BigTV English

Bigg Boss 9: అగ్నిపరీక్ష నుండి 5గురు కాదు 6గురు.. లిస్ట్ వైరల్!

Bigg Boss 9: అగ్నిపరీక్ష నుండి 5గురు కాదు 6గురు.. లిస్ట్ వైరల్!
Advertisement

Bigg Boss 9:ఆదివారం (సెప్టెంబర్ 7) సాయంత్రం ఏడు గంటలకు స్టార్ మా వేదికగా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున (Nagarjuna) ఆధ్వర్యంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చాలా గ్రాండ్గా ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి హౌస్ లోకి కామన్ మ్యాన్ క్యాటగిరీలో ఏకంగా 5 మందిని హౌస్ లోకి పంపించబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే సామాన్యుల నుంచి 20 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. అందులో పలు రౌండ్స్ ద్వారా కేవలం 45 మందిని ఎంపిక చేశారు .ఈ 45 మందికి టెస్టులు నిర్వహించి అందులో నుంచి ఐదు మందిని హౌస్ లోకి పంపించడానికి అగ్నిపరీక్ష అంటూ ఒక మినీ షో నిర్వహించిన విషయం తెలిసిందే. ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ ఐదు వరకు జియో హాట్ స్టార్ వేదికగా ఈ మినీ షో కొనసాగింది.


మొత్తం ఆరుగురు కామన్ మ్యాన్ క్యాటగిరిలో..

మొత్తం 13 మంది ఆఖరికి తమ బలాబలాలను నిరూపించుకోగా అందులో ఆరుగురుని ఇప్పుడు ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు ఐదు మందిని మాత్రమే హౌస్ లోకి పంపిస్తారు అంటూ వార్తలు రాగా ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం 6 మందిని హౌస్ లోకి పంపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి జడ్జిలుగా వ్యవహరించిన బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ నవదీప్ (Navadeep),మాజీ విన్నర్స్ బిందు మాధవి(Bindu Madhavi), అభిజిత్ (Abhijeeth) చిత్ర విచిత్రమైన టాస్కులు నిర్వహించి , నెగ్గిన ఆరుగురిని ఎంపిక చేశారు. అందులో భాగంగానే ఆ ఆరుగురిని హౌస్ లోకి పంపించబోతున్నారు. మరి అగ్నిపరీక్ష లో నిర్వహించిన టాస్కులను నెగ్గి, హౌస్ లోకి వెళ్లబోతున్న ఆ ఆరుగురు ఎవరు అనే విషయానికి వస్తే.. మాస్క్ మ్యాన్ హరీష్, ఫైర్ బాంబ్ ద‌మ్ము శ్రీజ‌, హీ మ్యాన్ పవన్, ఆర్మీ పవన్ కళ్యాణ్, మర్యాద మనీష్, ప్రియాశెట్టి ఇలా వీరంతా హౌస్ లోకి వెళ్లబోతున్నట్లు సమాచారం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్ లోకి వెళ్ళబోయే సెలబ్రిటీస్..


అగ్ని పరీక్ష అంటూ ఒక షో నిర్వహించి, ఆరు మందిని ఇప్పుడు హౌస్ లోకి పంపించబోతున్నారు. ఇక సెలబ్రిటీలు ఎవరెవరు అడుగుపెట్టబోతున్నారు అనే విషయానికి వస్తే కమెడియన్ ఇమ్మానుయేల్, రీతు చౌదరి , రామ్ ఆథోడ్, ఆశా షైనీ, సుమన్ శెట్టి , శ్రేష్ఠి వర్మ, సంజన గర్లాని, తనుజా గౌడ , షర్మిత గౌడ ఇలా తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో కంటెస్టెంట్లుగా వెళ్లేవారు ఎవరో తెలియాలి అంటే ఆదివారం షో ప్రారంభం అయ్యే వరకు ఎదురుచూడాల్సిందే. ఇప్పటికే ప్రేక్షకులను ఎనిమిది సీజన్లు విపరీతంగా ఆకట్టుకున్నాయి.. ఇప్పుడు 9వ సీజన్ లో విభిన్నమైన టాస్కులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే హోస్ట్ నాగార్జున కూడా డబుల్ హౌస్ , డబుల్ డోస్, డబుల్ ఎంటర్టైన్మెంట్ అంటూ అంచనాలు పెంచేశారు. నిన్నటి నుండి విడుదల చేస్తున్న ప్రోమో కూడా మొదటి రోజు అదిరిపోయే సర్ప్రైజ్ ఉండనుంది అని చెబుతున్నారు. మరి బిగ్బాస్ ప్రారంభం రోజు సెలబ్రిటీలకు సర్ప్రైజ్ ఇవ్వనున్నారా లేక ఆడియన్స్ కా అన్నది తెలియాలి.

ALSO READ:Meenakshi: అక్కినేని హీరోతో మరోసారి అడ్డంగా దొరికిపోయిన మీనాక్షి.. వీడియో వైరల్!

Related News

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 లో ఇమ్మానుయేల్ మించిన బెస్ట్ పర్సన్ ఇతనే

Ramu Rathod Elimination : షాకింగ్ ఎలిమినేషన్ రాము రాథోడ్ ఔట్, ఏంటి బిగ్ బాస్ ఇది?

Bigg Boss 9 Promo: హౌస్ లోకి పోలీసులు.. అసలేం జరుగుతోంది?

Bigg Boss 9 Telugu : అనారోగ్యంతో హౌస్‌ నుంచి ఈ కంటెస్టెంట్ అవుట్.. పాపం అస్సలు ఊహించలేదు..

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్‌లోకి అమర్ దీప్, అర్జున్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్‌కు ఊహించని షాక్..!

Bigg Boss 9 Telugu : కోడిలా మారిన ఇమ్మూ… బురదలో ఫిజికల్ టాస్క్.. ఇదేం ఆటరా నాయనా..

Bigg Boss 9: ఎక్కడ తగ్గని తనూజ.. ఇమ్మాన్యుయేల్, రీతూ డబుల్ గేమ్.. మళ్లీ సంజనపై నెగ్గిన మాధురి..

Rithu Chaudhary : గౌరవ్ సూపర్ డెసిషన్, రీతుకు మొహం మీదే చెప్పేసాడు

Big Stories

×