Weight Loss: ఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది చాలామందికి ఒక సవాలుగా మారింది. చాలామంది జిమ్‌కు వెళ్లడం, కఠినమైన డైట్ పాటించడం, లేదా వేగంగా రిజల్ట్ ఇచ్చే షార్ట్‌కట్‌లను ట్రై చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. ఒక యువకుడు కేవలం ఆరు నెలల్లో 40 కిలోల బరువు తగ్గడం ద్వారా ఒక అద్భుతమైన ఉదాహరణను మన ముందు ఉంచాడు. ఈ బరువు తగ్గే ప్రయాణంలో అతడు జిమ్‌కు వెళ్లలేదు, కఠినమైన డైట్లు పాటించలేదు. కేవలం చిన్న చిన్న మార్పులతో ఈ అసాధారణ విజయాన్ని సాధించాడు.
ఎలా ప్రారంభించాడు ?
సదరు యువకుడి బరువు 112 కిలోలు. అప్పటివరకు అతని దినచర్యలో జంక్ ఫుడ్, వేయించిన ఆహారాలు, చక్కెర కలిపిన డ్రింక్స్ ఎక్కువగా ఉండేవి. వ్యాయామం అన్నదే లేదు. బట్టలు సరిపోకపోవడం, నడవడానికి కూడా ఇబ్బంది పడటం వంటి సమస్యలు మొదలయ్యాక.. అతను తన లైఫ్ స్టైల్ మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఇంటి భోజనమే ప్రాధాన్యం:
బరువు తగ్గడానికి అతను మొదట చేసిన పని, నూనెతో కూడిన ఆహారాలను పూర్తిగా మానేయడం. వాటి స్థానంలో సమతుల్యమైన ఇంటి భోజనాన్ని తీసుకోవడం ప్రారంభించాడు. కూరగాయలు, పండ్లు, లీన్ ప్రొటీన్లు, పుష్కలంగా నీరు తన డైట్‌లో చేర్చుకున్నాడు. అంతేకాకుండా.. డాక్టర్ సలహా మేరకు, పోర్షన్ కంట్రోల్‌ను పాటించడం మొదలుపెట్టాడు. అంటే.. అన్నీ తింటూనే, మోతాదుకు మించి తినకుండా జాగ్రత్త పడ్డాడు. దీని వల్ల అతను పూర్తిగా కడుపు నిండిన అనుభూతిని పొందేవాడు.
క్రమం తప్పని వ్యాయామం:
బరువు ఎక్కువగా ఉన్నప్పుడు కేవలం ఆహార నియమాలతో పూర్తి ఫలితాలు రావడం కష్టం. కాబట్టి.. అతడు నెమ్మదిగా శారీరక శ్రమను తన లైఫ్ స్టైల్ లో భాగంగా చేసుకున్నాడు. మొదటి రోజూ కొంత దూరం నడవడం ప్రారంభించాడు. తర్వాత ఇంట్లోనే తేలికపాటి వ్యాయామాలు చేయడం మొదలుపెట్టాడు. ఇది అతడికి అలసట లేదా నిరుత్సాహం కలగకుండా సహాయపడింది.
Also Read: మీ ముఖం, మెడ.. ఇలా మారుతున్నట్లయితే కిడ్నీ సమస్యలు మొదలైనట్లే !
ఆలస్యంగా మార్పు:
తనకంటూ ఒక షెడ్యూల్ తయారుచేసుకుని, దాన్ని స్థిరంగా పాటించడం వల్ల ఆ యువకుడు తన శరీరంలో మార్పులు గమనించడం మొదలుపెట్టాడు. అతడు అనుకున్నంత బరువు తగ్గడమే కాకుండా , కాళ్ళ నొప్పులు లేకుండా నడవగలిగాడు. గతంలో కంటే ఎక్కువ శక్తిని పొందాడు. కానీ.. ఈ మార్పులలో అతి ముఖ్యమైనది అతడి మానసిక ఆరోగ్యం మెరుగుపడటం అని చెప్పవచ్చు.
ఆరు నెలల్లో దాదాపు 37 కిలోలు తగ్గించుకున్న తర్వాత, బరువును స్థిరంగా ఉంచుకోవడానికి, కండరాలను బలోపేతం చేయడానికి జిమ్‌లో చేరాడు. ఇప్పుడు అతను 75 కిలోల బరువుతో తన లైఫ్ స్టైల్ కొనసాగిస్తున్నాడు.