E-Paper
Advertisement

సెన్సార్ పూర్తి చేసుకున్న గాయపడ్డ సింహం.. ఫస్ట్ రివ్యూ.. తరుణ్ గట్టెక్కాడా?

సెన్సార్ పూర్తి చేసుకున్న గాయపడ్డ సింహం.. ఫస్ట్ రివ్యూ.. తరుణ్ గట్టెక్కాడా?
Advertisement

Tollywood: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న తరుణ్ భాస్కర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. నటుడిగా కూడా సత్తా చాటిన ఈయన తాజాగా గాయపడ్డ సింహం చిత్రంలో హీరోగా నటించాడు. మే ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న గాయపడ్డ సింహం..

సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. తరుణ్ భాస్కర్ హీరోగా, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా వస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి, ప్రముఖ హీరో శ్రీ విష్ణు కీలకపాత్ర పోషిస్తున్నారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని కళింగ క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ ఉండగా స్వీకార్ అగస్తి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు అటు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీనికి తోడు ఈ సినిమా ఫస్ట్ రివ్యూ కూడా ఇప్పుడు సినిమా ప్రేక్షకులలో అంచనాలు పెంచేసింది. మరి ఈ సినిమా స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

గాయపడ్డ సింహం సినిమా స్టోరీ..

Advertisement

ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న కఠినమైన డిపోర్టేషన్ నిర్ణయాల వల్ల అక్కడ స్థిరపడాలనుకున్న ఒక తెలుగు యువకుడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే స్టోరీ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ముఖ్యంగా ఇందులో ఎప్పటిలాగే తరుణ్ భాస్కర్ తన మార్క్ స్టైల్ చూపించారని ఈ సినిమాతో ఆయన గట్టకే అవకాశాలు కూడా ఉన్నాయని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో తెలియాలి అంటే మే ఒకటి వరకు ఎదురు చూడాల్సిందే.

తరుణ్ భాస్కర్ కెరియర్..

Advertisement

తరుణ్ భాస్కర్ విషయానికి వస్తే.. 2016లో విడుదలైన పెళ్లిచూపులు సినిమాతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈయన ఈ సినిమాతో దర్శకుడిగానే కాకుండా ఉత్తమ మాటల రచయితగా, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రెండు నేషనల్ అవార్డులు అందుకున్నారు.. తరుణ్ భాస్కర్ మీకు మాత్రమే చెబుతా అనే చిత్రంతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీ సినిమాలో అతిథి పాత్ర పోషించిన ఈమె ఈ నగరానికి ఏమైంది? సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు . ప్రస్తుతం ఈ నగరానికి ఏమైంది రిపీట్ సినిమాకి దర్శకత్వం వహిస్తూనే మరొకవైపు ఓం శాంతి శాంతి శాంతిః సినిమాలో హీరోగా నటించి ఆకట్టుకున్నారు. ఇక ప్రస్తుతం ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు దర్శకుడిగా తనకంటూ ఒక మంచి పేరు సొంతం చేసుకున్నారు తరుణ్ భాస్కర్ . మరి ఈ సినిమాతో తనలోని టాలెంటును నిరూపించుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×