OTT Movie : రొమాంటిక్ మ్యూజికల్ లవర్స్ ‘సైయారా’ సినిమాను తెగ చూస్తున్నారు. ఈ బాలీవుడ్ సినిమా 2025లో హయ్యెస్ట్-గ్రాసింగ్ ఇండియన్ రొమాంటిక్ ఫిల్మ్‌గా నిలిచింది. ఇది 50 కోట్ల బడ్జెట్‌తో 577 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో ఉన్న ఏడు పాటలను వింటూ ఆడియన్స్ కేరింతలు కొడుతున్నారు. ఈ కథ ఒక ప్రేమజంట చుట్టూ తిరుగుతుంది. ప్రియురాలు గతం మరచిపోవడంతో అసలు స్టోరీ మొదలవుతుంది. ఈ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
వాణి బాత్రా ఒక యువ కవయిత్రి. తన ప్రియుడు మహేష్ రిజిస్టర్ మ్యారేజ్‌కు ముందు ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు. దీంతో ఆమె చాలా డిప్రెషన్ లోకి వెళ్తుంది. ఆరు నెలల తర్వాత ఆమె జర్నలిస్ట్‌గా కొత్త జాబ్‌లో చేరుతుంది. అక్కడ ఆమె అప్పుల్లో కూరుకుపోయిన కృష్ కపూర్ అనే మ్యూజిషియన్‌ను కలుస్తుంది. కృష్, వాణి కవిత్వానికి ముచ్చటపడి, ఆమెను తన సాంగ్స్‌కు లిరిక్స్ రాయమని ఒప్పిస్తాడు. వారు కలిసి మ్యూజిక్ క్రియేట్ చేస్తూ, ఒకరి ఎమోషనల్ స్కార్స్‌ను ఒకరు హీల్ చేసుకుంటూ ప్రేమలో పడతారు. అయితే ఇంతలో వాణి ఆల్జీమర్స్ తో గతాన్ని మరచిపోతుంది. ఇది వారి జీవితాన్ని తలకిందులు చేస్తుంది.
ఆమె మెమరీ ఫేడ్ అవ్వడంతో కృష్ తన కెరీర్, లవ్ మధ్య ఇబ్బందులు పడతాడు. ఈ కథ ఒక ఎమోషనల్ డెప్త్ కి వెళ్తుంది. ఇక వాణి ఆల్జీమర్స్ కూడా తీవ్రమవుతుంది. ఆమె కృష్‌ను కొన్నిసార్లు మహేష్‌గా తప్పుగా గుర్తిస్తుంది. ఇది కృష్‌కు మరింత బాధాకరమవుతుంది. ఒక కాన్సర్ట్‌లో, మహేష్ వాణి బలహీనతను దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ కృష్ ఆమెను రక్షిస్తాడు. వీళ్ళు కలిసి “సైయారా” అనే సాంగ్‌ను కంపోజ్ చేస్తారు. అయితే వాణి అప్పటి నుంచి అదృశ్యమవుతుంది. కృష్ కెరీర్‌ను ఆమె అడ్డుకోకూడదని మనాలిలోని ఒక ఆశ్రమంలో ఉంటుంది.
ఈ సమయంలో కృష్ “సైయారా” సాంగ్‌ను రిలీజ్ చేస్తాడు. అది గ్లోబల్ హిట్ అవుతుంది. అతన్ని స్టార్‌గా నిలబెడుతుంది. చివరిలో కృష్ మనాలిలో వాణి ఉందని తెలుసుకుంటాడు. ఇక క్లైమాక్స్ లో వీళ్ళిద్దరూ కలుస్తారా ? వాణికి మతి మరుపు పూర్తిగా వస్తుందా ? వీళ్ళ ప్రేమకి శుభం కార్డు పడుతుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
‘సైయారా’ (Saiyaara) మోహిత్ సూరి దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన హిందీ మ్యూజికల్ రొమాంటిక్ చిత్రం. ఇది దక్షిణ కొరియా చిత్రం ‘ఎ మోమెంట్ టు రిమెంబర్’ ఆధారంగా రూపొందింది. ఇందులో అహాన్ పాండే (కృష్ కపూర్) అనీత్ పడ్డా (వాణి బాత్రా) లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమా 2025 జూలై 18న థియేటర్లలో విడుదలై, సెప్టెంబర్ 12 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 2 గంటల 36 నిమిషాల రన్‌టైమ్ ఉన్నఈ సినిమా IMDbలో 6.4/10 రేటింగ్ పొందింది.
Read Also : మర్డర్ కేసులో ఇరుక్కునే మెంటలోడు… ఆ తల్లి చేసే అడ్వెంచర్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే మావా