OTT Movie : హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి, ముఖ్యంగా ప్రేమ రివెంజ్ థీమ్‌తో కూడిన కథలను ఆస్వాదించే వారికి, రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఒక తెలుగు హారర్ సినిమా కరెక్ట్ గా సరిపోతుంది. ఈ సినిమా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఒక సెక్యూరిటీ గార్డ్ ప్రేమ కథ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో ఉండే విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
ఏ ఓటీటీలో ఉందంటే
ఈ తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘Guard: Revenge for Love’. దీనికి జగ పెద్ది దర్శకత్వం వహించారు. అనసూయ రెడ్డి నిర్మాణంలో, విరాజ్ రెడ్డి చీలం ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. షిల్పా బాలకృష్ణ మిమి లియోనార్డ్ ఫీమేల్ లీడ్స్ లో నటించారు. ఈ సినిమా 2025 ఫిబ్రవరి 28న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సుమారు 2 గంటల నిడివి కలిగి ఉన్న ఈ సినిమా, తెలుగు భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. IMDbలో 7.3/10 రేటింగ్ ను కూడా పొందింది. ఈ స్టోరీ సూపర్‌నాచురల్ హారర్ రివెంజ్‌తో తెరకెక్కింది.
స్టోరీలోకి వెళితే
సుశాంత్ మెల్‌బోర్న్‌లోని బిల్డింగ్ ఎమ్‌లో నైట్ షిఫ్ట్ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తుంటాడు. తన కష్టార్జితంతో సొంత సెక్యూరిటీ ఏజెన్సీని స్థాపించాలని కలలు కంటాడు. కానీ అతని నైట్ షిఫ్ట్‌లలో, బిల్డింగ్‌లో వింత శబ్దాలు, అసాధారణ సంఘటనలు అతన్ని భయపెడతాయి. ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి, అతను డాక్టర్ సామ్ అనే లేడీ సైకాలజిస్ట్ ను సంప్రదిస్తాడు. వీరిద్దరూ కలిసి బిల్డింగ్ రహస్యాలను కనిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో వారి మధ్య ప్రేమ కూడా మొదలవుతుంది. అయితే ఒక రోజు రాత్రి సామ్ బిల్డింగ్‌లో సుశాంత్‌తో పాటు పెట్రోలింగ్ చేస్తుండగా, ఒక దుష్ట శక్తి ఆమెను ఆవహిస్తుంది. సామ్‌ను రక్షించడానికి, సుశాంత్ ఈ బిల్డింగ్ గతాన్ని తెలుసుకోవడం ప్రారంభిస్తాడు.
Read Also : ఆ వీడియో చూసాక 7 రోజుల్లో చస్తారు… రోమాలు నిక్కబొడుచుకునే హారర్ సీన్స్… లైఫ్ లో మర్చిపోలేని దెయ్యం మూవీ