E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: చింటూ కోసం వేషం మార్చుకున్న రోహిణి.. బాలుకు అనుమానం.. అయ్యో శృతి..

Gundeninda GudiGantalu Today episode: చింటూ కోసం వేషం మార్చుకున్న రోహిణి.. బాలుకు అనుమానం.. అయ్యో శృతి..
Advertisement

Gundeninda GudiGantalu Today episode july 2nd : ఉదయం లేవగానే మీనా ఏం వంట చేశావు అని బాలు హడావిడిగా వచ్చి అడుగుతాడు.. గారెలు ఇడ్లీ చికెన్ చట్నీ సాంబార్ అన్ని ఉన్నాయి అని మీనా అనగానే చెప్తుంటేనే నోరూరిపోతుంది.. ఇక తింటే ఎలా ఉంటుందో అని బాలు సత్యం ఇద్దరూ కూడా తినడానికి కూర్చుంటారు… అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి నేను డైట్ లో ఉన్నాను నాకు ఇలాంటి నూనె వస్తువులు పెట్టి నన్ను ఇది చెయ్యొద్దు.. నుంచి నాకు ఇడ్లీనే కావాలి అని ప్రభావతి కూర్చుంటుంది.. అయితే మీరు తినకపోతే మిగిలిన వాళ్ళందరూ తింటారని మీనా అనగానే అందరూ గారెల్ని లొట్టలు వేసుకుంటూ తింటారు.. ఆ తర్వాత అందరూ వెళ్లిపోయిన తర్వాత ప్రభావతి అక్కడికి వచ్చి దొంగలాగా గారెలు చికెన్ వేసుకుని తింటుంది.. ఇక బయటికి వచ్చి ఏమీ తెలియనట్టు కూర్చోవడంతో బాలు దొంగగా తినే వాళ్ళకి మోషన్స్ అవుతాయి అది ఇది అనడంతో ప్రభావతి షాక్ అవుతుంది. నేను ఇక మీద నుంచి డైట్ ఫాలో అవుతాను నన్ను ఎవరు ఇబ్బంది పెట్టద్దు అని ప్రభావతి అనగానే అందరూ కూడా కాస్త నవ్వుకుంటారు.. ఇక మనోజ్ కి చింటూ దగ్గరవడం చూసిన సుగుణమ్మ వీళ్లిద్దరూ కలిసిపోవాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడేమో అని ఆలోచిస్తుంది..

సుగుణమ్మ పై బాలు అనుమానం..

మనోజ్ కారులోంచి సుగుణమ్మ అలాగే చింటూ దిగడం చూసి బాలు మీనా షాక్ అవుతారు.. వాళ్ళిద్దరూ వీడి కారు ఎందుకు ఎక్కారు అని ఆలోచిస్తూ ఉంటారు.. అయితే చింటూని చూసి బాలు మీనా చాలా హ్యాపీగా ఉంటారు.. చింటూ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా మాట్లాడుతుంటారు. అయితే చింటూ కి కన్నతండ్రి లాగా మనోజ్ వచ్చాడేమో అని బాలు మీనా ఇద్దరు మనోజ్ పై అనుమాన పడతారు.. ఇక సుగుణమ్మ పొంతన లేకుండా సమాధానం చెప్పడంతో బాలు మీనాలకి ఆమెపై అనుమానం కూడా మొదలవుతుంది..

వేషం మార్చుకున్న రోహిణి..

Advertisement

ఇవాళ చింటూ కి పేరెంట్స్ మీటింగ్ ఉంది కదా నేను అక్కడ అటెండ్ అవ్వాలి అని కచ్చితంగా చెప్పారు.. విదేశాల్లో ఉన్న సరే వీడియో కాల్ అయినా చేసే మాట్లాడాలి అని వాళ్ళు కచ్చితంగా చెప్పడంతో నేను ఇలా మారిపోయాను అని అనుకుంటుంది.. చింటూ కోసం గెటప్ మార్చుకున్న రోహిణి చూసి విద్య ఒక్కసారిగా షాక్ అవుతుంది.. సడన్ గా ఈ వేషం ఏంటి జుట్టు ఇలా ఉందేంటి అని రోహిణిణి అడుగుతుంది.. చింటూ కోసమే ఇదంతా చేశాను అని రోహిణి విద్యతో నిజం చెప్పేస్తుంది.. రోహిణిని ఆ గెటప్ లో చూసి విద్య ఒక్కసారిగా నవ్వుకుంటుంది.. మొత్తానికి రోహిణి రోహిణిగా కాకుండా వేషం మార్చుకొని చింటూ తల్లిలాగా వీడియో కాల్ మాట్లాడుతుంది.. మొత్తానికి రోహిణి ప్లాన్ అయితే సక్సెస్ అయిపోతుంది.. చింటూ బాధపడకూడదని నేను ఇదంతా చేస్తున్నానని రోహిణి అంటుంది. ఇక అన్ని మార్చావు సరే గొంతు మార్చాలి కదా ఏం చేస్తావని అడుగుతుంది విద్య.. బాడీ నాదైతే గొంతు మీద అవ్వాలి అని రోహిణి కండిషన్ పెడుతుంది.. మొత్తానికి రోహిణి విద్య ఇద్దరు కలిసి వీడియో కాల్ మాట్లాడేందుకు సిద్ధపడతారు..

రోహిణి సేఫ్..

రోహిణి స్కూల్లో వీడియో కాల్ మాట్లాడడంతో అక్కడున్న సత్యం వాళ్ళ అమ్మని చూడాలని అనుకుంటాడు.. కాని ఆమె మాస్క్ పెట్టుకుని వీడియో కాల్ మాట్లాడడంతో సత్యం ఆమెని సరిగ్గా చూడలేక పోతాడు.. సత్యం ఉండడం చూసిన సుగుణమ్మ రోహిణి ఎక్కడ దొరికిపోతుందో అని కంగారుపడుతుంది.. కానీ రోహిణి వేషం మార్చుకోవడం చూసిన ఆమె కాస్త ఊపిరి పీల్చుకుంటుంది.. మొత్తానికి ఎవరికీ అనుమానం రాకుండా రోహిణి చింటూ కి తల్లిగా స్కూల్లో వీడియో కాల్ మాట్లాడుతుంది.. రోహిణి అనుకున్న ప్లాన్ అయితే ప్రస్తుతానికి సక్సెస్ అవుతుంది.. స్కూల్లో మీటింగ్ అవ్వగానే సుగుణమ్మ చింటూని తీసుకొని బయటికి వస్తుంది..

సత్యం మాటతో రోహిణి షాక్..

Advertisement

స్కూల్ నుంచి బయటికి వచ్చే ముందు అక్కడ బాలు వాళ్ళు ఉండడం చూసి.. చింటూ వాళ్ళకి తన తల్లి గురించి నిజం చెప్తాడు.. బాలు మీనాకు ఆమె ఎవరు అని అనుమానం మొదలవుతుంది.. ఇక ప్రభావతిని చూసుకోకుండా గుద్దేసినా శృతి నాలుగు రౌండ్లు గిర్రును తిరిగి కింద పడుతుంది.. మిమ్మల్ని గుద్దుకున్నందుకు నేనే కింద పడ్డాను అని అనడంతో ప్రభావతి నేను డైట్ చేస్తున్నాను త్వరలోనే తగ్గిపోతాను అని అంటుంది.. అప్పుడే ఇంటికి వచ్చిన సత్యం చింటూ వాళ్ళ అమ్మ గురించి ఇంట్లో వాళ్లకి చెప్తాడు.. అయితే ఆమె మాస్క్ పెట్టుకోవడం ఏంటి అని అందరూ అనుమానపడతారు.. మనోజ్ మాత్రం ఆమెకు సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో మీనా బాలుకి మనోజే చింటూ తండ్రి అని అనుమానం మొదలవుతుంది.. అది నిజమో కాదో నేను కనిపెడతాను అని బాలు అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లు రోహిణి బండారం బయటపడుతుందేమో చూడాలి…

Also Read :Podarillu Today Episode : మహాకు అడ్డంగా దొరికిన కేశవ..హారిక మాటతో మహా షాక్.. చక్రీ, మహా విడాకులు..?

Related News

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

బ్లాక్ శారీలో తారక్ సిస్టర్ .. ఇంత స్టైలిష్‌గా ఉందేంటి బాబోయ్!

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈశ్వర్ సాయి…వివాదాలకు గుడ్‌బై చెప్పినట్టేనా?

Big Stories

Advertisement
×