Vishal Dhansika: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal)నేడు పుట్టినరోజు(Birthday) వేడుకలతో పాటు తన నిశ్చితార్థపు(Engagment) వేడుకను కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నారు. విశాల్ గత కొంతకాలంగా సహనటి ధన్సిక(Dhansika)ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. ఇలా వీరి రిలేషన్ గురించి వార్తలు వచ్చిన నేపథ్యంలో తమ రిలేషన్ గురించి విశాల్ అధికారకంగా ప్రకటించారు. అలాగే తన పుట్టినరోజున శుభవార్త కూడా చెప్పబోతున్నారని ఈయన గతంలో పలు సందర్భాలలో వెల్లడించారు. ఇక నేడు పుట్టినరోజు జరుపుకున్న విశాల్ ఏకంగా నిశ్చితార్థం కూడా జరుపుకొని నిశ్చితార్థపు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
12 సంవత్సరాలు వయసు తేడా…
ప్రస్తుతం విశాల్ ధన్సిక నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే విశాల్ ఇప్పుడు నిశ్చితార్థం జరుపుకుంటున్న నేపథ్యంలో వీరిద్దరి ఏజ్ గ్యాప్(Age Gap) గురించి కూడా చర్చలు మొదలయ్యాయి. విశాల్ 1977 ఆగస్టు 29వ తేదీ జన్మించారు. నేడు ఈయన తన 48వ పుట్టినరోజు వేడుకలను జరుపుకొంటూ 49వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. ఇక ధన్సిక నవంబర్ 20 1989లో జన్మించారు. ప్రస్తుతం ఈమెకు 35 సంవత్సరాల వయస్సు ఇలా వీరిద్దరి మధ్య సుమారు 12 సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉందని తెలుస్తోంది.
49 సంవత్సరాల వయసులో పెళ్లి…
హీరో విశాల్ ఏకంగా తనకంటే వయసులో 12 సంవత్సరాలు చిన్నదైన నటిని పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే మరి కొంతమంది 49 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుని ఏం లాభం అన్న అంటూ కూడా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా తమ అభిమాన హీరో పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడు కాబోతున్న నేపథ్యంలో విశాల్ అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక నటి దన్సిక సైతం కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన సినిమాలలో విభిన్న పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి నటిగా మంచి సక్సెస్ అందుకున్నారు.
అనీషా అల్లారెడ్డితో నిశ్చితార్థం..
ఇక విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కోలీవుడ్ ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన విశాల్ తెలుగులో కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఈయన సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఇలా తెలుగు తమిళ భాషలలో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న విశాల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అయితే ఇదివరకే విశాల్ నటి అనీషా అల్లారెడ్డితో కూడా నిశ్చితార్థం చేసుకున్నారు. 2019వ సంవత్సరంలో నిశ్చితార్థం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే నిశ్చితార్థం తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ తమ నిశ్చితార్ధానికి బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. అనంతరం అనీషా మరో వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు.
Also Read: Supritha: ఆ హీరోతో బ్యాడ్లీ క్రష్ అంటున్న సుప్రీత.. ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ అదే అంటూ!