Pixel 10 Pro XL vs Galaxy S25 Ultra vs iPhone 16 Pro Max| టాప్ రేంజ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ రంగంలో తాజాగా గూగుల్ కంపెనీకి చెందిన పిక్సెల్ 10 ప్రో XL లాంచ్ అయింది. ఈ ఫోన్ అద్భుత ఫీచర్లతో నేరుగా శాంసంగ్ గ్యాలక్సీ S25 అల్ట్రా, ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ లాంటి దిగ్గజ ఫోన్లతో పోటీ పడుతోంది. ఈ పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఈ మూడు ఫ్లాగ్‌షిప్ ఫోన్లను సరిపోల్చి చూద్దాం.
ధర, వేరియంట్లు:
పిక్సెల్ 10 ప్రో XL (16GB RAM/256GB స్టోరేజ్) ధర ₹1,24,999. మిగతా రెండు ఫోన్లతో పోలిస్తే.. అతి తక్కువ ధరతో విడుదల అయింది. గ్యాలక్సీ S25 అల్ట్రా 256GB, 512GB వేరియంట్లలో లభ్యం. 256GB ధర ₹1,29,999 ఉండగా.. 512GB ధర ₹1,41,999. 512GB వేరియంట్ పై ఆఫర్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.
ఐఫోన్ 16 ప్రో మాక్స్ మూడింటిలో అత్యంత ఖరీదైనది. 256GB వేరియంట్ ₹1,44,900, 1TB వేరియంట్ ₹1,84,900. ప్రీమియం ఫోన్లు మాత్రమే ఉపయోగించే వారికి ఇప్పటివరకు ఇదే టాప్ చాయిస్. కానీ గూగుల్ పిక్సెల్ రాకతో ఇప్పుడు ప్రత్యామ్నం ఏర్పడింది.
కెమెరా సిస్టమ్:
పిక్సెల్ 10 ప్రో XLలో ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. 50MP వైడ్, 48MP అల్ట్రావైడ్, 48MP టెలిఫోటో. సెల్ఫీ కెమెరా 42MP. ఇది ఫోటోలు తీయడంలో గూగుల్ మ్యాజిక్ చూపిస్తుంది. గ్యాలక్సీ S25 అల్ట్రాలో 200MP ప్రైమరీ రియర్ కెమెరా, 50MP అల్ట్రావైడ్, రెండు టెలిఫోటోలు (50MP మరియు 10MP), 12MP ఫ్రంట్ కెమెరా. ఇది జూమ్, చిన్న చిన్న డిటైల్స్‌లో కూడా బెస్ట్. ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లో 48MP వైడ్, 48MP అల్ట్రావైడ్, 12MP పెరిస్కోప్ లెన్స్, 12MP ఫ్రంట్ కెమెరా. వీడియో రికార్డింగ్‌లో ఆపిల్ ఎక్కువగా మెరుగ్గా ఉంటుంది.
డిస్‌ప్లే:
పిక్సెల్ 10 ప్రో XLలో 6.8 ఇంచ్ ఆక్టువా LTPO OLED డిస్‌ప్లే, రెజల్యూషన్ 1344×2992, పీక్ బ్రైట్‌నెస్ 3300 నిట్స్. ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. గ్యాలక్సీ S25 అల్ట్రాలో 6.9 ఇంచ్ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే, 1400×3120 రెజల్యూషన్, 2600 నిట్స్ బ్రైట్‌నెస్. రంగులు వైబ్రంట్‌గా ఉంటాయి. ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లో 6.9 ఇంచ్ LTPO సూపర్ రెటినా XDR OLED, 1206×2622 రెజల్యూషన్, 2000 నిట్స్ బ్రైట్‌నెస్. స్క్రీన్ స్మూత్ నెస్, స్టైల్‌లో ఆపిల్ టాప్.
ప్రాసెసర్ పనితీరు:
పిక్సెల్ 10 ప్రో XLలో గూగుల్ టెన్సర్ G5 ప్రాసెసర్. AI ఫీచర్లకు బాగుంటుంది. గ్యాలక్సీ S25 అల్ట్రాలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్. గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో సూపర్ స్పీడ్. ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లో ఆపిల్ A18 ప్రో చిప్, 6 కోర్లు. పనితీరులో అగ్రగామి, బ్యాటరీ ఎఫిషియెంట్.
ఆపరేటింగ్ సిస్టమ్‌లు:
పిక్సెల్ 10 ప్రో XLలో ఆండ్రాయిడ్ 16. ప్యూర్ ఆండ్రాయిడ్ అనుభవం. గ్యాలక్సీ S25 అల్ట్రాలో ఆండ్రాయిడ్ 15తో వన్ UI 7 స్కిన్. కస్టమైజేషన్ ఎక్కువ. ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లో iOS 18. సెక్యూరిటీ మరియు ఎకోసిస్టమ్ బలంగా ఉంటాయి.
RAM స్టోరేజ్:
పిక్సెల్ 10 ప్రో XL: 16GB RAM, 256GB స్టోరేజ్. గ్యాలక్సీ S25 అల్ట్రా: 12GB RAM, 1TB వరకు స్టోరేజ్. ఐఫోన్ 16 ప్రో మాక్స్: 256GB, 512GB, 1TB ఆప్షన్లు. RAM గురించి ఆపిల్ చెప్పదు కానీ పనితీరు మెరుగు.
కనెక్టివిటీ, ఫీచర్లు:
మూడూ డ్యూయల్ సిమ్, 5G, Wi-Fi 7, NFC, బ్లూటూత్ సపోర్ట్ చేస్తాయి. గ్యాలక్సీ S25 అల్ట్రాలో UWB ఉంది. పిక్సెల్‌లో గూగుల్ క్యాస్ట్. అన్నింటిలో USB టైప్-C పోర్ట్ ఉంది.
డిజైన్, సైజు:
పిక్సెల్ 10 ప్రో XL: 232g బరువు, 162.8×76.7×8.5 mm సైజు. గ్యాలక్సీ S25 అల్ట్రా: 218g, 162.8×77.6×8.2 mm. ఐఫోన్ 16 ప్రో మాక్స్: 227g, 163×77.6×8.25 mm. అన్నీ పెద్ద సైజు, ప్రీమియం బిల్డ్.
ప్రతి ఫోన్‌కు తన బలాలు ఉన్నాయి. పిక్సెల్ 10 ప్రో XL డిస్ ప్లే, బ్రైట్‌నెస్‌లో బెస్ట్. గ్యాలక్సీ S25 అల్ట్రా కెమెరాలో టాప్. ఐఫోన్ 16 ప్రో మాక్స్ ప్రాసెసర్ పనితీరు, ఎకోసిస్టమ్‌లో విన్నర్. మీ అవసరాలను బట్టి ఎంచుకోండి.
Also Read: యూట్యూబ్‌లో యాడ్స్ తో విసిగిపోయారా?.. ఈ సింపుల్ ట్రిక్ తో ఉచితంగా యాడ్స్ బ్లాక్ చేయండి