E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి మాటతో కమల్ ఫిదా.. అడ్డంగా బుక్కయిన అవని.. హైలెట్ ట్విస్ట్ ఇదే..

Intinti Ramayanam Today Episode: పల్లవి మాటతో కమల్ ఫిదా.. అడ్డంగా బుక్కయిన అవని.. హైలెట్ ట్విస్ట్ ఇదే..
Advertisement

Gundeninda GudiGantalu Today episode August 20th : ఇంట్లోని వాళ్ళందరూ రోహిణి సపోర్ట్ చేస్తూ మాట్లాడితే రోహిణి మాత్రం అత్తయ్య చేసింది కరెక్టే అని అంటుంది. అత్తయ్య నా కోసమే ఇలా చేసింది కదా మీరు ఎందుకు ఇంతగా బాధపడిపోతున్నారు అని రోహిణి అనగానే బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అటు మీనా కూడా షాక్ లో ఉండిపోతుంది.. మిగిలిన వాళ్ళందరూ కూడా నీకు సపోర్ట్ గా మాట్లాడితే నువ్వు మాత్రం ఎందుకిలా మాట్లాడుతున్నావు అని అడుగుతారు. కానీ రోహిణి మాత్రం అత్తయ్య చేసిందే కరెక్టు అని ఎంత చెప్పినా కూడా అదే మాట పట్టుకొని ఉంటుంది.. ఇక ప్రభావతి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.. మనోజు షోరూం కి వెళ్లి ఈగలు తోలుకుంటూ కూర్చుంటాడు అది చూసిన మనికంట సెటైర్లు వేస్తాడు.

రోహిణికి దిమ్మతిరిగే షాక్..

షోరూం కి రోహిణి రావడంతో మనోజ్ఒక్కసారిగా షాక్ అవుతాడు.. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మా అమ్మ గనుక చూస్తే చంపేస్తుంది అని అంటాడు. కానీ రోహిణి మాత్రం నీకోసమే వచ్చాను మనోజ్ అని ఎంత చెప్తున్నా సరే మనోజ్ మాత్రం అస్సలు వినకుండా తనని పంపించాలని అనుకుంటాడు. అయితే రోహిణి మాత్రం తనతో మనోజ్ మాట్లాడేంతవరకు అక్కడి నుంచి వెళ్ళకూడదు అని ఫిక్స్ అవుతుంది… మనోజ్ కి ఒక పెద్ద ఆర్డర్ రావడంతో అతను తీసుకున్న మెటీరియల్ ని మలేషియాకి ఎక్స్పోర్ట్ చేయాలి అని చెప్పగానే ఆర్డర్ ని క్యాన్సల్ చేస్తాడు. మలేషి అన్న పదం నాకు అస్సలు వినిపించకూడదు అని అందుకే ఆర్డర్ ని క్యాన్సిల్ చేస్తున్నానని అతను అంటాడు. నాకు ఒక ఫ్రాడ్ వైఫ్ ఉంది తను మలేషియా అని అబద్ధం చెప్పి నన్ను మోసం చేసింది అని రోహిణి బాధపెట్టేలా అంటాడు మనోజ్. ఆ మాట వినగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది..

రోహిణికి ఘోర అవమానం..

Advertisement

రోహిణి షాప్ లో ఉండడానికి వీల్లేదు అని మనోజ్ అంటాడు. తనని ఎలాగైనా సరే అక్కడి నుంచి పంపించాలనే చూడడంతో ఎందుకు మనోజ్ నా మీద ఉన్న ప్రేమ అబద్ధమా నీకు అని అంటుంది. రోహిణి ఎంతగా మనోజ్ కోసం ఆరాటపడుతున్న సరే అతను మాత్రం అస్సలు వినకుండా తనని బాధపెట్టేలా మాట్లాడుతూనే ఉంటాడు.. ఎలాగైనా సరే మనోజ్ తో మాట్లాడి తీరాల్సిందే అని రోహిణి అనుకుంటుంది. మా అమ్మ నిన్ను ఇక్కడ చూస్తే నన్ను తప్పుగా అనుకుంటుంది నువ్వు ఇక నుంచి వెళ్ళిపో అని చెప్తాడు.. నువ్వు ఏం చేసినా నేను తప్పుగా అనుకోలేదు అంటే నీ మీద ప్రేమతోనే కానీ నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని అసలు ఊహించలేదని మనోజ్ చాలా బాధపడిపోతాడు. ఆ తర్వాత రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

సుమతి గ్రీన్ సిగ్నల్..

సుమతి అరుణ్ దగ్గరికి వచ్చి తనతో మాట్లాడాలి అని అనుకుంటుంది.. అయితే అరుణ్ మాత్రం సుమతిని చూసి బాబాయ్ నా డ్యూటీ అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను అని అనగానే.. అక్కడున్న మరో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓ ఎవ్వరు ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు. ప్రేమ అంటుంది కానీ నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి అని అంటుంది కానీ, తను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది అని చాలా బాధపడిపోతుంటాడు అరుణ్. నువ్వేమీ బాధపడొద్దు అరుణ్ కష్టపడి ఉద్యోగాన్ని తెచ్చుకున్నావ్ కదా కాస్త కష్టపడువు. నీ పెళ్లి కూడా సెటిల్ అయిపోతుంది అని చెప్పగానే.. అలాగే బాబాయ్ మీరు ఎలా అంటే అలానే చేస్తాను అని అరుణ్ సంతోషంగా సుమతిని కలవడానికి వెళ్తాడు. సుమతి వాళ్ళ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పినట్లు చెప్తుంది.. మన ప్రేమ విషయం మా ఇంట్లో తెలిసిపోయింది ఏం చెప్తారో చూడాలి అని సుమతి అంటుంది.

బాలు మీనా సరసాలు..

Advertisement

రాత్రి పడుకునే సమయంలో మీనా బాలు కోసమని పాలు తీసుకుని వస్తుంది. రోహిణి మనోజ్ లు ఎందుకు దూరంగా ఉంటున్నారో అర్థం కావడం లేదు అని మీనా అంటుంది. ఇక మధ్యలో మా అమ్మ ఉండగా వాళ్ళిద్దరూ కలవర్లే అని బాలు అంటాడు.. అంతే కాదు.. ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని కలిపితే బాగుంటుంది అని మీనా అంటుంది. ఆ విషయం ఒకసారి మనం మాట్లాడుకొని ఆ తర్వాత వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేద్దామని బాలు. ఇక అప్పుడే తన చిన్ననాటి ఫ్రెండ్ ని గుర్తు చేసుకుంటాడు. బాలు అప్పుడే అతను ఫోన్ చేయడంతో వీళ్ళిద్దరి స్నేహం చాలా గొప్పది అని మీనా అనుకుంటుంది.. అతని ఎక్కడున్నావ్ రా ఏం చేస్తున్నావ్ రా అంటే మొన్ననే జైలు నుంచి రిలీజ్ చేయొచ్చానురా అని అనగానే మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక తర్వాత బాలు మీనా ఇద్దరు కలిసి పాలు పంచుకోవడం ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : శైలు మాటతో కన్నీళ్లు.. కేశవను కొట్టిన మాధవ్.. నారాయణను కొట్టిన దుర్గ..

Related News

Karthika Deepam 2 Serial Today Episode August 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపే సుమిత్ర కూతురన్న నిజం చెప్తానన్న జ్యోత్స్న       

Podarillu Today Episode : శైలు మాటతో కన్నీళ్లు.. కేశవను కొట్టిన మాధవ్.. నారాయణను కొట్టిన దుర్గ..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో ప్రేమ ఫీల్.. ధీరజ్, ప్రేమ ఒక్కటవుతారా..?

Brahmamudi Serial Today Episode August 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు వార్నింగ్ ఇచ్చిన రేఖ      

Intinti Ramayanam Today Episode: పల్లవి మాటతో కమల్ ఫిదా.. అడ్డంగా బుక్కయిన అవని.. హైలెట్ ట్విస్ట్ ఇదే..

Thursday Movies in Tv : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్..

ఈశ్వర్ సాయితో ఫోక్ సాంగ్స్.. మాధురి చెప్పిన ఆ విషయాలు మళ్లీ వైరల్!

Big Stories

Advertisement
×