BigTV English

Mirai Movie : తేజా ‘మిరాయ్ ‘ మళ్లీ వాయిదా.. అసలు రిలీజ్ అవుతుందా?

Mirai Movie : తేజా ‘మిరాయ్ ‘ మళ్లీ వాయిదా.. అసలు రిలీజ్ అవుతుందా?

Mirai Movie : టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి, ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన పలు సినిమాల్లో నటించాడు. అయితే ఈయనకు బాగా పేరు తీసుకొచ్చిన సినిమా అంటే హనుమాన్. ఈ మూవీ తో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు తేజా.. దీనికి సీక్వల్ గా మరో సినిమా రావాల్సి ఉంది. కొన్ని కారణాలవల్ల సినిమా సెట్స్ మీద ఆగిపోయింది.


ప్రస్తుతం తేజా మరో సినిమాలో నటిస్తున్నాడు. భారీ యాక్షన్ సీక్వెల్ గా రాబోతున్న మిరాయ్ సినిమాలో తేజ ప్రధాన పాత్ర లో నటిస్తున్నాడు. దాదాపు షూటింగ్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఏ మూవీ విడుదల తేదీ మాత్రం లాక్ చేసుకోలేదు. త్వరలోనే సినిమా రిలీజ్ కాబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు వాయిదా పడుతుందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది.

మిరాయ్ మళ్లీ వాయిదా..?


సెప్టెంబరు మొదటి వారంలో రావాల్సిన మిరాయ్ సినిమాను కూడా ఇలాగే మరోసారి వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాకు రెండుసార్లు డేట్ మార్చారు.. ఈ డేట్ ఫిక్స్ అని అనుకుంటున్న సమయంలో మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాల్సిన సినిమా. పెద్ద బడ్జెట్ పెట్టారు. కొన్ని రోజుల కిందటి వరకు సెప్టెంబరు 5కే ఫిక్స్ అనుకున్నారు.. తేజా ప్రమోషన్స్ కూడా మొదలెట్టాడు. కానీ ఇప్పుడు మూవీ డేట్ మారేట్లు కనిపిస్తుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Also Read : బాబోయ్.. లిప్ కిస్ లతో యాంకర్ హర్షిణి.. సినిమా మొత్తం అవే సీన్లు..

అక్టోబర్ లో థియేటర్లలోకి..

సెప్టెంబర్ 5 న అనుష్క సినిమా ‘ఘాటి’కి కలిసొచ్చే విషయమే. ఆ సినిమా కూడా రెండు మూడుసార్లు వాయిదా పడి సెప్టెంబరు 5కు ఫిక్స్ అయింది.. మిరాయ్ సెప్టెంబరు 5 మిస్ అయింది. అంటే ఈ డేట్ ను మిస్ చేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అక్టోబర్ కు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ నెలలో డేట్ ను లాక్ చేసుకుంటుందో లేదో చూడాలి.. ఇప్పటికే మిరాయ్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు హైప్ కూడా క్రియేట్ చేసింది. ఇక ఇంకో నెలలో రిలీజ్ పెట్టుకొని ప్రమోషన్స్ చెయ్యకుండా ఉండకుండా ఉండటమే దీనికి కారణం.. మరి కొద్ది రోజుల్లో కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చెయ్యనున్నారని సమాచారం.. తేజా ఇందులో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న హీరోగా నటిస్తున్నాడు. మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ తో పాటుగా జై హనుమాన్ సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని థియేటర్లలోకి రాబోతుంది.

Related News

Mammootty: అనారోగ్యంతో మమ్ముట్టి.. ఒక పోస్టుతో క్లారిటీ ఇచ్చిన మోహన్ లాల్!

Tollywood : కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె.. నేడు నిర్మాతలతో ఛాంబర్ పెద్దల భేటీ..

Jr.NTR: దేవర 2 అందుకే ఆగిపోయింది.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన మేకర్స్!

Anchor Harshini : బాబోయ్.. లిప్ కిస్ లతో యాంకర్ హర్షిణి.. సినిమా మొత్తం అవే సీన్లు..

Dhoom 4 : బాలీవుడ్ కు మరో టాలీవుడ్ హీరో బలి, ఇప్పుడు ఎంట్రీ ఇవ్వడం అవసరమా?

Big Stories

×