SVC Producer: రామ్ చరణ్ (Ram Charan).. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer). ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి షో తోనే నెగిటివ్ టాకు తెచ్చుకుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో అటు హీరో కానీ ఇటు డైరెక్టర్ కానీ కనీసం మాట వరసకు కూడా ఫోన్ చేసి అడగలేదని నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
గేమ్ ఛేంజర్ కోసం మూడేళ్లు సమయం కేటాయించిన రామ్ చరణ్..
అసలు విషయంలోకి వెళ్తే.. రాజమౌళి(Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రామ్ చరణ్ చేసిన సినిమా కావడంతో గేమ్ ఛేంజర్ పై డైరెక్టర్ శంకర్ పూర్తి ఫోకస్ పెట్టారు. దాదాపు మూడు సంవత్సరాల పాటు ఈ సినిమా కోసం పనిచేశారు. మధ్యలో ఇండియన్ 2 సినిమా కూడా పూర్తి చేసినా.. ఈ సినిమా పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అటు రామ్ చరణ్ కూడా ఈ ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తూనే వచ్చారు. ఎంతలా అంటే వేరే ప్రాజెక్టు లోకి అడుగుపెడితే మళ్ళీ లుక్స్ కి ఇబ్బంది అవ్వకూడదని రామ్ చరణ్ ఈ సినిమా కోసం టైం కేటాయించారు. చివరికి శంకర్ తీసిన ఈ సినిమాతో నిర్మాత దిల్ రాజుకి పెద్ద దెబ్బ పడిందని చెప్పవచ్చు. అయితే ఒక వర్గం వారు మాత్రం ఈ సినిమాకి డబ్బులు పెట్టింది జీ సంస్థ అని, ఈ సినిమా హక్కులను జీ కి దిల్ రాజు ఎప్పుడో అమ్మేశారు కాబట్టి ఈ ప్రాజెక్టుతో దిల్ రాజు కోల్పోయింది ఏమీ లేదని, అప్పట్లో కామెంట్లు చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫలితం పై దిల్ రాజు తమ్ముడు శిరీష్ (Sirish ) ఊహించని కామెంట్లు చేశారు.
గేమ్ ఛేంజర్ నష్టం పై నిర్మాత అసహనం..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు తమ్ముడు శిరీష్ మాట్లాడుతూ..రామ్ చరణ్ ఇమేజ్ కి డ్యామేజ్ అయ్యేలా ఆయన కామెంట్ చేశారు. “గేమ్ ఛేంజర్ సినిమా పోయిన తర్వాత మాకు ఎవరైనా సహాయం చేశారా? అటు రామ్ చరణ్ కానీ ఇటు డైరెక్టర్ కానీ కనీసం కర్టసీ కోసమైనా సరే ఫోన్ చేసి మాట్లాడలేదు..” అంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయం నిన్న మీడియా మిత్రులు..” అదేంటి? రామ్ చరణ్ ఫోన్ చేస్తారు కదా? అని అడిగితే..” ఎవరూ మాకు ఫోన్ చేయలేదు” అని శిరీష్ గట్టిగా సమాధానం చెప్పారు. దీనికి తోడు సాధారణంగా నష్టం వస్తే రెమ్యూనరేషన్ వెనక్కి ఇస్తారు కదా..? అలా ఇవ్వమని మీరేమైనా అడిగారా? అని అడిగితే.. “మాకు ఇవ్వలేదు.. మేము అడగలేదు.. ఆ స్థాయికి మా సంస్థ ఇంకా దిగజారలేదు.. మాకు నచ్చి ఈ ప్రాజెక్ట్ చేసాం.. మేమే డబ్బులు పోగొట్టుకున్నాం” అంటూ శిరీస్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ గురించి శిరీస్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి.
అన్న ఒకలా తమ్ముడు మరోలా..
ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే.. తాజాగా దిల్ రాజు నిర్మిస్తున్న ‘తమ్ముడు’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడుతూ.. “గేమ్ ఛేంజర్ రూపంలో రాంచరణ్ కి సరైన హిట్ ఇవ్వలేదని గిల్టీ ఫీలింగ్ ఉండిపోయింది. త్వరలోనే మంచి ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నాను. పనులు కూడా స్టార్ట్ అయ్యాయి.. అన్నీ త్వరలోనే ప్రకటిస్తానని” దిల్ రాజు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు శిరీష్ ఇలా మాట్లాడడంతో అన్న ఒకలా తమ్ముడు మరోలా మాట్లాడడం ఏంటి అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు.
also read:Rashmika Mandanna: అరే.. ఇలా దొరికిపోయావేంటి రష్మిక.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!
#GameChanger Result తో మా బతుకు అయిపోయింది అనుకున్నాం…
హీరో… డైరెక్టర్… మాటవరసకు కూడా కాల్ చేయలేదు…
– SVC Producer Sirish! pic.twitter.com/dgNRxtRqlA
— Movies4u Official (@Movies4u_Officl) June 30, 2025