Inzamam-ul-Haq On ENG VS PAK: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ ( Pakistan vs England) మధ్య టెస్ట్ సిరీస్ (Pakistan tour of England 2026) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ పూర్తి కాగా… ప్రస్తుతం లండన్ వేదికగా రెండో మ్యాచ్ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు పాకిస్తాన్ పై ఇంగ్లాండ్ కంప్లీట్ గా ఆధిపత్యం జలా ఇస్తోంది. ఇంగ్లాండ్ ఊపు చూస్తుంటే… పాకిస్తాన్ జట్టును వైట్ వాష్ చేయడం గ్యారంటీ అని అంటున్నారు. అయితే రెండు టెస్టులో మొదటి ఇన్నింగ్స్ ఆడిన పాకిస్తాన్ 110 పరుగులకు కుప్పకూలింది. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా ఇంజమామ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఇంగ్లాండ్ పై గెలవపోతే, పాకిస్తాన్ లో కోడిగుడ్లతో కొట్టడం గ్యారెంటీ అంటూ ఇంజమామ్ ఉల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ ( Pakistan vs England) మధ్య ప్రస్తుతం రెండో టెస్టు జరుగుతున్న నేపథ్యంలో ఇంజమామ్ ఉల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి ఇన్నింగ్స్ లో 110 పరుగులకు పాకిస్తాన్ ఆల్ అవుట్ కావడం తనను హార్ట్ చేసిందని ఫైర్ అయ్యారు. అనవసరంగా బాబర్ ఆజంను కెప్టెన్ చేసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తప్పు చేసిందని మండిపడ్డారు. తన అల్లుడు ఇమామ్ లాంటి వాళ్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రోత్సహించడంలో విఫలమైందని సీరియస్ అయ్యారు. ఇంగ్లాండ్ గడ్డపై ఒక్క మ్యాచ్ అయిన గెలవకపోతే పాకిస్తాన్ ప్లేయర్లకు నరకం చూపిస్తారని అభిమానులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇంగ్లాండ్ గడ్డపై ( England) ఒక మ్యాచ్ గెలవకుండా వస్తే మాత్రం… కోడిగుడ్లతో పాకిస్తాన్ ప్లేయర్లపై దాడులు జరుగుతాయని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పటికైనా బాబర్ ఆజం సేన పుంజుకొని.. ముందుకు సాగాలని రిక్వెస్ట్ చేశారు. అసలు ఏమాత్రం పోటీ ఇచ్చేలా పాకిస్తాన్ క్రికెట్ జట్టు కనిపించడం లేదని విమర్శించారు. ఇంగ్లాండ్ బౌలర్లు వేసే బంతులకు భయపడిపోతున్నారని పరువు తీశారు.
రెండో టెస్టులో పాకిస్తాన్ ఆట తీరును ఉద్దేశించి తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెటర్లు తమ ఆటలు మానేసి… ఇంట్లో కూర్చుంటే బెటర్ అన్నారు. వాళ్లు క్రికెట్ ఆడటం వల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తీవ్ర నష్టం వాటితోందని ఫైర్ అయ్యారు. క్రికెట్ మానేసి ఇంట్లో మూలన కూర్చోవాలని ఎద్దేవా చేశారు. ప్రతి మ్యాచ్ ఓడిపోవడం చూస్తుంటే తనకు అసహ్యం వేస్తోందని నిప్పులు చెరిగారు.