Tanveer Ahmed: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) నేపథ్యంలో పాకిస్తాన్, ఇండియా ( India vs Pakistan ) మ్యాచ్ రద్దు అయ్యే ప్రమాదం పొంచి ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan national cricket team) సంచలన ప్రకటన చేసింది. దీనిపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. అయితే, ఇండియాతో జరిగే మ్యాచ్ ను బహిష్కరించడం పైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ) స్పందించారు. పాకిస్తాన్ పేరు ఎత్తితేనే ఇండియా గజగజ వణికి పోతుందని… అందుకే తామే మ్యాచ్ బాయ్ కాట్ ( Pakistan Boycott) చేసినట్లు వింత వ్యాఖ్యలు చేశారు తన్వీర్ అహ్మద్. ఇండియాను ఓడించిన చరిత్ర మాకు వద్దు.. అందుకే వాళ్ళను వదిలేసామని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో తన్వీర్ అహ్మద్ పైన ఇండియన్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) నేపథ్యంలో ఇండియాతో జరిగే మ్యాచ్ ను పాకిస్తాన్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డును వ్యతిరేకిస్తూ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఇలాంటి వాళ్లు విమర్శలు చేస్తుంటే, మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ మాత్రం డిఫరెంట్ గా స్పందించారు. పాకిస్తాన్ ను చూస్తే ఇండియాకు వణుకు పుడుతోందని… ఇలాంటి సమయంలో మళ్లీ ఐసీసీ టోర్నమెంట్ లో ఓడించడం ఎందుకని, బాయ్ కాట్ చేసినట్లు వెల్లడించారు. ఈ టోర్నమెంట్ లో ఇండియన్ ఓడించి, చరిత్రలో పాకిస్తాన్ నిలిచే ఛాన్స్ ఉంది.. దీనిపై పుస్తకాలు కూడా రాసేవాళ్లు అంటూ వ్యాఖ్యానించారు. అదంతా తమకు వద్దని… ఇండియాతో జరిగే మ్యాచ్ బహిష్కరించినట్లు వింత వ్యాఖ్యలు చేశారు తన్వీర్ అహ్మద్. కానీ పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఇండియాకు భయపడలేదని వ్యాఖ్యానించారు.
తన్వీర్ అహ్మద్ ఇలా వ్యవహరిస్తుంటే.. షోయబ్ అక్తర్ ( Shoaib Akthar), రమీజ్ రాజా ( Ramiz Raja) లాంటి వాళ్లు మాత్రం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఐసీసీ నుంచి వచ్చే నిధుల పైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నడుస్తోందని… ఇలాంటి నేపథ్యంలో ఇండియాతో మ్యాచ్ బహిష్కరించడం చాలా తప్పు అని పేర్కొంటున్నారు. ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే పాకిస్తాన్ రోడ్డున పడడం గ్యారంటీ అంటూ రమీజ్ రాజా హెచ్చరించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ నుంచి దాదాపు 70 శాతం నిధులు వస్తున్నాయని గుర్తు చేశారు. అయితే, మ్యాచ్ బాయ్ కాట్ చేస్తే ఆ నిధులు కట్ అయ్యే ప్రమాదం పొంచి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.
🚨 TANVEER AHMED SAID ABOUT T20 WC 🚨
"India is so afraid of us; that's why we don't want to play against them." pic.twitter.com/iJacja5ocw
— Cricket Central (@CricketCentrl) February 2, 2026