October Theatre Release Movies:ప్రస్తుతం సెలబ్రిటీలను మొదలుకొని సినిమా లవర్స్ వరకు అందరి చూపు అక్టోబర్ నెల పైనే.. దసరా పండుగ రాబోతోంది.. పైగా పది రోజులు సెలవులు వరుసగా రాబోతున్న నేపథ్యంలో తమకు నచ్చిన సినిమాను థియేటర్లలో చూసే అవకాశం కలగబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆడియన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో.. తమ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి చిత్ర బృందాలు కూడా అంతే ఆసక్తి కనబరుస్తున్నాయి. మరి అక్టోబర్లో థియేటర్లలో విడుదల కాబోతున్న ఆ చిత్రాలు ఏంటి? ఈ చిత్రం ఎప్పుడు విడుదల కాబోతోంది ?అనే విషయం ఇప్పుడు చూద్దాం..
స్టార్ హీరోల చిత్రాలతో పాటు చిన్న సినిమాలు, విభిన్న కథాంశాలతో ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దసరా పండుగను టార్గెట్ చేస్తూ విడుదలకు సిద్ధమవుతున్న ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో.. బేబీ సారా కీలక పాత్ర పోషిస్తూ.. ప్రేక్షకుల ముందుకు అక్టోబర్ 2వ తేదీన రాబోతున్న చిత్రం డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. శశాంక్ ఏలేటి దర్శకత్వంలో ఎస్.ఎస్.రాజమౌళి సమర్పణలో.. ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రశాంత్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మించిన ఈ చిత్రంలో సౌరబ్ సత్యదేవ్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా తొలి పరిచయంలో వస్తున్న చిత్రం సిగ్మా. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా రాబోతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాష్కరన్ నిర్మించారు. తమిళ్, తెలుగు భాషల్లో అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్విఆర్ సినిమా, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ విడుదల చేస్తున్నాయి.
కోర్ట్, బ్యాండ్ మేళం వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హర్ష్ రోషన్ హీరోగా, నక్షత్రా హీరోయిన్ గా అక్టోబర్ 2వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న యూత్ ఫుల్ లవ్ ఎమోషనల్ చిత్రం తెల్ల కాగితం. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు.
ఆది సాయికుమార్ హీరోగా వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎస్ ఐ యుగంధర్. మేఘ లేఖ హీరోయిన్గా, రాఘవేంద్ర కటారి దర్శకత్వంలో అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
also read:షూటింగ్లో గాయపడ్డ అమితాబ్ బచ్చన్.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే?
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా, శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా రాబోతున్న చిత్రం ఆదర్శ కుటుంబం ఏకే 47 . ఈ సినిమా అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇందులో నారా రోహిత్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
కామ్రేడ్ కళ్యాణ్:
శ్రీ విష్ణు హీరోగా, జానకి రామ్ మారెళ్ళ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం కామ్రేడ్ కళ్యాణ్. కోన ఫిలిం కార్పొరేషన్, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానంది.
రజినీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం జైలర్ 2. 2023లో వచ్చిన జైలర్ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది . కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. దసరా సందర్భంగా విడుదల కాబోతోంది.
రణబాలి:
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న జంటగా వివాహం తర్వాత నటిస్తున్న తొలి చిత్రం రణబాలి. అక్టోబర్ 16వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతోంది.
ప్రముఖ హీరోయిన్ ఆనంది ప్రధాన పాత్రలో నిజజీవిత కథలు, సంఘటనల స్ఫూర్తిగా రాబోతున్న చిత్రం గరివిడి లక్ష్మి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘నల్ల జీలకర్ర’ మొగ్గ అనే పాటకు విపరీతమైన రెస్పాన్స్ లభించింది. అక్టోబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
శైలేష్ కొలను దర్శకత్వంలో అక్టోబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ఏమో ఏమో ఇది. శ్రీకాంత్ తనయుడు ప్రముఖ యంగ్ హీరో రోషన్ మేక హీరోగా, ప్రీతి ముకుందన్ హీరోయిన్గా రాబోతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో అక్టోబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం కల్ట్ . సందీప్ కాకరాల మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు . గాయత్రీ భరద్వాజ్ ,తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, కార్తికేయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, జపనీస్, స్పానిష్ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.