Miray Movie: టాలీవుస్ మోస్ట్ వాంటెడ్ హీరోలలో యంగ్ హీరో తేజా చేరిపోయాడు. గత ఏడాది వచ్చిన హనుమాన్ మూవీతో భారీ విషయాన్ని సొంతం చేసుకున్న ఈ కుర్ర హీరో ప్రస్తుతం మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు.. తాజాగా ఈయన నటించిన మిరాయ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. సూపర్ హీరో జోనర్ లో ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఆ సినిమా..ప్రపంచవ్యాప్తంగా వేరే లెవెల్ లో సందడి చేస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన మిరాయ్..55 కోట్ల క్లబ్లోకి చేరిపోయింది. అటు అమెరికాలో కూడా దుమ్ము దులిపేస్తుంది. అక్కడ ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఒకసారి తెలుసుకుందాం..
రిలీజ్ అవుతున్న సినిమాలు చాలా వరకి ఓవర్సీస్ లో కూడా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ తెలుగు సినిమాలు ఎలా రిలీజ్ అవుతాయో అక్కడ అలానే రిలీజ్ అవుతాయి.. అంతేకాదు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సృష్టిస్తున్నాయి. తాజాగా తేజ సజ్జా నటించిన మిరాయ్ ఈ మూవీ కూడా అక్కడ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విషయాన్ని అందుకొని దుమ్ము దులిపేస్తుంది. ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ ఘనత సాధించారు. ఇప్పుడు మళ్లీ మిరాయ్ తో కూడా అందుకున్నారు. మిలియన్ డాలర్ల మైలురాయిని దాటడమే కాకుండా.. అమెరికాలో దాదాపు వెంటనే బ్రేక్ ఈవెన్ ను సాధించి మరో అరుదైన ఫీట్ ను అందుకున్నారు. మొత్తానికి ఈ మూవీ విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో కూడా సత్తాను చాటుతుంది.
Also Read : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ చిత్రాలు.. ఆ ఒక్కటి స్పెషల్..
మిరాయ్ భారీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న హీరో తేజా.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని యంగ్ హీరో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత గతంలో బ్లాక్ బస్టర్ అందుకున్న జాంబిరెడ్డి 2 సినిమాను చేయనున్నట్టు సమాచారం. అతి త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది. అలాగే మిరాయ్ 2 మూవీని సెట్స్ మీదకి తీసుకెళ్ళి పోతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి అయితే తేజ చేతిలో రెండు సినిమాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాల గురించి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక ఈ రెండు సినిమాలు అయిపోగానే జై హనుమాన్ సినిమాలో నటించబోతున్నట్లు టాక్. ఈ ఏడాదిలో మళ్లీ మరో హిట్ కోసం తేజ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.. ఏది ఏమైనా కూడా తేజ గతంలో చేసిన సినిమాలతో పోలిస్తే హనుమాన్ సినిమా తన కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఇప్పటి వరకైతే ఫ్లాప్ సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరో ఇకముందు ఎలాంటి సినిమాలు తో ప్రేక్షకులను మెప్పిస్తాడు చూడాలి.