BigTV English

Teja Sajja Mirai : అవును… నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ గొప్పేం కాదు

Teja Sajja Mirai : అవును… నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ గొప్పేం కాదు

Mirai Movie Business : టేబుల్ ప్రాఫిట్… ఈ రోజు ఇది చాలా ఎక్కువ సార్లు వినాల్సి వస్తుంది. ఈ నెల 12న రిలీజ్ కాబోతున్న మిరాయ్ మూవీ టేబుల్ ప్రాఫిట్‌తో రిలీజ్ అవుతుంది అంటూ ఆ సినిమాపై, హీరోపై, డైరెక్టర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ సినిమాను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లక్ అంటూ కామెంట్స్ కూడా చేశారు. అయితే ఒక మూవీ టేబుల్ ప్రాఫిట్‌తో రిలీజ్ అవ్వడం పెద్ద గొప్పేం కాదు. ఈ మాట అన్నది ఎవరో కాదు. స్వయంగా ఆ సినిమా హీరో తేజ సజ్జానే అన్నాడు. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో ఈ మధ్య వచ్చిన సినిమాలు చాలా వరకు నష్టాలనే తెచ్చాయి. ఓ సందర్భంలో కొన్ని సినిమాల షూటింగ్స్ కూడా తాత్కాలికంగా ఆపేశారనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆశలు పెట్టుకుంది రెండు సినిమాలపైనే. అందులో ఒకటి “మిరాయ్”. రెండు “ది రాజా సాబ్”.

ది రాజా సాబ్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉండే ఛాన్స్ ఉంది. ఇక మిరాయ్ మూవీ ఈ నెల 12న రిలీజ్ కాబోతుంది. అయితే, ఈ సినిమా బిజినెస్ గురించి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. సినిమా రిలీజ్ కు ముందే నిర్మాతలకు దాదాపు 20 కోట్ల వరకు లాభాలు వచ్చాయనే టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.


మిరాయి సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లు దాదాపు 60 కోట్లు పెట్టి నిర్మించారు. ఇక ఆ సినిమాకు నాన్ థియేట్రికల్ బిజినెస్‌గా దాదాపు 45 కోట్ల వరకు వచ్చాయట. ఇక థియేట్రికల్ బిజినెస్ చాలా వరకు ఓన్ రిలీజ్ ఉంది. మొత్తంగా సినిమా రిలీజ్ కు ముందే నిర్మాతల చేతికి లాభాల రూపంలో దాదాపు 20 కోట్లు వచ్చాయట.

ఇలా సినిమాకు టేబుల్ ప్రాఫిట్స్ రావడం పెద్ద గొప్పేం కాదు. నిజానికి అన్నీ సినిమాలు అలా చేయొచ్చు. అలా రిలీజ్ కు ముందే ప్రాఫిట్స్ రావొచ్చు. కానీ, అధిక రెమ్యునరేషన్స్, స్టార్ కాస్ట్‌కు అధనపు ఖర్చులు ఉంటాయి. వీటితో పాటు అవసరం లేని ఫుటేజ్ ఎక్కువ ఉండటం లాంటివి ఎక్కువ జరుగుతాయి.

2:30 గంటలు ఉండాల్సిన సినిమాకు కొంత మంది డైరెక్టర్లు దాదాపు 5 నుంచి 6 గంటల ఫుటేజ్‌ను తీస్తారు అంటే నిర్మాతకు షూటింగ్ విషయంలో డబుల్ ఖర్చు అయినట్టు. ఇంకా రీ షూట్స్ , రీ టేక్స్… ప్యాచ్ వర్క్స్ ఇంకా చాలా… ఇలా అన్నీ చేయడం వల్ల అనుకున్న బడ్జెట్ దాటిపోయి.. నిర్మాతకు షాక్ తెప్పిస్తారు.

కానీ, మిరాయి మూవీకి అలాంటిదేమీ జరగలేదు. అనుకున్న బడ్జెట్‌లోనే మూవీని కంప్లీట్ చేశారు. ఎక్కువ రెమ్యునరేషన్స్ లేవు. రీ షూట్స్, రీ టేక్స్, భారీ ఖర్చు చేయించే ప్యాచ్ వర్క్స్ లేవు. సో… అనుకున్న బడ్జెట్‌లోనే సినిమా అయింది. అదే బిగ్ సిక్రెట్ అనుకోవచ్చు.

దీనిపై తాజాగా హీరో తేజ సజ్జా కూడా స్పందించాడు. తాము ముందుగా అనుకున్న బడ్జెట్‌లోనే సినిమాను కంప్లీట్ చేసుకున్నామని, రీసోర్స్ కోసం తమ రెమ్యురేషన్స్ ను తగ్గించుకున్నామని, అందుకే ఇప్పుడు టేబుల్ ప్రాఫిట్స్ వచ్చాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఇలా… ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు. మొన్నా ఆ మధ్య అనిల్ రావిపూడిపై ఇలాంటి మాటలే వచ్చాయి. ఇప్పుడు మిరాయ్ సినిమాకు వస్తున్నాయి. తలుచుకుంటే, అన్ని సినిమాలకు ఇలా జరగొచ్చు. కానీ, అది డైరెక్టర్, హీరో చేతుల్లోనే ఉంటుంది.

Related News

Allu Arjun: అఖీరా బాబు కటౌట్ చూసి అల్లు అర్జున్ షాక్, ఇంత పొడుగు ఉన్నావేంటి అల్లుడు

Pawan Kalyan-Allu Arjun: ఒకే ఫ్రేమ్‌లో అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ – రామ్ చరణ్.. మెగా ఫ్యాన్స్‌కి కనువిందే!

Nandamuri Balakrishna : బాలయ్య కు మొదటి సౌత్ ఇండియన్ హీరోగా ఆ ఘనత

Nani New Movie : 30 ఎకరాల స్లమ్‌లో నాని కష్టాలు… ఆ డైరెక్టర్ అసలేం చేస్తున్నాడో

Akkineni Akhil : బిగ్ బ్రేకింగ్ – తండ్రి కాబోతున్న అక్కినేని అఖిల్ ?

Ram Pothineni: ప్రేమలో పడ్డాడు.. అప్పుడు రాశాడు… ఇప్పుడు పాడాడు

Big Stories

×