుతుంది. శివ కుమార్ అండర్‌వరల్డ్ గ్యాంగ్‌లతో, ముఖ్యంగా డాలి (ధనంజయ) అనే రూథ్‌లెస్ క్రిమినల్‌తో ఘర్షణ పడతాడు. డాలి, ఒక బ్రూటల్ గ్యాంగ్‌స్టర్. అతని గ్యాంగ్ మెంబర్స్ చిట్టె (వాసిష్ట N. సిమ్హా), పంచమి (మన్వితా కామత్)తో కలిసి సమాజాన్ని భయపెట్టి, క్రైమ్ ఎంపైర్ ను నడుపుతాడు.
శివ కుమార్ ఓవైపు డ్యూటీ చేస్తూ, మరోవైపు డాలి గ్యాంగ్‌ను ఎదుర్కొంటాడు. ఇంకోవైపు లవర్ తో పర్సనల్ టైం స్పెండ్ చేస్తాడు. ఆ తరువాత శివ కుమార్ – డాలి మధ్య పర్సనల్ రివేంజ్ ఉన్నట్టు రివీల్ అవుతుంది. క్లైమాక్స్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌తో ముగుస్తుంది. మరి చివరి ఫైట్ లో విన్ అయ్యింది ఎవరు? అసలు హీరోకి, విలన్ కి మధ్య ఉన్న వైరం ఏంటి? అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : గ్రామంలో వరుస హత్యలు… శవాలు మాయం… భార్య కోసం ఏకంగా ఊరినే లేపేసే ప్లాన్ వేసే సైకో