E-Paper
Advertisement

Tejaswi Madivada: నీకు ఇద్దరు కాదు నలుగురు కావాలి.. హిందీ రియాలిటీ షోలో రెచ్చిపోయిన తేజస్వీ మదివాడ

Tejaswi Madivada: నీకు ఇద్దరు కాదు నలుగురు కావాలి.. హిందీ రియాలిటీ షోలో రెచ్చిపోయిన తేజస్వీ మదివాడ
Advertisement

Tejaswi Madivada: సినిమాలు, బిగ్‌బాస్ ద్వారా మంచి గుర్తింపు పొందిన నటి తేజస్వీ మదివాడ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన ఈ భామ ఇటీవల ఒక హిందీ రియాలిటీ షోలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ షోలో ఆమె మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తేజస్వీ తన సినీ ప్రయాణాన్ని Life Is Beautiful (లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్) సినిమాతో ప్రారంభించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. హీరోయిన్‌గా అవకాశాలు వచ్చినా పెద్దగా విజయాలు దక్కలేదు. దీంతో టెలివిజన్ వైపు అడుగులు వేసింది. ముఖ్యంగా Bigg Boss Telugu (బిగ్ బాస్ తెలుగు)లో పాల్గొనడం ద్వారా ఆమెకు భారీ పాపులారిటీ వచ్చింది. తన నేరుగా మాట్లాడే స్వభావం వల్ల అప్పట్లోనే హాట్ టాపిక్ అయింది.

ఒకరు కాదు నలుగురు..!

Advertisement

బిగ్‌బాస్ తర్వాత కొన్ని వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేసినా అవి పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో కొంతకాలం సైలెంట్‌గా కనిపించింది. కానీ ఇప్పుడు హిందీ టెలివిజన్‌లో ప్రసారమవుతున్న ఒక రియాలిటీ షోలో పాల్గొని మళ్లీ వార్తల్లోకి వచ్చింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రోమోలో తేజస్వీ చాలా ఎమోషనల్‌గా మాట్లాడింది. “నీకు ఇద్దరు కాదు, నలుగురు కావాలి. ఈ రోజుల్లో అమ్మాయిలు ఒకరిని ఒకరు సపోర్ట్ చేయడం లేదు. పైగా ఒకరి గురించి మరొకరు చెడుగా మాట్లాడుతున్నారు. అమ్మాయిలు ఇలా మాట్లాడితే ప్రపంచం కూడా అలాగే మాట్లాడుతుంది. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి” అని ఆమె చెప్పింది.

Advertisement

అసలు ఇదేం షో రా బాబు..!

ఇంకా సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టి గాసిప్‌లు వైరల్ చేయడంపై కూడా ఆమె స్పందించింది. “ఇక్కడ కోపం, అక్కడ గాసిప్ అని ట్రెండ్ చేస్తే నేను తప్పకుండా స్పందిస్తాను” అని గట్టిగా చెప్పింది. ఇక ఇదేమి షో అక్కడ ఈమె ఎందుకు ఉంది అని అందరూ కన్ఫ్యూస్ అవుతున్నారు. అసలు విషయానికి వస్తే హిందీ కలర్స్ లో పాపులర్ అయిన డి 50 షోలో ఈమె సెలెక్ట్ అయింది. ఇక ఈ వీడియో అ షోకి సంబంధించినదని తెలుస్తోంది.

ఈ వ్యాఖ్యలతో తేజస్వీ మదివాడ మరోసారి తన బోల్డ్ స్వభావాన్ని చూపించింది. ఆమె మాటలపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. ఏదేమైనా, తేజస్వీ పేరు మళ్లీ చర్చల్లో నిలిచింది.

ALSO READ: Dil Raju: అల్లు అర్జున్ 42 రూల్స్.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన దిల్ రాజు!

Related News

నేపాల్ విధ్వంసం.. రంగంలోకి సోనూసూద్.. ప్రజలకు విజ్ఞప్తి!

శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ఆకట్టుకుంటున్న ‘దేవరాయ’ టైటిల్ గ్లింప్స్ అండ్ ఫస్ట్ లుక్!

78వ ఎమ్మీ అవార్డ్స్ తుది జాబితా.. అత్యధిక నామినేషన్స్ అందుకున్న షోలు!

హాస్పిటల్ పాలైన మమితా బైజు.. వీడియో వైరల్!

హరికృష్ణ 70వ జయంతి..ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్!

ఐదుసార్లు చావును దగ్గరగా చూశాను.. అదే నాకు ఇంపార్టెంట్.. హీరో కామెంట్స్..

“ప్రజలు మెచ్చిన నాయకుడు”.. పవన్ కళ్యాణ్ కు చిరంజీవి స్పెషల్ బర్త్‌డే విషెస్!

Poojitha Ponnada : గార్జీయస్ లుక్ లో మెరిసిపోతున్న పూజిత.. కుర్రాళ్ళు ఏమైపోతారమ్మా..!

Big Stories

Advertisement
×