E-Paper
Advertisement

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ మూవీ ట్రైలర్ రిలీజ్!

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ మూవీ ట్రైలర్ రిలీజ్!
Advertisement

RanaBali movie trailer:విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika mandanna) జంటగా వివాహం తర్వాత కలిసిన నటిస్తున్న తొలి మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రణబాలి. ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 11వ తేదీనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కొంత షూటింగ్ పెండింగ్ కారణంగా సినిమాను అక్టోబర్ 16కి వాయిదా వేశారు. ఇకపోతే భారీ అంచనాల మధ్య రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుండి మేకర్స్ తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.

రణబాలి మూవీ ట్రైలర్ రిలీజ్..

3:47 నిమిషాల నిడివితో చిత్ర బృందం రణబాలి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 1854 – 1878 మధ్యకాలంలో బ్రిటిష్ ఇండియాలో రాయలసీమ ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగానే ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఇందులో సింగనమల బొబ్బిలి రణబాలిగా విజయ్ దేవరకొండ నటిస్తుండగా.. ఆయన భార్య జయమ్మ పాత్రలో రష్మిక నటిస్తున్నారు. ఇక హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ విలన్ పాత్ర పోషిస్తున్నారు . ఈ చిత్రాన్ని టి సిరీస్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. అజయ్ – అతుల్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి నీరవ్ షా, జిష్ణు భట్టాచార్జి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషలలో అక్టోబర్ 16వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

రణబాలి మూవీ ట్రైలర్ ఎలా ఉందంటే?

Advertisement

తాజాగా విడుదల చేసిన రణబాలి మూవీ ట్రైలర్ ఎలా ఉంది? నటీనటుల పర్ఫామెన్స్ ఏ విధంగా ఉంది? అనే విషయానికి వస్తే.. ట్రైలర్ ప్రారంభంతోనే బుర్రకథలతో చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. “అదిగో అక్కడ కనిపిస్తోంది మన సింగనమల కొండ.. పైన గుహలో 200 ఏళ్ళ క్రితం జీవ సమాధి అయినారు అవధూత. బొబ్బిలిని కాసే మన భద్ర మల్లన్న స్వామి తాత అంటూ కొండపై వెలసి ఉన్న మల్లన్న స్వామిని చూపించారు. అక్కడే ఈశ్వరీరావు.. స్వామి ఎదుటే గుహ బయట పురిటి నొప్పులతో పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డ పుట్టగానే గుహలో నుంచి బయటకు వచ్చిన ఒక అఘోర ఆ బిడ్డకి రణబాలి అంటూ నామకరణం చేస్తారు. జాతరలో దున్నపోతును బలివ్వడానికి బదులు మనిషిని బలివ్వడం ఇక్కడ ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

also read:‘ రామాయణ’ చిత్ర నిర్మాత ఆఫీసులపై ఐటీ దాడులు!

రాయలసీమ యాసలో రష్మిక పలుకులు..

Advertisement

బ్రిటీష్ పరిపాలనలో ప్రజలు ఏ విధంగా నరకం అనుభవించారు.. రణబాలి వచ్చాక ప్రజలకు బ్రిటీష్ నుండి ఎలా విముక్తి కలిగింది అనే విషయాన్ని చాలా చక్కగా చూపించారు. ఆ తర్వాత జయమ్మ, రణబాలి పెళ్లి సీన్ ట్రైలర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “నన్ను చేసుకున్నావా? గుర్రాన్ని చేసుకున్నావా? నన్ను పట్టించుకోకపోతే బావిలో దూకుతా చూడు” అంటూ రాయలసీమ యాసలో రష్మిక పలికిన మాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. బ్రిటీషర్స్ దాడి చేయడం.. రణబాలి కత్తి పట్టి బ్రిటీషర్స్ పై యుద్ధం ప్రకటించడం అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

 

Related News

నానా పటేకర్ ఒక దుష్టుడు.. బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్, తిట్టి పోస్తున్న జనం!

‘ రామాయణ’ చిత్ర నిర్మాత ఆఫీసులపై ఐటీ దాడులు!

హీరో అర్జున్ కూతురు వివాహం ఫిక్స్.. ఎప్పుడంటే..?

సైనికుడిగా సేవలు, జీతంలో 90 శాతం రైతులకు.. నానా పటేకర్ గురించి తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

సేనాపతి ఈజ్ బ్యాక్.. ‘ఇండియన్ 3’ నుంచి అదిరిపోయే అప్డేట్ !

నానా పటేకర్ భార్య గురించి తెలియని విషయాలు?

ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ ఇక లేరు.. గోవాలో అపస్మారక స్థితిలో..

Big Stories

Advertisement
×