BigTV English

SSMB29 Update : ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు, మరి ఈ సినిమా పరిస్థితి ఏంటో.?

SSMB29 Update : ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు, మరి ఈ సినిమా పరిస్థితి ఏంటో.?

SSMB29 : తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటివరకు మహేష్ బాబు పాన్ ఇండియా సినిమా చేయలేదు. మొదటిసారి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. మహేష్ బాబు కెరియర్ లో వస్తున్న 29వ సినిమా ఇది. రాజమౌళి కాంబినేషన్ లో మహేష్ బాబు సినిమా అనగానే అందరికీ అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి.


ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా మీద విపరీతమైన క్యూరియాసిటీ ఉంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ను ఆపారు.

అందరూ బ్రేక్ లో ఉన్నారు 


ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో పడ్డారు. మరోవైపు బాహుబలి సినిమాకి సంబంధించి ఎడిటింగ్ వర్క్ లో కూడా బిజీగా ఉన్నారు. బాహుబలి సినిమా రి రిలీజ్ కి సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ పనిలో బిజీగా మారిపోయారు జక్కన్న. హీరో మహేష్ బాబు ప్రస్తుతం శ్రీలంక ట్రిప్ లో ఉన్నట్లు సమాచారం వినిపిస్తుంది. హీరోయిన్ ప్రియాంక చోప్రా తన హస్బెండ్ నిక్ తో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు బ్రేక్లో ఉన్న తరుణంలో మహేష్ బాబు అభిమానులు మాత్రం ఈ సినిమా అప్డేట్ కోసం చాలా ఆశతో ఎదురు చూస్తున్నాను. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లిమ్స్ విడుదల కానుంది అని వార్తల కూడా వస్తున్నాయి.

అతడు రీ రిలీజ్ 

మహేష్ బాబు సినిమా ఇప్పట్లో రాదు అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. అందుకే మహేష్ బాబు హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఇదివరకే మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అతడు సినిమాను రిలీజ్ చేయనున్నారు. అతడు సినిమా అప్పట్లో కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. కానీ టీవీలో వస్తే ఇప్పటికీ ఆ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సక్సెస్ నమోదు చేసుకుంటుందో ఇప్పుడు తెలుస్తుంది. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు అని చాలామంది అభిమానులు బాధపడుతూ ఉంటారు.

Also Read: ఓర్నీ పవన్ ను అంత మాట అనేశావ్ ఏంటీ వర్మ.. ఇంకా డోస్ సరిపోలేదా? దారుణమైన ట్రోల్స్!

Related News

Pawan Kalyan: ఇప్పటి వరకు ఆ రికార్డు లేని ఒకే ఒక్క హీరో పవన్‌.. OGతో సాధ్యమయ్యేనా?

Rajinikanth: రజినీకాంత్ ఆలయంలో నవరాత్రి పూజలు… ఇదేమీ అభిమానం రా సామి!

‎Katrina Kaif: పెళ్లైన నాలుగేళ్లకు తల్లి అవుతున్న హీరోయిన్… బేబీ బంప్ ఫోటో వైరల్!

‎Manchu Lakshmi: అర్హ హైడ్రోజన్ బాంబ్… దెబ్బకు భయపడిపోయిన మంచు లక్ష్మీ!

Teja Sajja: ప్రభాస్, ఎన్టీర్ తరువాత ఆ రికార్డు సొంతం చేసుకున్న తేజ సజ్జ!

OG First Review: పూర్ వీఎఫ్ఎక్స్… మూవీని కాపాడేది ఆ 15 నిమిషాలే!

Vedhika: బికినీలో కూడా నటిస్తా.. గట్టి కౌంటర్ ఇచ్చిన వేదిక.. ఏమైందంటే?

Bandla Ganesh: మరోసారి అల్లు అరవింద్‌పై బండ్లన్న కామెంట్స్‌.. అంతమాట అనేశాడేంటి..

Big Stories

×