E-Paper
Advertisement

మరీ ఇంత దారుణమా.. ఇరిగేషన్‌ శాఖలో రిటైర్డ్‌ అధికారులకే మళ్లీ కీలక పోస్టులు!

మరీ ఇంత దారుణమా.. ఇరిగేషన్‌ శాఖలో రిటైర్డ్‌ అధికారులకే మళ్లీ కీలక పోస్టులు!
Advertisement

Irrigation Promotions: స్వేచ్ఛ బ్యూరో: నీటిపారుదల శాఖలో అర్హులైన ఇంజినీర్లు కరువయ్యారా? కీలక పోస్టుల్లో బాధ్యతలు నిర్వహించేందుకు సర్వీసులో ఉన్న సీనియర్‌ అధికారులు లేరా? పదవీ విరమణ చేసిన అధికారులనే మళ్లీ అదే కేడర్‌లో నియమించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏళ్ల తరబడి శాఖలో పనిచేస్తూ పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీర్లకు అవకాశం ఇవ్వకుండా రిటైర్డ్‌ అధికారులకే పెద్దపీట వేయడం వెనుక ఆంతర్యమేమిటి? ప్రస్తుతం ఇరిగేషన్‌ శాఖలో ఈ ప్రశ్నలు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు పదోన్నతులకు అర్హత, అనుభవం, సీనియారిటీ ఉన్న ఇంజినీర్లు ఉన్నప్పటికీ వారికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించడంలో జాప్యం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఉద్యోగ విరమణ చేసిన కొందరు అధికారులను తిరిగి అదే హోదాల్లో కొనసాగించడం, కీలక బాధ్యతలు అప్పగించడం వివాదాస్పదమవుతోంది. సూపరింటెండింగ్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్న వారికి చీఫ్‌ ఇంజినీర్లుగా పదోన్నతులు రావాల్సి ఉండగా, ఆ ప్రక్రియలో జాప్యం ఎందుకు జరుగుతోందన్నది అంతుచిక్కని ప్రశ్న.

రిటైర్‌ అయినా అదే కుర్చీలో..

ఉద్యోగ విరమణతో ప్రభుత్వ ఉద్యోగి సర్వీసు ముగుస్తుంది. శాఖకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యం, అనుభవం ఉన్నవారిని నిబంధనల ప్రకారం కన్సల్టెంట్లుగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇరిగేషన్‌ శాఖలో మాత్రం కొందరు రిటైర్డ్‌ ఇంజినీర్లను తిరిగి అదే కేడర్‌, అదే స్థాయి బాధ్యతల్లో కొనసాగిస్తున్నారు. ఇప్పటికే శాఖలో పనిచేస్తున్న అధికారులకు అవకాశం కల్పించకుండా పదవీ విరమణ చేసినవారికే తిరిగి బాధ్యతలు అప్పగించడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. ఇరిగేషన్‌ శాఖలో రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌ సత్యనారాయణరెడ్డిని తిరిగి అదే పోస్టులో కొనసాగిస్తూ రెండోసారి ఉత్తర్వులు వెలువడ్డాయి. మరో 6నెలలు పొడగించింది. అంతేకాదు హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ), హైడ్రా కమిషనర్ కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్ విధులను కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఇరిగేషన్ లో సీఈ(జనరల్), సీఈ(అడ్మిన్) బాధ్యతలు నిర్వహించిన రిటైర్ అయినవారినే తిరిగి ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఇప్పుడు శాఖ తీరు చర్చకుదారితీసింది.

ఎక్స్‌టెన్షన్లు ఇవ్వబోమని గతంలో ప్రకటన..

Advertisement

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత వారిని తిరిగి కొనసాగించే విధానంపై గతంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించింది. 2025 మార్చిలో 6,700 మందికి పైగా రిటైర్డ్‌ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నది.పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కొనసాగింపునకు సంబంధించిన సిఫారసులు, విజ్ఞప్తులను కూడా స్వీకరించబోమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ వాటిని ప్రభుత్వ బేఖాతర్ చేసినట్లు స్పష్టమవుతోంది. ఇరిగేషన్ శాఖలో రిటైర్డ్‌ అధికారులకు మళ్లీ పదవీకాల పొడిగింపులు, పునర్నియామకాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవీ ప్రభుత్వ విధానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు సాధారణ ఉద్యోగులకు పొడిగింపులు ఉండవని చెబుతూ, మరోవైపు కీలక పోస్టుల్లో రిటైర్డ్‌ ఇంజినీర్లను కొనసాగించడంపై పలువురు ఉద్యోగులు మండిపడుతున్నారు.

Also Read: ఘనంగా తేజ సజ్జ నిశ్చితార్థం..హాజరవుతున్న సినీ, రాజకీయ ప్రముఖులు!

ఎస్‌ఈలకు ప్రమోషన్లు ఎప్పుడు?

Advertisement

ఇరిగేషన్‌ శాఖలో సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ (ఎస్‌ఈ) స్థాయి నుంచి చీఫ్‌ ఇంజినీర్‌ (సీఈ) స్థాయికి పదోన్నతుల కోసం అర్హులైన అధికారులు ఎదురుచూస్తున్నారు. ఖాళీ అవుతున్న పోస్టులను రెగ్యులర్‌ ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయకుండా అదనపు బాధ్యతలు, తాత్కాలిక నియామకాలతో నెట్టుకురావడం వల్ల సీనియర్లకు అన్యాయం జరుగుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పదోన్నతులు ఆలస్యమైతే దిగువ కేడర్లలోనూ దాని ప్రభావం పడుతుందని అభిప్రాయపడుతున్నారు.గతంలో ఫుల్‌ అడిషనల్‌ ఛార్జి (ఎఫ్‌ఏసీ) విధానంలో అనేక కీలక పోస్టులు కొనసాగిన సందర్భాలు ఉన్నాయి.

డీపీసీ సమావేశంపై సందిగ్ధం

పదోన్నతుల విషయంలో డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ (డీపీసీ) కీలక పాత్ర పోషిస్తుంది. అర్హత, సీనియారిటీ, ఖాళీలు, నిబంధనలను పరిశీలించి పదోన్నతులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, డీపీసీ సమావేశాల నిర్వహణ, ఆమోదించిన ప్రతిపాదనల అమలు, తదుపరి పదోన్నతుల ప్రక్రియపై ఉద్యోగ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఐదుగురు ఎస్ఈ లు సీఈలుగా పదోన్నతికోసం ఎదురుచూస్తున్నారు. అయినప్పటికీ రిటైర్డ్ అయినవారికే నియమించడంతో వారికి ప్రమోషన్లు నిలిచిపోయినట్లు సమాచారం.

రిటైర్డ్‌ అధికారికి మూడు బాధ్యతలా?

రిటైర్డ్‌ అయిన ఓ ఇంజినీరింగ్‌ అధికారికి తిరిగి కీలక బాధ్యతలు అప్పగించడంతోపాటు మూడు బాధ్యతలను నిర్వహించే అవకాశం కల్పించారన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకే అధికారికి ఇన్ని బాధ్యతలు ఎందుకు అప్పగించాల్సి వచ్చింది? శాఖలో పనిచేస్తున్న ఇతర సీనియర్‌ అధికారులకు ఆ బాధ్యతలు నిర్వహించే సామర్థ్యం లేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు ఈ నెలలో పదవీరమణ చేయబోతున్న సీఈ కూడా ఎక్స్ టెన్షన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనప్పటికీ మూడు సీఈ పోస్టులకు ఒక సీఈకే అప్పగించడం వెనుక ఆంతర్యమేంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

చక్రం తిప్పుతున్న ఓ అధికారి?

శాఖలో కీలక పోస్టుల భర్తీ, అదనపు బాధ్యతల అప్పగింత, పదోన్నతుల ప్రతిపాదనల విషయంలో ఓ ఉన్నతాధికారి చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఆయన చెప్పిన విషయానే మంత్రితో పాటు శాఖలోని కీలక అధికారులు సైతం వింటారని ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. అర్హులైన సీనియర్లను పక్కనపెట్టి తమకు అనుకూలమైన అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నారన్న విమర్శలూ మరోవైపు వినిపిస్తున్నాయి.

Also read: ఘనంగా తేజ సజ్జ నిశ్చితార్థం..హాజరవుతున్న సినీ, రాజకీయ ప్రముఖులు!

ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిందే!

ఇరిగేషన్‌ శాఖలో ప్రస్తుతం ఉన్న ఖాళీల వివరాలు, పదోన్నతులకు అర్హులైన అధికారుల జాబితా, రిటైర్డ్‌ అధికారులకు ఇచ్చిన పొడిగింపులు, పునర్నియామకాలపై ప్రభుత్వం సమగ్ర వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది. డీపీసీ సమావేశాలు ఎప్పుడు నిర్వహిస్తున్నారు? పదోన్నతులకు అర్హులైన ఎస్‌ఈలకు ఎప్పుడు న్యాయం చేస్తారు? రిటైర్డ్‌ అధికారుల కొనసాగింపునకు ఏ నిబంధనలు ప్రాతిపదికగా తీసుకుంటున్నారు? అనే ప్రశ్నలకు ప్రభుత్వం, ఆశాఖ మంత్రి సమాధానం చెప్పాల్సి ఉంది. అంతేకాదు శాఖలో అనుభవజ్ఞుల కొరత ఉందా? లేక అర్హులైన సర్వీసు అధికారులకు అవకాశం కల్పించడంలోనే జాప్యం జరుగుతోందా? అన్నది తేలాల్సి ఉంది. ఉద్యోగుల సర్వీసు ప్రయోజనాలు, శాఖ పరిపాలనా సామర్థ్యం, ప్రజాధన వినియోగం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పారదర్శక నిర్ణయాలు తీసుకోవాలని ఇంజినీర్లు కోరుతున్నారు.

సత్యనారాయణరెడ్డి ఎక్సటెన్షన్ ఆర్డర్ ను రద్దు చేయాలి..

ఒక్క పదవి విరమణ చెందిన సీఈ సత్యనారాయణరెడ్డికి మరోసారి మూడు సీఈ పోస్ట్లు లతో ఇచ్చిన ఎక్సటెన్షన్ ఆర్డర్ ని వెంటనే రద్దు చేయాలని హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్,తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అసోసియేషన్ ,అసోసియేషన్ అఫ్ తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ,ఇరిగేషన్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ లు డిమాండ్ చేశాయి. శనివారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.పదవీ విరమణ పొందిన చీఫ్ ఇంజనీర్లకు ఇంజనీర్ ఇన్ చీఫ్ లకు తిరిగి పదవీ పొడిగింపులు ఇవ్వడం వల్ల జూనియర్ ఇంజనీర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని నేతలు తెలిపారు.

ఆవేదన వ్యక్తం..

ప్రభుత్వం చీఫ్ ఇంజనీర్ క్యాడర్‌లో వరుసగా ఎస్.ఈ.లకు ప్రమోషన్లు కల్పించి, ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయాల్సిందిపోయి, ప్రభుత్వం రిటైర్ అయిన ఇంజనీర్లనే తిరిగి అదే క్యాడర్ పోస్టుల్లో నియమిస్తోంది. దీనివల్ల పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు ఐదు క్యాడర్లలో ఇంజనీర్ల ప్రమోషన్ అవకాశాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ఎస్ఈలకు వారు రిటైర్ కాకముందే సీఈ లుగా ప్రమోషన్ లు కల్పించాలని, లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Also Read: మూడేళ్లకే ప్రపంచ రికార్డులు.. పొదరిల్లు చక్రి కొడుకు టాలెంట్ కు ఫిదా అవ్వాల్సిందే!

Tags

Related News

ఈ సారీ చేపలు కరువే.. 9 లక్షల మంది ఉపాధికి గండం?

టీజీఎంఎస్ఐడీసీలో.. స్పెషల్ ఆఫీసర్ గ్యాంగ్ బ్లాక్‌మెయిల్ దందా!

సొంత నిధులతోనే రైతులకు తక్షణ సాయం..! రూ. 1250 కోట్లు విడుదల..! తక్షణ సాయంగా రూ. 2500..!

కేంద్ర కేబినెట్ ప్రక్షాళన తప్పదా.. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే భేటీపై ఉత్కంఠ!

‘భారత్ సమ్మిట్’ వేదికగా.. కేంద్రం తీరుపై మంత్రులు, మేధావుల విమర్శలు!

ఏపీ నుంచి తెలంగాణకు భారీగా అక్రమ ఇసుక రవాణా.. పట్టించుకోని మైనింగ్ అధికారులు!

సోనియా 544 పేజీల ఆత్మకథా.. లేక రాజకీయ రణరంగమా..?

Big Stories

Advertisement
×