Thaman – CSK : సాధారణంగా క్రికెట్ ని రకరకాలుగా ఆడుతున్నారు. ప్రస్తుతం కేవలం క్రికెటర్లు కాకుండా సినీ సెలబ్రిటీలు సైతం క్రికెట్ ఆడుతుండటం విశేషం. ఇటీవల సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ లీగ్ లో మొత్తం 7 జట్లు పాల్గొన్నాయి. తెలుగు వారియర్స్ ఈ లీగ్ లో ఒక జట్టుగా పోటీ చేసింది. కొన్ని మ్యాచ్ ల్లో తెలుగు వారియర్స్ జట్టు ఓడిపోయింది. కొన్నింటిలో గెలిచింది. చెన్నై రైనోస్ తో జరిగిన మ్యాచ్ లో తెలుగు వారియర్స్ 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే తెలుగు వారియర్స్ తరపున మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఆడటం విశేషం. దీని గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. సీఎస్కేలోకి టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రాబోతున్నట్టు సమాచారం. అందుకే సీసీఎల్ గురించి ప్రస్తావించాల్సి వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కేవలం సంగీతం మాత్రమే కాదు.. క్రికెట్ లో కూడా రాణించనున్నట్టు సమాచారం.
Also Read : IND vs ENG nTest: మొదటి టెస్ట్…టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియాలోకి కొత్త ప్లేయర్
గతంలో తెలుగు వారియర్స్ జట్టుతో ఆడిన సమయంలో అంఫైర్ పై వాగ్వాదానికి కూడా దిగాడు థమన్. ముఖ్యంగా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు థమన్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాలని.. థమన్ సీఎస్కే తరపున ఆడితే దబిడి దిబిడే అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కి ప్రస్తుతం ఎం.ఎస్. ధోనీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. వాస్తవానికి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా ఉండగా.. అతను గాయాల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ కి దూరం కావడంతో ధోనీ కెప్టెన్ గా వ్యవహరించాడు. ధోనీ కెప్టెన్సీలో చైన్నై సూపర్ కింగ్స్ దాదాపు 5 సార్లు టైటిల్ విజయం సాధించడం విశేషం. వాస్తవానికి ఐపీఎల్ ప్రారంభం నుంచి కూడా చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత బలమైన జట్లలో ఒకటిగా నిలిచింది. తొలి సీజన్.. 2008లో ఆ జట్టు ఫైనల్స్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. 2010, 2011 సీజన్ లో ధోనీ సేన టైటిల్ సాధించింది.
2018లో మూడో సారి టైటిల్ గెలుచుకుంది. 2019లో మాత్రం ఫైనల్ లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. 2020 ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ప్లే ఆప్స్ కి చేరుకోలేకపోయింది. 2021లో అద్భుతంగా ఆడి నాలుగోసారి టైటిల్ సాధిస్తే.. 2023లో మరోసారి ఛాంపియన్ గా నిలిచింది. 2025లో పేలవ ప్రదర్శన కనబరిచింది. పాయింట్ల పట్టికలోనే చిట్టచివరి జట్టుగా నిలవడం గమనార్హం. ధోనీ తరువాత చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ సీజన్ లో ఆయూష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, నూర్ అహ్మద్ లు చెన్నై తరపున అద్భుతంగా రాణించడం విశేషం. చెన్నై మ్యాచ్ లు ఓడినప్పటికీ ఈ ముగ్గురు ఆటగాళ్లు మాత్రం అభిమానుల మనస్సు దోచుకోవడం విశేషం. చెన్నై సూపర్ కింగ్స్ వీరిని అలాగే కొనసాగిస్తే.. వచ్చే సీజన్ లో అద్భుతమైన ఫలితాలు వస్తాయని అభిమానులు చెబుతున్నారు.
?igsh=dmV4OHF1b2lvYWQ0