E-Paper
Advertisement

మైత్రీ సంస్థ డిస్ట్రిబ్యూషన్ పద్ధతిపై సీరియస్ అవుతున్న ఎగ్జిబిటర్లు.. ఎందుకంటే?

మైత్రీ సంస్థ డిస్ట్రిబ్యూషన్ పద్ధతిపై సీరియస్ అవుతున్న ఎగ్జిబిటర్లు.. ఎందుకంటే?
Advertisement

Theatre Crisis: తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మే 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు మూతపడనున్నాయనే వార్తలు టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ అనుసరిస్తున్న డిస్ట్రిబ్యూషన్ విధానంపై ఎగ్జిబిటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెంట్ పద్ధతిలో నష్టాలు భరించలేమని, పర్సంటేజ్ పద్ధతిని అమలు చేయకపోతే థియేటర్లను శాశ్వతంగా మూసివేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.

Read also-జబర్దస్త్ ఫైమా షాకింగ్ కామెంట్స్!.. నరేష్‌తో ఎఫైర్ గురించి ఏం చెప్పారంటే?

Advertisement

వివాదానికి కారణం

గత రెండు దశాబ్దాలుగా దిల్ రాజు, సురేష్ బాబు వంటి ప్రముఖ నిర్మాతలు లీజు వ్యవస్థ ద్వారా సింగిల్ స్క్రీన్‌లను ఆదుకున్నారని ఎగ్జిబిటర్లు గుర్తుచేస్తున్నారు. థియేటర్ యజమానులకు గౌరవప్రదమైన రెంట్ ఇప్పించి, వ్యవస్థను కాపాడారని వారు పేర్కొంటున్నారు. అయితే, మైత్రీ సంస్థ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ప్రవేశించాక పరిస్థితులు తలకిందులయ్యాయని వారి ఆరోపణ. ఉదాహరణకు 5 లక్షలు వచ్చే రెంట్‌ను 2 లక్షలకు కుదించి, నిర్మాతలకు ఎక్కువ లాభాలు చేకూరుస్తున్నారని ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. థియేటర్ ఓనర్ల ప్రయోజనాలను పక్కన పెట్టి, సింగిల్ స్క్రీన్ వ్యవస్థను మైత్రీ అణచివేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మారిన ట్రెండ్

Advertisement

కోవిడ్ తర్వాత సినిమా చూసే విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సినిమా విడుదలైన మొదటి వారాంతంలోనే అత్యధిక మంది ప్రేక్షకులు సినిమా చూసేస్తున్నారు. “ప్రస్తుతం 90% మంది ప్రేక్షకులు మొదటి వారంలోనే సినిమా చూస్తున్నారు. రెండో వారానికి థియేటర్లు ఖాళీ అవుతున్నాయి.” ఇందుకు “దురంధర్ 2” చిత్రాన్ని వారు ఉదాహరణగా చూపుతున్నారు. మొదటి వారం సింగిల్ స్క్రీన్స్‌లో 80 లక్షలు వసూలు చేసిన ఈ చిత్రం, రెండో వారానికి కేవలం 20 లక్షలకే పరిమితమైంది. బ్లాక్ బస్టర్ హిట్ అయితే తప్ప రెండో వారంలో వసూళ్లు రావడం లేదని, ఇలాంటి తరుణంలో భారీ రెంట్లు చెల్లించి థియేటర్లు నడపడం అసాధ్యమని వారు స్పష్టం చేస్తున్నారు.

Read also-ఫైమా తన ఫేవరేట్ హీరోతో ఏం చేయాలనుకుందో తెలిస్తే షాక్ అవుతారు.. అస్సలు ఊహించరు..

డిమాండ్

మల్టీప్లెక్స్‌లకు ఒక నీతి, సింగిల్ స్క్రీన్స్‌కు ఒక నీతా? అని ఎగ్జిబిటర్లు ప్రశ్నిస్తున్నారు. మల్టీప్లెక్స్‌లలో మొదటి వారం 55%, రెండో వారం 45%, మూడో వారం 35% షేరింగ్ పద్ధతిని పాటిస్తున్నప్పుడు, సింగిల్ స్క్రీన్స్‌లో అదే పద్ధతిని ఎందుకు అమలు చేయరని వారు నిలదీస్తున్నారు. నిర్మాతలు లేదా గిల్డ్ గనుక పర్సంటేజ్ పద్ధతికి అంగీకరించకపోతే, మే 1 నుండి థియేటర్లు మూసివేస్తామని ఎగ్జిబిటర్లు భీష్మించుకు కూర్చున్నారు. సింగిల్ స్క్రీన్స్ మూతపడితే సామాన్య, మధ్యతరగతి ప్రేక్షకులు వినోదానికి దూరమవుతారని వారు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో మొదలైన ఈ నిరసన సెగ త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు కూడా పాకే అవకాశం ఉంది. ఈ సంక్షోభంపై మైత్రీ సంస్థ లేదా ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×