E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Theater Releases : ఈ వారం బాక్సాఫీస్ వార్ తప్పదా..? పోటీ మాములుగా లేదు..

Theater Releases : ఈ వారం బాక్సాఫీస్ వార్ తప్పదా..? పోటీ మాములుగా లేదు..
Advertisement

Theater Releases : ప్రతి నెల టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి.. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో సినిమాల సందడి కాస్త తగినట్లు అనిపిస్తుంది.. జూన్ నెలలో రిలీజ్ అయిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు.. పెద్ది, మా ఇంటి బంగారం సినిమాలు తప్ప మిగిలిన సినిమాలు అంతగా బాక్సాఫీస్ వద్ద టాక్ ని సొంతం చేసుకోలేకపోయాయి.. అయితే జూలై నెలలో స్టార్ హీరోల సినిమాలు చాలావరకు రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నాయి.. మరి ఈ జూలై మొదటి వారం థియేటర్లలోకి ఏఏ సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

జూలై మొదటి వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు..

రావు బహదూర్..

టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రావు బహదూర్.. కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేశ్ మహా తెరకెక్కించిన సైకలాజికల్ ఎమోషనల్ డ్రామా చిత్రం ఇది.. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు బయటకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ముఖ్యంగా సత్యదేవ్ గెటప్ మాత్రం అంచనాలను పెంచేస్తుంది. ఇక దీప థామస్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో A+S మూవీస్, శ్రీచక్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈనెల జూలై 3న మూవీ థియేటర్లలోకి రాబోతుంది..

నాగబంధం..

Advertisement

యంగ్ హీరో విరాట్ కర్ణా హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం నాగబంధం.. అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యాన్ ఇండియా యాక్షన్ మైథాలజికల్ మూవీ. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కూడా సినిమా పై హైప్ ను క్రియేట్ చేస్తున్నారు.. ఈవారం బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా పోటీ పడబోతుంది.. జులై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

ఆల్ఫా..

యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో రూపొందిన తొలి మహిళా ప్రధాన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఆల్ఫా.. ఆలియా భట్, శర్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం హిందీతో పాటుగా తెలుగు, తమిళ భాషల్లో జూలై 3న థియేటర్లలోకి రానుంది..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: చింటూ కోసం వేషం మార్చుకున్న రోహిణి.. బాలుకు అనుమానం.. అయ్యో శృతి..

వీటితో పాటుగా బాలీవుడ్ ప్రముఖ నటి హుమా ఖురేషి నటించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘బేబీ డూ డై డూ’.. ఇది కూడా జూలై 3న థియేటర్లలో రిలీజ్ అవుతుంది.. మొత్తానికి జూలై మొదటివారం బాక్సాఫీస్ వద్ద యాక్షన్, మైథలాజికల్, సైకలాజికల్ డ్రామా, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు పోటీ పడుతున్నాయి.. మరి ఈ సినిమాలలో ఏ సినిమా బాక్సాఫీస్ విన్నర్ గా నిలుస్తుందో చూడాలి.. గత వారంతో పోలిస్తే ఈ వారం ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలే ఎక్కువగా వస్తున్నాయని తెలుస్తుంది.. థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలతో పాటుగా  అటు ఓటీటీలో కూడా చాలా సినిమాలు రాబోతున్నాయి.

Related News

సీఎం విజయ్ జననాయగన్ కు తప్పని తిప్పలు.. మళ్లీ సెన్సార్ షాక్!

రామాయణ టీమ్ కి భారీ షాక్.. 11 సెకండ్ల వీడియో లీక్!

Hero Nani : హీరో నాని చేతికి గాయాలు.. షాక్ లో ఫ్యాన్స్.. అసలేం జరిగిందంటే..?

కనులపండుగగా మెహర్ రమేష్ కుమార్తె వివాహ రిసెప్షన్.. తరలివచ్చిన టాలీవుడ్ అగ్ర తారలు!

పద్మశ్రీ అందుకున్న తొలి కమెడియన్.. రేలంగి వెనుక ఉన్న ఈ కన్నీటి గాథ తెలుసా?

బ్రేకప్ అయ్యిందా? అయితే .. పార్టీ చేసుకోండి …అంటున్న హాలీవుడ్ బ్యూటీ

టైమ్ కన్నా ముందే వారణాసి ప్యాకప్..జక్కన్న స్పీడ్ మాములుగా లేదుగా

Big Stories

×