Upcoming Movies : ప్రతినెల థియేటర్లలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి. ఇంకొన్ని సినిమాలు యావరేజ్ కాకుండా సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగులుతున్నాయి. ఈ ఆగస్టు నెలలో చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. ఈ నెల మొత్తం సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతుండడంతో సెప్టెంబర్ నెలకి కొన్ని సినిమాలు షిఫ్ట్ అయ్యాయి. అందులో సెప్టెంబర్ ఐదున దాదాపు అరడజనుకు పైగా సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాయి. ఆరోజున సినిమాల మధ్య పోటీ గట్టిగా ఉందని తెలుస్తుంది. ఇంతకీ సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం పదండి..
సెప్టెంబర్ 5 న పోటీ పడుతున్న సినిమాలు…
‘మిరాయ్’…
హనుమన్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో తేజ సజ్జ ఇప్పుడు మరో మిరాకిల్ మూవీ తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఆ మూవీ పేరే మిరాయ్.. ఇటీవలే నిర్మాత టిజి విశ్వప్రసాద్ కన్ఫర్మ్ చేయడంతో వాయిదా ప్రచారాలకు చెక్ పడిపోయింది. హనుమాన్ తర్వాత చేసిన మూవీ కావడంతో తేజ సజ్జ మార్కెట్ పెరుగుదల దీని మీదే ఆధారపడి ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ కి అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఇందులో మంచు మనోజ్ మాంత్రికుడుగా నటిస్తున్నాడు. సెప్టెంబర్ 5 న రిలీజ్ కాబోతుంది.
‘ఘాటీ’..
టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఘాటీ.. గిరిజన మహిళగా కనిపించబోతున్న అనుష్క ఈ సినిమాలో సరికొత్తగా కనిపించబోతుంది. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఘాటి గత కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వస్తుంది.. ఎట్టకేలకు సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వచ్చేందుకు డేట్ ని లాక్ చేసుకుంది.
‘ది గర్ల్ ఫ్రెండ్’..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడింగ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ది గర్ల్ ఫ్రెండ్.. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకునే ఈ మూవీ రిలీజ్ డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది..అఫీషియల్ అనౌన్స్ మెంట్ రేపో ఎల్లుండో ఇవ్వొచ్చని టాక్. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో రూపొందిన ఈ లవ్ థ్రిల్లర్ పూర్తిగా రష్మిక ఇమేజ్ మీదే మార్కెట్ అవుతోంది. సెప్టెంబర్ ఐదున ఈ సినిమా వస్తే పోటీ మాత్రం గట్టిగానే ఉంటుంది..
‘మదరాసి’..
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ గత ఎడది అమరం చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు.. ఇప్పుడు మదరాసి అనే ఇంట్రెస్టింగ్ స్టోరీ తో మరో మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ కు అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం మెయిన్ అట్రాక్షన్…
వీటితో పాటుగా బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’కి సురేష్ సంస్థ అండగా నిలుస్తోంది. టీజర్ అయితే విషయం ఉందనే సందేశం ఇచ్చింది. ఇలా అందరూ మూకుమ్మడిగా సెప్టెంబర్ 5నే ఎంచుకోవడం బాగానే ఉంది. ఈ డేట్ నా ఇన్ని సినిమాలు రావడం అంటే మూవీ లవర్స్ కి కాస్త గుడ్ న్యూస్ నే.. మరి ఈ డేట్ నా ఈ సినిమాలు వస్తాయో లేక ఏదైనా సినిమా పోస్ట్ పోన్ అవుతుందేమో చూడాలి..