Tanushree Dutta:బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ అకస్మాత్తుగా ఈరోజు గుండెపోటుతో కన్నుమూయడం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మరణవార్తతో దిగ్భ్రాంతికి గురైన టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. అయితే ఈ సమయంలో బాలయ్య సరసన వీరభద్ర మూవీ లో నటించిన తనుశ్రీ దత్తా చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నానా పటేకర్ మృతిపై ఆమె పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి.
నానా పటేకర్ మరణ వార్త విన్న వెంటనే తాను తీవ్రమైన సందిగ్ధంలో పడ్డానని తనుశ్రీ దత్తా పేర్కొన్నారు. తాను ప్రస్తుతం లక్నోలో జరగబోయే ఓ ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్తున్నానని, తన దృష్టి అంతా దానిపైనే పెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. ముందుగా తాను ఒక షెడ్యూల్ కోసం సిద్ధమై ఉన్న సమయంలో ఈ ఊహించని వార్త రావడం చాలా విచిత్రమైన పరిస్థితిగా ఆమె అభివర్ణించారు. ఇక మీడియా మొత్తం ఇప్పుడు కేవలం ఆ ఒక్క వార్తపైనే ఫోకస్ చేస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సంతాప సందర్బంలో తనుశ్రీ దత్తా తన వీడియోలో ‘ఈవిల్ డెడ్’ అనే పదాన్ని ఉపయోగించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. మరణించిన వ్యక్తి పట్ల ఇలాంటి పదాలు వాడటం ఏంటని నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ఇక నానా పటేకర్ కుటుంబానికి మాత్రం తాను సానుభూతి తెలుపుతున్నానని చెప్పినప్పటికీ, ఆమె మాట్లాడిన తీరు పట్ల జనం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిట్టిపోస్తున్నారు.
also read:విజయ్ దేవరకొండ ‘రణబాలి’ మూవీ ట్రైలర్ రిలీజ్!
తనుశ్రీ దత్తా, నానా పటేకర్ మధ్య వివాదం ఎవరికీ కొత్త కాదు. 2018లో బాలీవుడ్‌లో మీటూ ఉద్యమం ఊపందుకున్న సమయంలో నానా పటేేకర్‌పై ఆమె తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. 2008లో ఒక సినిమా షూటింగ్ సమయంలో ఆయన తనతో అనుచితంగా ప్రవర్తించారని, అసౌకర్యంగా ఉండే నృత్య భంగిమలు చేయాలని ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అప్పట్లో తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలపై పెద్ద ఎత్తున రచ్చ జరగగా, నానా పటేకర్ మాత్రం ఆ విమర్శలను ఖండించారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు జరిపి తగిన ఆధారాలు లభించలేదని తేల్చారు. ఇన్ని సంవత్సరాల తర్వాత నానా పటేకర్ మరణించిన వేళ, తనుశ్రీ దత్తా మళ్లీ పరోక్షంగా విమర్శలు గుప్పించడం, ఆమె వాడిన పదాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వాదనలకు దారితీస్తున్నాయి.
మొత్తానికి, ఒక దిగ్గజ నటుడు కన్నుమూసిన విషాద సమయంలోనూ పాత వివాదాలను, ఆరోపణలను గుర్తుచేస్తూ తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. మరణం తర్వాత కూడా విమర్శలు ఎదురుకావడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, మరికొందరు పాత సంఘటనలను గుర్తుచేసుకుంటూ ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. ఇక ఏదేమైనా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు నెట్టింట ప్రస్తుతం పెద్ద మంటలే పుట్టిస్తున్నాయి..