Stock Market: మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు, క్రూడ్ ఆయిల్ ధరలు ప్రభావంతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒక్కసారిగా 1100 పాయింట్లకు పైగా పతనమైంది. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 8 లక్షల కోట్లు తగ్గింది. మార్కెట్ సెంటిమెంట్‌ను క్రూడ్ అంశం దెబ్బతీసింది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో సరఫరాపై ఆందోళనలు పెరగడంతో బ్రెంట్ క్రూడ్ 3.9 శాతం ఎగబాకి 104.09 డాలర్లకు చేరింది. ఇక ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చడం కూడా ఈక్విటీ మార్కెట్‌పై ఒత్తిడి పెంచింది.
మరోవైపు ఎఫ్‌ఐఐ సెల్లింగ్ మార్కెట్‌కు మరో పెద్ద నెగెటివ్ ట్రిగ్గర్‌గా మారింది. అక్టోబర్ 7న విదేశీ ఇన్వెస్టర్లు ఏకంగా 6,121 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్ 5.3 శాతం స్థాయికి చేరడం డాలర్ బలపడటం.. రూపాయిపై ఒత్తిడి పెంచడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
సెల్లింగ్ ప్రెజర్‌తో బ్యాంకింగ్.. ఫైనాన్షియల్ సర్వీసెస్ రియల్టీ, మెటల్స్, ఆటో, దాదాపు అన్ని సెక్టార్లూ రెడ్‌లోనే క్లోజ్ అయ్యాయి. అధిక వాల్యుయేషన్స్ వద్ద ఉన్న షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కూడా పతనాన్ని మరింత పెంచింది. క్రూడ్ షాక్ ఎఫ్‌ఐఐ సెల్లింగ్, రేట్ హైక్, గ్లోబల్ టెన్షన్స్, ఈ నాలుగు ట్రిగ్గర్లు కలిసి మార్కెట్‌పై బేర్ గ్రిప్‌ను మరింత బిగించాయి. మార్కెట్లు ఇచ్చిన షాక్‌తో ఇన్వెస్టర్లకు స్ట్రోక్ తగిలింది. వారాంతంలో ఏంట్రా బాబు ఇది అని తలలు పట్టుకుంటున్నారు.
Also read: మెట్రో పనుల సమీపంలో కుంగిన రోడ్డు.. గుంతలో పడి బోల్తా కొట్టిన కారు