OG Suvvi Suvvi Song: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఎస్ఎస్ తమన్ (SSThaman) తన మ్యూజిక్ ద్వారా అందరిని మాయ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో కాపీ ట్రోల్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈయన సినిమా నుంచి ఏదైనా సాంగ్ లేదా ఇతర అప్డేట్ విడుదలైన వెంటనే మ్యూజిక్ విషయంలో కానీ లిరిక్స్ విషయంలో కానీ కాపీ ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటార. ఇలా పలు సందర్భాలలో తమన్ దొరికిపోవడంతో ఈయనను కాపీ క్యాట్ (Copy Cat)అంటూ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇకపోతే తమన్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా సుజీత్(Sujeeth) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఓజీ సినిమా(OG Movie) పనులలో బిజీగా ఉన్నారు.
ట్రెంటింగ్ లో సువ్వి.. సువ్వి సాంగ్..
ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. అయితే వినాయక చవితి పండుగ సందర్భంగా నేడు ఉదయం ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ సువ్వి సువ్వి(Suvvi Suvvi) అంటూ సాగిపోయే పాటను విడుదల చేశారు. ప్రస్తుతం యూట్యూబ్లో ఈ పాట ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ పాట విన్న కొంతమంది మాత్రం తమన్ ఈ సాంగును కూడా కాపీ చేశారని ఈయనపై విమర్శలు కురిపిస్తున్నారు.
కాఫీ క్యాట్ అంటూ విమర్శలు..
ఒజీ సినిమా నుంచి విడుదల చేసిన సువ్వి సువ్వి సాంగ్ అచ్చం.. సవారి సినిమాలో శేఖర్ చంద్ర సంగీత సారథ్యంలో వచ్చిన ఉండిపోవా నువ్వు ఇలా రెండు కళ్ళలోపల అనే పాట లిరిక్స్ ని పోలి ఉండడంతో మరోసారి తమన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ప్రతి సినిమా విషయంలో తమన్ గురించి కాపీ ట్రోల్స్ వచ్చినప్పటికీ ఈయన మాత్రం ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోరనే చెప్పాలి. మరి ఓజి సినిమా విషయంలో కూడా ఇలాంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో తమన్ స్పందన ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తమన్ ఓజీ సినిమాతో పాటు బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ 2 సినిమాకి కూడా సంగీతం అందించారు.
#SuvviSuvviLyrical copycat ? #OG #TheyCalHimOG https://t.co/nri08OWOLy pic.twitter.com/c6RaVi8QM5
— Bharat Media (@bharatmediahub) August 27, 2025
ఇక ఈ రెండు సినిమాలు కూడా ముందుగా సెప్టెంబర్ 25వ తేదీ విడుదల అవుతాయని వెల్లడించారు. కానీ బాలయ్య సినిమా వెనక్కి తగ్గిందని తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా మాత్రం సెప్టెంబర్ 25వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించారు . ఇక ఈ సినిమా కోసం అభిమానులు గత కొంతకాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది దీంతో అభిమానుల ఆశలన్నీ కూడా ఓజీ పైనే ఉన్నాయి.
Also Read: Prakash Raj: ప్రధాని మోడీపై సెటైర్లు పేల్చిన ప్రకాష్ రాజ్.. సిగ్గుపడాల్సిన పనిలేదంటూ!