Kishkindhapuri : కొన్నిసార్లు పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్ లో కూర్చున్నప్పుడు ఆడియన్స్ చాలా సందర్భాల్లో డిసప్పాయింట్ అవుతాడు. రీసెంట్ టైమ్స్ లో మాత్రం పర్ఫామెన్స్ కథ అన్ని విషయాలు పక్కనపెడితే, టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది.
ఇప్పుడు విఎఫ్ఎక్స్ పైన సినిమాలు విషయంలో ఎక్కువ కంప్లైంట్స్ వస్తుంటాయి. కొన్ని సినిమాలకు సంబంధించి టీజర్ ట్రైలర్ విడుదలైనప్పుడు విఎఫ్ఎక్స్ బాగున్నాయి అంటే ఖచ్చితంగా ఆడియన్స్ థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలి అని ఫిక్స్ అవుతాడు. థియేటర్ కి వెళ్లిన తర్వాత కూడా ఆ సినిమా ఆడియన్ను సాటిస్ఫై చేస్తే ఖచ్చితంగా సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఆ సినిమాకు బీభత్సమైన ఎలివేషన్ ఇస్తారు.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు అనే సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేసినప్పుడు అందరికీ ఒక హైప్ క్రియేట్ అయింది. తర్వాత కొన్ని రోజుల్లో ఆ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకుంటున్నాడు అని చెప్పినప్పుడు సినిమా మీద అంచనాలు అమాంతం తగ్గిపోయాయి. ఎప్పుడో రిలీజ్ కావలసిన సినిమా దాదాపు 5 సంవత్సరాలు పాటు సెట్స్ పైనే నడిచింది. ఒకవైపు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా లేటుకు కారణం.
ఈ సినిమా విషయంలో విపరీతమైన కంప్లైంట్స్ వచ్చింది విఎఫ్ఎక్స్. చాలామంది ఈ సినిమాను సోషల్ మీడియాలో పెట్టి మరి ట్రోల్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాను కూడా ఇలా ట్రోల్ చేస్తారు అని ఎవరు ఊహించి ఉండరు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు రియాల్టీకి దగ్గరగా ఉండేవి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు సినిమాలు మీద ఉన్న దృష్టి తగ్గిపోయింది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కౌశిక్ దర్శకత్వంలో నటించిన సినిమా కిష్కిందపురి. ఈ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ తరుణంలో ఈ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ కూడా చాలామందిని విపరీతంగా ఆకట్టుకున్నాయి, దీనిని పట్టుకొని కొంతమంది సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ మొదలుపెట్టారు.
బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో కూడా విఎఫ్ఎక్స్ బాగున్నాయి. హరిహర వీరమల్లు విఎఫ్ఎక్స్ ఏంట్రా అంత నీచంగా తయారయ్యాయి అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమాతో పోలిస్తే విఎఫ్ఎక్స్ విషయంలో ఈ సినిమా చాలా బెటర్ అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Big producer : తన బ్యానర్ లో సినిమాలు చేయమని రాయబారాలు పంపుతున్న బడా నిర్మాత