BigTV English

T-20 Records : టీ-20 చరిత్రలోనే తోపు బౌలర్లు.. వీళ్లు వేసిన ఓవర్లు అన్ని మెయిడీన్లే..!

T-20 Records : టీ-20 చరిత్రలోనే తోపు బౌలర్లు.. వీళ్లు వేసిన ఓవర్లు అన్ని మెయిడీన్లే..!
Advertisement

T-20 Records : సాధారణంగా క్రికెట్ ఎప్పుడూ ఏం జరుగుతుందో ఊహించడమే పెద్ద కష్టం అనే చెప్పవచ్చు. ముఖ్యంగా కొందరూ ఆటగాళ్లు ఎప్పుడూ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తారో.. కొందరూ బౌలర్లు ఎప్పుడూ సూపర్ గా బౌలింగ్ చేస్తారో.. ఎప్పుడు చెత్త బౌలింగ్ చేస్తారో చెప్పడం కష్టమే. ప్రధానంగా బ్యాటింగ్ లో ఏ రికార్డు బ్రేక్ చేస్తారో.. బౌలింగ్ లో ఏ రికార్డును బద్దలు కొడతారో ఊహించలేకపోతుండటం విశేషం. ఇక టీ-20 క్రికెట్ లో అయితే కొంత మంది సిక్సర్లతో, కొందరూ ఫోర్లతో, కొందరూ వికెట్లతో, కొందరూ క్యాచ్ లతో మరికొందరూ బౌలింగ్ లో మెయిడీన్లు ఇలా రకరకాలుగా వ్యవహరిస్తుంటారు. వాస్తవానికి టీ-20 క్రికెట్ లో 4 మెయిడెన్ ఓవర్లు బౌలింగ్ చేయడం అంటే ఏ బౌలర్ కి అయినా కష్టంతో కూడుకున్న పనే. కానీ టీ-20 ఓవర్ ఫార్మాట్ లో ఈ అసాధ్యమైన రికార్డును ఈ ముగ్గురు బౌలర్లు సుసాధ్యం చేశారు. టీ-20 అంతర్జాతీయ క్రికెట్ లో తమ కోటాలో 4 ఓవర్లను మెయిడెన్ గా బౌలింగ్ చేసిన ముగ్గురు బౌలర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


సాద్ బిన్ జాఫర్ (కెనడా) : 

ఐసీసీ పురుషుల టీ-20 ప్రపంచ కప్ అమెరికాస్ రీజియన్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో కెనడా ఎడమచేతి వాటం స్పిన్నర్ సాద్ బిన్ జాఫర్ తన 4 ఓవర్ల కోటాలోని 4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అయితే సాద్ బిన్ జాఫర్ పనామాతో జరిగిన మ్యాచ్ లో 4 మెయిడెన్ ఓవర్లు వేసి 4 ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 2 వికెట్లు తీశాడు. దీంతో ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా జట్టు 20 ఓవర్లలో 1 వికెట్ కి 245 పరుగులు చేసింది. పనామా ముందు 246 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే పనామా జట్టు 17.2 ఓవర్లకు కేవలం 37 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది. దీంతో కెనడా జట్టు 208 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడం విశేషం.


లాకీ ఫెర్గూసన్ (న్యూజిలాండ్) : 

టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లూకి ఫెర్గూసన్ తన 4 ఓవర్ల కోటాలోని 4 ఓవర్లను మెయిడెన్ గా బౌలింగ్ చేశాడు. లాకీ ఫెర్గూసన్ పాపువా న్యూ గినియా పై 4 మెయిడెన్ ఓవర్లు వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లను తీసుకున్నాడు. ఈ మ్యాచ్ లో పాపువా న్యూ గినియా జట్టు 19.4 ఓవర్లలో 78 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ జట్టు 12.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

ఆయుష్ శుక్లా ( హాంకాంగ్) : 

ఐసీసీ పురుషుల టీ-20 ప్రపంచ కప్ ఆసియా క్వాలిఫైర్ ఏ మ్యాచ్ లో హాంకాంగ్ మీడియం పేసర్ ఆయుష్ శుక్లా తన 4 ఓవర్ల కోటాలోని 4 ఓవర్లను మెయిన్ ఓవర్లుగా బౌలింగ్ చేశాడు. మంగోలియా పై ఆయుష్ శుక్లా 4 మెయిడిన్ ఓవర్లు వేశాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ లో మంగోలియా జట్టు 14.2 ఓవర్లలో 17 పరుగులకే కుప్ప కూలింది. హాంకాంగ్ జట్టు కేవలం 1.4 ఓవర్లలోనే తన లక్ష్యాన్ని ఛేదించింది. 110 బంతులు మిగిలి ఉండటంతో పాటు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది హాంకాంగ్ జట్టు.

 

Related News

Dhaka Airport Fire: బంగ్లాదేశ్‌, వెస్టిండీస్ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా భారీ అగ్నిప్రమాదం..ఉలిక్కిప‌డ్డ ప్లేయ‌ర్లు

Suryakumar Yadav: గిల్‌ వ‌ల్ల‌ కెప్టెన్సీ కోల్పోతాననే భయం ఉంది..సూర్య సంచ‌ల‌నం !

IND VS AUS: ఫ్యాన్స్ కు బిగ్ షాక్‌..ఆసీస్‌-టీమిండియా తొలి వ‌న్డేకు వ‌ర్షం అడ్డంకి

Pak Tri-series: ఆఫ్ఘనిస్తాన్ కు ఝ‌ల‌క్‌.. పాకిస్థాన్ ను కాపాడేందుకు రంగంలోకి జింబాబ్వే

Harshit Rana : హర్షిత్ రాణాకు ఎంత బ‌లుపు..రోహిత్ శ‌ర్మ ముందే కాలు ఎత్తి మ‌రీ

Virat Kohli: వివాదంలో విరాట్ కోహ్లీ..పాకిస్థాన్ జెర్సీపై ఆటోగ్రాఫ్‌…? అస‌లు ఏం జ‌రిగిందంటే

IND VS AUS : రేప‌టి నుంచి ఆసీస్‌, టీమిండియా వ‌న్డే సిరీస్‌.. ఎర్లీ మార్నింగే మ్యాచ్‌లు..ఉచితంగా ఎలా చూడాలి

Afg vs Pak: ముగ్గురు క్రికెట‌ర్లు మృతి…పాకిస్థాన్ సిరీస్ ర‌ద్దు చేసుకున్న అప్ఘ‌నిస్తాన్‌..PCBకి రూ.100 కోట్ల న‌ష్టం !

Big Stories

×