OTT Movie : మరాఠీ ఇండస్ట్రీ నుంచి ఒక సరికొత్త లవ్ స్టోరీ ఆడియన్స్ ని అలరిస్తోంది. ఈ చిత్రం అద్భుతమైన సినిమాటోగ్రఫీ, మెలోడియస్ సౌండ్‌ట్రాక్, అందమైన గ్రామీణ దృశ్యాలకు ప్రశంసలు అందుకుంటోంది. ఒక ప్రేమ జంట చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. IMDbలో 9.4/10 రేటింగ్‌తో ఈ సినిమా దూసుకుపోతోంది. ఈ జంట సమాజం, శత్రువులను ఎదుర్కునే క్రమంలో స్టోరీ ఉత్కంఠంగా నడుస్తుంది. తొందర్లోనే ఈ సినిమా ఓటీటీలో అడుగుపెట్టబోతోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
ఏ ఓటీటీలో అంటే
‘మాఝీ ప్రార్థన’ (Majhi prarthana ) 2025లో విడుదలైన మరాఠీ రొమాంటిక్-థ్రిల్లర్ చిత్రం. పద్మరాజ్ రాజ్‌గోపాల్ నాయర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో పద్మరాజ్ రాజ్‌గోపాల్ నాయర్ (గోల్యా), అనుషా అడెప్ (ప్రార్థన), ఉపేంద్ర లిమాయే, జైనేంద్ర నికలే నటించారు. 2025 మే 9న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, మహారాష్ట్రలో ఒక గ్రామీణ ప్రాంతంలో జరుగుతుంది. ఈ సినిమా Zee 5, jio hot star లో సెప్టెంబర్ లో వచ్చే అవకాశం ఉంది.
కథలోకి వెళ్తే
ఈ సినిమా మహారాష్ట్రలో ఒక గ్రామీణ ప్రాంతంలో గోల్యా, ప్రార్థన ప్రేమకథ చుట్టూ తిరుగుతుంది. గోల్యా ఒక సాధారణ గ్రామీణ యువకుడు. అదే ప్రాంతంలో ఉండే ప్రార్థనతో ప్రేమలో పడతాడు. వీళ్ళ స్వచ్ఛమైన ప్రేమ గ్రామంలోని కష్టాల మధ్య ఆశాకిరణంలా ప్రకాశిస్తుంది. కానీ ఈ ప్రేమ బ్రిటిష్ పాలన, సామాజిక అడ్డంకులు, గ్రామంలో ఉపేంద్ర అనే శత్రువు రూపంలో బెదిరింపులను ఎదుర్కొంటుంది. ఈ వ్యక్తి గ్రామంలో అధికారాన్ని ఉపయోగించి, వాళ్ళ ప్రేమను నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇది గోల్యా, ప్రార్థనలను విడదీసే ఒక భావోద్వేగ పరీక్షగా మారుతుంది.
ఈ జంట తమ ప్రేమను కాపాడుకోవడానికి గ్రామంలోని సామాజిక, రాజకీయ కుట్రలతో పోరాడతారు. గోల్యా తన ప్రేమ కోసం అనేక త్యాగాలు చేస్తాడు. అయితే ప్రార్థన తన కుటుంబ బాధ్యతలు, గ్రామ సంప్రదాయాల మధ్య చిక్కుకుంటుంది. ఉపేంద్ర ద్రోహం, బ్రిటిష్ అధికారులతో అతని రహస్య ఒప్పందాలు బయటపడతాయి. ఇది కథను ఒక థ్రిల్లింగ్ క్లైమాక్స్ వైపు నడిపిస్తుంది. గోల్యా, ప్రార్థనల ప్రేమ విజయవంతమవుతుందా ? లేక విధి వారిని విడదీస్తుందా ? ఈ సినిమా క్లైమాక్స్ ఏమిటి ?అనే సస్పెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
Read Also : సినిమా చరిత్రలోనే అత్యంత భయంకరమైన మూవీ… తీసిన డైరెక్టర్ మిస్సింగ్… బేబీ ఫేస్ సైకో కిల్లర్ కిరాతకం