E-Paper
Advertisement

రూ.200 కోట్లు సాధ్యమేనా..? ‘ప్యారడైజ్’కి అసలు పరీక్ష ఇప్పుడే!

రూ.200 కోట్లు సాధ్యమేనా..? ‘ప్యారడైజ్’కి అసలు పరీక్ష ఇప్పుడే!
Advertisement

The Paradise:న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ప్యారడైజ్’పై రిలీజ్ కి ముందు అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ‘దసరా’ తర్వాత మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ కావడంతో సినిమా మీద హైప్ మామూలుగా లేదు. పైగా నాని లుక్, సినిమాబ్యాక్ డ్రాప్, భారీ యాక్షన్, మేకింగ్.. ఇవన్నీ ట్రైలర్, ప్రమోషన్స్‌తో సినిమాపై అంచనాలను పెంచాయి.

కానీ సినిమా థియేటర్ లోకి వచ్చాక ఆ అంచనాలు అన్నీ తలకిందులు అయిపోయాయి. ప్రీమియర్లు తర్వాత మిక్స్‌డ్ టాక్ గా మొదలైన సినిమా రిలీజ్ రోజు మార్నింగ్ షో కంప్లీట్ అవ్వగానే డివైడ్ టాక్ ని మూటగట్టుకుంది.

Advertisement

రూ.150 కోట్ల టార్గెట్ ని టచ్ చేయడం పక్కా

ముఖ్యంగా సినిమా సెకండాఫ్ తెలిపోయిందంటూ సోషల్ మీడియాలో ఏకిపారేశారు నెటిజన్లు. అయితే నిమా నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈజీగానే మూడు రోజుల్లో రూ.100 కోట్లు దాటేసి.. రూ.120 కోట్ల మార్క్‌కు దగ్గరగా వచ్చేయడం ఇక్కడ విశేషం. చూస్తుంటే ఈ ఊపులోనే సినిమా ఈజీగానే రూ.150 కోట్ల టార్గెట్ ని టచ్ చేయడం పక్కా గానే కనిపిస్తుంది.కానీ ఎటొచ్చి సినిమా రెండొందల కోట్లని కొడుతుందా లేదా అన్న అనుమానాలు ఇపుడు ట్రేడ్ వర్గాల్లో రైజ్ అవుతున్నాయి.

Advertisement

ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్

ఎందుకంటే రూ.150 నుంచి రూ.200 కోట్లకు వెళ్లాలంటే మరో రూ.50 కోట్లు కావాలి. కానీ అక్కడే మ్యాజిక్ జరగాలి.ఎందుకంటే రూ.200 కోట్లు అంటే సినిమా మరికొన్ని రోజులు బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ సౌండ్ చేయాలి. అసలే సినిమాకు నెగెటివ్ టాక్, అలాగే రిలీజ్ కాబోయే సినిమాల నుండి పోటీ,తగ్గుతున్న థియేటర్లు ,వీటితో పాటు నెగెటివ్ టాక్ తో తగ్గిపోనున్న ఆక్యుపెన్సీ, టికెట్ ధరలు, వీకెండ్ తర్వాత కలెక్షన్ల డ్రాప్..ఇవన్నీ కలిస్తే సినిమా ఆ 50 కోట్లని వెనకేస్తుందా లేదా అన్నది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్.

‘ది ప్యారడైజ్’కు అసలు పరీక్ష

మాములుగా ఫ్యాన్స్ లెక్కలలో ఈజీగా “మూడు రోజుల్లో 120 కొట్టినప్పుడు ఇంకో 80 కోట్లు పెద్ద కష్టం కాదు కదా అనిపిస్తుంది.కానీ మొదటి మూడు రోజుల్లో వచ్చినంత వేగంగా వచ్చే రోజుల్లో కలెక్షన్స్ ఉండవన్నది ఇక్కడ గ్రహించాలి.అందుకే ఇప్పుడు ‘ది ప్యారడైజ్’కు అసలు పరీక్ష మొదలైందనే చెప్పాలి.

ఒకవేళ సినిమా సోమవారం నుంచి కూడా టాక్ ని పట్టించుకోకుండా థియేటర్స్ ని అలాగే హోల్డ్ చేసి, ఆక్యుపెన్సీ లు కంటిన్యూ అయితే రూ.200 కోట్ల మాట వినిపించవచ్చు.కానీ అది జరగాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాజిక్ జరగాల్సిందే.పైగా నిన్న జరిగిన ప్రెస్ మీట్ తర్వాత మళ్ళీ ఇంకో మీట్ ఉండకపోవచ్చు అని నాని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇవ్వడం బట్టి చూస్తే సినిమా ఎక్కడో తేడా కొట్టిందని వాళ్లకి కూడా అర్థమై ఉండాలి.

also read :‘ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు’.. కృతి సనన్ షాకింగ్ పోస్ట్

చూడాలి మరి వస్తున్న విమర్శల బాణాలని తట్టుకుని ఈ జడల్ ఎలా నిలబడతాడో !

Tags

Related News

వెంకటేష్ అంటే త్రివిక్రమ్ కు అంత భయమా.. ఎందుకో తెలుసా?

అమ్మ హీరోయినే..కూతురు హీరోయినే..ఇండస్ట్రీలో తల్లీకూతుర్ల హవా!

స్ట్రెచ్ మార్కులు తీపి గుర్తులు.. మాతృత్వం పై నటి ఎమోషనల్ కామెంట్స్!

కీర్తి సురేష్ బోల్డ్ మూవీ ‘డోరతీ’ పై మణిరత్నం రియాక్షన్.. అసూయ పుడుతుందంటూ!

2027 అసలైన పొంగల్ వార్.. లిస్టులో చేరిన రజనీకాంత్!

‘ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు’.. కృతి సనన్ షాకింగ్ పోస్ట్

నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే – నివేదా పేతురాజ్!

Big Stories

Advertisement
×