E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

EPF 2026 New Rules: కొత్త ప్రావిడెంట్ ఫండ్ నిబంధనల్లో ఊహించని మార్పులు.. ఇక ఆ బాధలు ఉండవు!

EPF 2026 New Rules: కొత్త ప్రావిడెంట్ ఫండ్ నిబంధనల్లో ఊహించని మార్పులు.. ఇక ఆ బాధలు ఉండవు!
Advertisement

EPF 2026 New Rules: ఈపీఎఫ్ కొత్త రూల్స్ వచ్చేశాయి. వెబ్‌సైట్‌లో భారీ మార్పులు చేస్తోంది. కొత్తగా తెచ్చిన రూల్స్ ఉద్యోగులకు ఉపయోగమా? కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇంతకీ ఆ రూల్స్ వివరాలేంటి? ఒక్కసారి పూర్తి వివరాల్లోకి వెళ్లొద్దాం.

కొత్త ప్రావిడెంట్ ఫండ్ నిబంధనల్లో ఊహించని మార్పులు

Advertisement

ప్రావిడెంట్ ఫండ్ తీసుకునేందుకు అవకాశాలు కల్పించడంతో లక్షలాది మంది తమ ఖాతాల నుంచి నగదు తీసుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన కేంద్రం, కొత్త రూల్స్ తీసుకొచ్చింది. గతంలో మాదిరిగా ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్‌ నుంచి డబ్బు తీసుకోవడం అంత ఈజీ కాదు. ఏడాదికి కేవలం రెండుసార్లు మాత్రమే తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మొత్తం బ్యాలెన్స్‌లో కనీసం 25 శాతం అకౌంట్‌లో ఉంచాలి.

రిటైర్‌మెంట్ సమయంలో ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సామాజిక భద్రతా నియమావళి-2020 అమలులో భాగంగా దశాబ్దాల నాటి ఈపీఎఫ్ పథకం స్థానంలో ఈపీఎఫ్-2026ను కేంద్రం నోటిఫై చేసింది. ఈ మార్పులు జూలై నుంచి అమల్లోకి వచ్చాయి. గతంలో పీఎఫ్ నుంచి ఎన్నిసార్లు నగదు తీసుకునే అవకాశం ఉండేది.

Advertisement

ఆ విషయాల్లో కాస్త ఉద్యోగులకు ఊరట 

విద్య, ఇంటి నిర్మాణం, పిల్లల పెళ్లి, అనారోగ్యం రకరకాల కారణాలతో నగదు తీసుకునేవారు. ఫలితంగా ఉద్యోగుల అకౌంట్లు ఖాళీ అయ్యాయి. చాలా మందికి రిటైర్‌మెంట్ సమయానికి పీఎఫ్ మనీ ఉండట్లేదు. ఇది కరెక్ట్ కాదు అనుకున్న కేంద్రం.. కొత్త రూల్స్ తెచ్చింది. ఇది ఉద్యోగులకే మేలు చేస్తుంది అంటోంది.

పీఎఫ్ విత్ డ్రాలో కొత్త మార్పులను గమనిస్తే ఏడాదికి రెండుసార్లు నగదు తీసుకోవచ్చు. అందుకు కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. అనారోగ్యం అయినప్పటికీ రెండు సార్లు అనుమతిస్తారు. ఇంటి నిర్మాణం, పిల్లల విద్య పేరుతో అదనంగా తీసుకునే వీలుంది. సర్వీస్ పీరియడ్‌ని లెక్కలోకి తీసుకుని, ఎన్నేళ్లుగా పీఎఫ్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు? విత్ డ్రా ఎంత చేసుకోవచ్చు అనేది వివరాలు చెబుతారు అధికారులు.

కనీసం 25 శాతం బ్యాలెన్స్ కచ్చితంగా ఉండాలి. కొత్త కండీషన్ చాలామంది ఉద్యోగులకు ఇబ్బందే. చాలామంది పీఎఫ్ నుంచి నగదు ఉపసంహరించి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, బంగారం, వెండి ఈటీఎఫ్‌లలో పెట్టుబడిగా పెడుతున్నారు. పీఎఫ్ కంటే మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడి ఎక్కువగా వస్తుందనే అంచనాల్లో ఉన్నారు.

ALSO READ: మళ్లీ పడిపోతున్న పసిడి రేట్లు.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్!

ఉద్యోగి వాటా-యజమాని వాటా-వడ్డీ కలిపి మొత్తం బ్యాలెన్స్‌లో 25 శాతం అకౌంట్‌లో ఉంచాలనే కండీషన్ తెచ్చింది కేంద్రం. ఉద్యోగం పోతే అప్పుడు పరిస్థితి ఏంటనే దానిపై ఓ కండీషన్ పెట్టింది. ఒక నెల నిరుద్యోగం తర్వాత 75 శాతం నగదు తీసుకోవచ్చు. మరో ఏడాది కూడా నిరుద్యోగి‌గా ఉంటే మిగిలిన 25 శాతం తీసుకోవచ్చు.

12 నెలల సర్వీసు తర్వాత ఉపసంహరణలకు అర్హత ఉంటుంది. కొత్త మార్పులు జులై 3 అనగా శుక్రవారం నుంచి వైబ్ సైట్ కూడా అందుబాటులోకి రానుంది. అది వచ్చాక నామినీ పేరు అప్‌డేట్ చేసుకోవాలి. కేంద్రం నిర్ణయం వల్ల సేవింగ్స్ పెరుగుతాయని భావిస్తోంది. PF విత్ డ్రా కోసం UPI, ATM సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. పీఎఫ్ చాలావరకు డిజిటల్ పద్దతి చేసింది. ఈసారి మనీ తీసుకోవడం తేలికవుతుంది.

విత్‌డ్రా ఎలా చేసుకోవాలి అనేది మీ సందేహం. ముందుగా EPFO పోర్టల్ (unifiedportal-mem.epfindia.gov.in), UMANG యాప్‌లో లాగిన్ కావాలి. ఆ తర్వాత KYC అప్‌డేట్ చేయండి. ఆధార్, బ్యాంక్ వివరాలు సమర్పించాలి. Composite Claim Form ద్వారా విత్ డ్రాల కోసం అప్లై చేయాలి. సమస్యలు ఉంటే సమీప EPFO ఆఫీసు, హెల్ప్‌లైన్ నంబర్‌ ద్వారా సంప్రదించవచ్చు. జులై 3 నుంచి ఈ సేవలు సాధారణం కానున్నాయి.

Related News

వామ్మో.. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, వెండి.. నేటి లేటెస్ట్ రేట్లు ఇవే!

మళ్లీ పడిపోతున్న పసిడి రేట్లు.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్!

Senior Citizen Savings Scheme: సీనియర్ సిటిజన్ పొదుపు పథకం.. నేటి నుంచి కొత్త రూల్స్, 5 నిబంధనలివే

చిన్న మొత్తాల పొదుపు పథకాలు.. వడ్డీ రేట్లు మారనున్నాయి? తస్మాత్ జాగ్రత్త ఈ పని చేయకుంటే మీకే నష్టం!

Time Deposit Vs Fixed Deposit: పోస్టాఫీస్ డిపాజిట్ vs బ్యాంక్ ఎఫ్‌డీ.. ఈ రెండింటిలో ఏది బెటర్,

వారెవ్వా పసిడి.. దిగొచ్చిన బంగారం ధరలు.. కొనుగోలుదారులకు ఖుషీ ఖుషీ!

ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి షాక్.. కన్య్సూమర్ కోర్టు కీలక తీర్పు, రూ. 45 వేలు ఫైన్

Big Stories

×