E-Paper
Advertisement

ది ప్యారడైజ్ నుంచి దుమ్ము రేపుతున్న ‘యేష నాగుల కట్ట మీద’ మాస్ ట్రాక్!

ది ప్యారడైజ్ నుంచి దుమ్ము రేపుతున్న ‘యేష నాగుల కట్ట మీద’ మాస్ ట్రాక్!
Advertisement

The Paradise Second Single: నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా , ప్రముఖ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Sriknath odela) దర్శకత్వంలో రాబోతున్న రెండవ చిత్రం ది ప్యారడైజ్ (The Paradise). సెప్టెంబర్ 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 8 భాషలలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ‘ఆయా షేర్’ అంటూ ఒక పాట విడుదల చేయగా.. అది యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుండి రెండవ పాటను కూడా మేకర్స్ విడుదల చేశారు.

ది ప్యారడైజ్ నుండీ సెకండ్ సాంగ్ రిలీజ్..

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh ravichander) ఆగస్టు 28న అమెరికాలోని డల్లాస్ లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో ఆయన ‘యేష నాగుల కట్టమీద’ అంటూ వచ్చిన మాస్ ట్రాక్ ను లైవ్ లో ప్రత్యక్షంగా ప్రదర్శించారు. అనంతరం ఆగస్టు 28న అన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో అధికారికంగా విడుదల చేశారు. జానపద పాటల నుండి తీసుకున్న ఈ నాటు మాస్ బీట్ ఇప్పుడు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. కాసర్ల శ్యామ్ సాహిత్యం సమకూర్చగా.. జంగి రెడ్డి తమ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. సందీప్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాట నాని, కీర్తి సురేష్ పై చిత్రీకరించారు. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈ మాస్ బీట్ సోషల్ మీడియాలో మరో సంచలనం సృష్టించడం ఖాయం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

అదరగొడుతున్న తెలంగాణ ఫోక్ సాంగ్ ‘యేష నాగుల’..

Advertisement

తెలంగాణ ఫోక్ సాంగ్ ‘యేష నాగుల కట్టమీద’ పాటను లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ మూవీకి తగినట్టుగా మార్పులు చేశారు. మొత్తానికైతే ఒరిజినల్ సింగర్ జంగి రెడ్డి వాయిస్ కి తోడు రామ్ మిర్యాల గాత్రం తోడవడంతో ఎనర్జిటిక్ గా ఈ పాట సాగుతోంది. మొత్తానికైతే ప్యారడైజ్ ఆల్బమ్లో మరో హిట్ పాట యాడ్ అయింది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే అభిమానులను కాస్త నిరాశపరిచిన అంశం ఏమిటంటే.. పాట విడుదల చేశారు కానీ అటు వీడియో కానీ ఇటు లిరిక్స్ కానీ విడుదల చేయకపోవడం గమనార్హం.

also read:ఈసారి ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్!

సెప్టెంబర్ 24న థియేటర్లలోకి..

Advertisement

సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన కయాదు లోహర్ (Kayadu Lohar) హీరోయిన్గా నటిస్తుండగా.. కీర్తి సురేష్ (Keerthy Suresh) స్పెషల్ సాంగ్ లో నర్తించినట్లు సమాచారం. ఇందులో సోనాలి కులకర్ణి , సంపూర్ణేష్ బాబు, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ వంటి ప్రముఖులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 8 భాషలలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు.

దసరాకు మించి హిట్ అవుతుందా?

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన దసరా సినిమా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు అంతకుమించి ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మరి అందుకు తగ్గట్టుగానే దసరా మూవీకి మించి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

 

Related News

నాగార్జున బర్త్ డే స్పెషల్.. ‘కింగ్ 100’ నుండి అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్!

దేవి ‘ఎల్లమ్మ’ కు హీరోయిన్ కష్టాలు.. సినిమా వాయిదా పడ్డట్లే..?

HBD Nagarjuna : బర్త్ డే స్పెషల్.. నాగార్జున ఆస్తులు ఎన్ని కోట్లంటే..?

మహేంద్రగిరి వారాహి ట్రైలర్ రిలీజ్.. సిద్దు జొన్నలగడ్డ స్పెషల్ ఎంట్రీ?

ఇరుముడి హిట్టు వెనుక రవితేజకు ఇంత లాభమా?

చిత్ర పరిశ్రమ అందరిదీ… ఒకరి సొత్తు కాదు.. విమర్శలకు చెక్ పెట్టిన చిరు!

రాఖీ రోజున సర్‌ప్రైజ్.. SKN కి రాఖీ కట్టిన స్టార్ హీరోయిన్!

Big Stories

Advertisement
×