Anchor Harshini : బుల్లితెరపై ఒకప్పుడు యాంకర్ లగా కనిపించిన కొందరు, ఈ మధ్య సినిమాలలో హీరోయిన్లుగా చేస్తున్నారు. అందులో కొంతమంది బాగా సక్సెస్ అయ్యి సినిమాల్లో బిజీగా అయితే, మరి కొంతమంది మాత్రం మళ్లీ యూ టర్న్ తీసుకొని బుల్లితెరపై యాంకర్లుగా కొనసాగిస్తున్నారు. తాజాకా మరో యాంకరు సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతుంది. యాంకర్ సుమ, ఝాన్సీ, అనసూయ, రష్మీ, శ్రీముఖి, దీపికా పిల్లి, అరియానా ఇలా చాలామంది యాంకర్ల నుంచి యాక్టర్లుగా ప్రమోట్ అయిన వాళ్లే ఉన్నారు. యూట్యూబ్ లో యాంకర్ గా చేస్తూ హీరోయిన్ గా మారింది హర్షిణి.. పాతికకి పైగా సినిమాల్లో నటించారంటే నమ్మశక్యంగా లేదు కదూ.. కానీ ఆమె నిజంగానే నటించారు. వాటిలో కొన్ని విడుదలైతే మరికొన్ని షూటింగ్ దశలోనే ఆగిపోయాయి.. తాజాగా ఈ అమ్మడు లిప్ కిస్ లతో రెచ్చిపోయిన వీడియో సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
రొమాంటిక్ సాంగ్ లో యాంకర్..
కొన్ని సినిమాలు చేయడానికి యాంకర్లు వెనకడుగు వేస్తారు. అందులో నువ్వు రొమాంటిక్ సీన్లు సాంగులు ఉన్నటివి చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. కానీ ఈ యాంకర్ హర్షిణి మాత్రం రొమాంటిక్ సాంగ్లో రెచ్చిపోయింది. మూడేళ్ల క్రితం అర్జున్ కళ్యాణ్, హర్షిణి కాంబోలో ‘కళ్లు కళ్లు కలిసే క్షణమే అనే సాంగ్ లో చేశారు. దీనిలో ఇద్దరూ ముద్దులతో హగ్గులతో మునిగిపోయారు. బాలీవుడ్ సాంగ్ కన్నా ఇది చాలా డీప్ గా ఉందని నెట్టింట వార్తలు కూడా వినిపించాయి. ఇదేవిధంగా వెబ్ సిరీస్ లు కూడా చేసింది. అయితే ఆమె ఇప్పటివరకు ఎన్నడూ కనిపించిన విధంగా వీటిలో కనిపించడంతో సోషల్ మీడియాలో చర్చినీయాంశంగా మారింది.
Also Read: బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. అవి వెరీ స్పెషల్..
హర్షిణి చేసిన సినిమాలు..
ప్రముఖ యాంకర్ వీజే సన్నీ హీరోగా నటించిన ఏటీఎం వెబ్ సిరీస్ లో కూడా శృతి మించిన శృంగారపు సీన్లను చేసి అందరిని ఔరా అనిపించింది యాంకరమ్మా.. యాంకర్ గా ఇంటర్వ్యూలు చేసుకుంటున్న ఈమె టాలెంట్‌ని తొలిగా గుర్తించింది మాత్రం ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ. అమీతుమీ సినిమా ప్రమోషన్స్‌లో ఇంద్రగంటిని ఇంటర్వ్యూ చేసింది యాంకర్ హర్షిణి.. అప్పుడే ఆయన సినిమాలో ఆఫర్ ఉందని పిలిచి సమ్మోహనంలో సిస్టర్ పాత్రలో నటించే అవకాన్ని ఇచ్చాడు. రీసెంట్‌గా సారంగపాణి జాతకం సినిమాలో కూడా యాంకర్ హర్షిణి నటించింది. ఇంద్రగంటి మోహనకృష్ణ లేక పోతే.. తనకి సినిమా కెరియర్ లేదని చాలా సందర్భాల్లో బయట పెట్టింది. ఇండస్ట్రీలోకి ఏంటి ఇచ్చిన అతి కొద్ది కాలంలోనే పాతిక సినిమాలకు పైగా చేసి శభాష్ అనిపించుకుంది. మొత్తానికి యాంకర్ టు యాక్టర్ గా ఈమె కెరియర్ సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతోంది. ఇకముందు ఎలాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి…