E-Paper
Advertisement

Suriya 46: సూర్య, వెంకీ అట్లూరి సినిమా టైటిల్ ఇదేనా?.. ఫుల్ డిటైల్స్ ఎప్పుడంటే?

Suriya 46: సూర్య, వెంకీ అట్లూరి సినిమా టైటిల్ ఇదేనా?.. ఫుల్ డిటైల్స్ ఎప్పుడంటే?
Advertisement

Suriya 46: కోలీవుడ్ స్టార్ సూర్య ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోతున్న ఫ్యామలీ ఓరియంటెడ్ చిత్రం ‘సూర్య 46’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా టైటిల్ ‘విశ్వనాధన్ అండ్ సన్స్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు చిత్ర పరిశ్రమలో వార్త తెగ చక్కర్లు కొడుతోంది. లక్కీ భాస్కర్ హిట్ తో మంచి జోష్ మీద ఉన్న వెంకీ అట్లూరి సూర్య సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు విడుదల చేసేందుకు మూవీ టీ సిద్దమైంది. పూర్త వివరాలు ఫిబ్రవరి 15 వ తేదీన వెళ్లడించనున్నరు. ఈ సినిమా అప్డేట్ కోసం సూర్య అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also- Dhurandhar The Revenge Teaser: రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ ది రివేంజ్’ టీజర్ వచ్చేసింది చూశారా.. ఈ సారి తెలుగులో..

నేపథ్యం

Advertisement

ఈ సినిమా పీరియడ్ డ్రామా లేదా ఒక బలమైన సామాజిక అంశంతో కూడిన ఎమోషనల్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. ఇందులో సూర్య ఒక విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం 45 ఏళ్ల వ్యక్తికి, 20 ఏళ్ల యువతికి మధ్య ఉండే సంబంధం చుట్టూ తిరుగుతుందని సమాచారం. సూర్య ఈ సినిమాలో ద్విపాత్రాభినయం (Dual Role) చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్, బాలీవుడ్ నటి రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సూర్య సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చే జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ (OTT) హక్కులను నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

Read also-Shruti Haasan: గొప్ప మనసు చాటుకున్న శృతిహాసన్.. చిన్నారి పాలిట దేవతగా!

Related News

బాలకృష్ణతో జాగ్రత్తగా ఉండాలి..తేడా వస్తే దబిడి దిబిడే అంటున్న హీరో!

రామాయణ ప్రీ రిలీజ్ ఈవెంట్…సింగర్ గా మారిన సాయి పల్లవి.. ఫిదా అవ్వాల్సిందే!

యశ్ టాక్సిక్ డిజాస్టర్ పై దిల్ రాజు కామెంట్స్.. ఇంటర్నేషనల్ లెవెల్ అంటూ!

కాఫీ విత్ కరణ్‌ షోలో ‘విరోష్’ సందడి.. విజయ్ -రష్మిక పెళ్లి రహస్యం లీక్‌!

తెరపైకి సింగర్ పీ సుశీలమ్మ బయోపిక్ చిత్రం? హీరోయిన్ ఎవరంటే?

ఆదర్శ కుటుంబం సెకండ్ సింగిల్ ‘మాల’ లిరికల్ సాంగ్ రిలీజ్!

కావ్యతో పెళ్లి.. వైరల్ గా మారిన అనిరుధ్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్!

జైలర్ 2 మూవీ.. రజిని మనవడి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×