E-Paper
Advertisement

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన తమ్మరెడ్డి భరద్వాజ.. ఫాన్స్‌కు పండగే..

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన తమ్మరెడ్డి భరద్వాజ.. ఫాన్స్‌కు పండగే..
Advertisement

NTR Politics: టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమాలతో పాటు ఆయన రాజకీయ భవిష్యత్తుపై కూడా నిత్యం ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు ‘నెక్స్ట్ సీఎం ఎన్టీఆర్’ అంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ, ఆయన రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్, విశ్లేషకులు తమ్మరెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ మీడియా ఛానల్ టాక్ షోలో పాల్గొన్న ఆయన, పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Read also-క్రికెటర్ తిలక్ వర్మతో లవ్.. స్పందించిన హీరోయిన్ శ్రీలీల టీమ్!..

జనం చెప్పారని..

Advertisement

ఇంటర్వ్యూలో భాగంగా హోస్ట్ మాట్లాడుతూ.. ‘జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజకీయాల్లోకి వస్తే మంచి స్కోప్ ఉంటుందని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు కదా, మరి తెలుగు రాష్ట్రాల్లో దీనిపై అసలు రియాలిటీ ఎలా ఉంది?” అని ప్రశ్నించగా.. దీనికి తమ్మరెడ్డి భరద్వాజ సమాధానమిస్తూ.. “ఈ జనం చెప్పారని చెప్పి వేగపడితే మాత్రం కుదరదు” అని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో లేదా సాధారణంగా మనవాళ్లు మాట్లాడే అన్ని విషయాలను అంత సీరియస్‌గా తీసుకోకూడదనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. అభిమానుల కోరికలు, సోషల్ మీడియా ట్రెండ్స్ వేరని, క్షేత్రస్థాయిలో రాజకీయ రియాలిటీ వేరని ఆయన పరోక్షంగా సూచించారు.

Read also-‘పెద్ది’ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చరణ్ ఫ్యాన్స్.. దానికి ఫుల్ క్లారిటీ ఇదే..

సినిమా విషయాలపై..

Advertisement

ఈ పొలిటికల్ టాపిక్ కాసేపు పక్కన పెడితే.. ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీ బడ్జెట్‌లు, హీరోల రెమ్యునరేషన్లపై కూడా తమ్మరెడ్డి భరద్వాజ స్పందించారు. స్టార్ హీరోలు రూ.200 కోట్ల నుండి రూ.250 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకోవడం గురించి వస్తున్న వార్తలపై చర్చించారు. అలాగే తెలంగాణ ఎగ్జిబిటర్లు పర్సెంటేజ్ పద్ధతిపై తీసుకుంటున్న నిర్ణయాలు, చిన్న సినిమాల విడుదల కష్టాల గురించి కూడా ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై తమ్మరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇటు సినీ వర్గాల్లో, అటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు సంబంధించి గ్లింప్స్ ను మే 19వ తేదీ అర్ధరాత్రి విడుదల చేయనున్నారు.

Related News

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

యశ్ ఎదుగుదల చూసి ఏడుస్తున్నారు… ట్రోల్స్ పై సుమలత ఫైర్!

Big Stories

Advertisement
×