E-Paper
Advertisement

ఈ టోల్ ఫ్రీ 1064 నెంబర్‌కి ఫిర్యాదు చేసేముందు ఇది చదవండి.. వెలుగులోకి షాకింగ్ రిపోర్ట్!

ఈ టోల్ ఫ్రీ 1064 నెంబర్‌కి ఫిర్యాదు చేసేముందు ఇది చదవండి.. వెలుగులోకి షాకింగ్ రిపోర్ట్!
Advertisement

ACB Cases: స్వేచ్ఛ బ్యూరో: పలుకుబడి..పై స్థాయిలో లింకులు ఉంటే ఏదైనా సాధ్యమే అన్నట్టుగా ఉంది కొందరు అవినీతి అధికారుల వ్యవహారం. చేయాల్సిన పనికి లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్​ గా పట్టుబడుతున్నా…అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్ల ఆస్తులు కూడబెట్టుకుని పట్టుబడుతున్నా శాఖాపరమైన చర్యలతో మాత్రమే తప్పించుకుంటున్నారు. తప్పితే న్యాయస్థానాల విచారణను ఎదుర్కోవటం లేదు. దీనికి కారణం ఇలాంటి అధికారులకు ఆయా శాఖలకు చెందిన కొందరు ఉన్నతస్థాయి అధికారులు రాజకీయ నాయకుల అండదండలు ఉండటమేనని ఏసీబీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రాసిక్యూషన్​ అనుమతులు రాకపోవటం..డిపార్ట్​ మెంటల్​ యాక్షన్​ సరిపోతుందన్న సూచనలు రావటంతో గడిచిన అయిదేళ్లలో 20కి పైగా కేసు ఫైళ్లను క్లోజ్​ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. దాంతో అవినీతికి చెక్​ పెట్టేందుకు తాము పడుతున్న శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతోందని అంటున్నాయి.

విస్తృత ప్రచారం..

ఆయా ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన అవినీతిని రూపుమాపే లక్ష్యంతో ఏసీబీ పని చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అధికారికంగా చేయాల్సిన పనికి ఎవరు లంచం అడిగినా వెంటనే ఫిర్యాదు చేయండి అంటూ ఏసీబీ అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. దీని కోసం టోల్​ ఫ్రీ నెంబర్​ 1064 నెంబర్​ ను అందుబాటులోకి తెచ్చారు. సోషల్​ మీడియా ప్లాట్​ ఫాంల ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో అవినీతికి మరిగిన అధికారులకు సంబంధించిన ఫిర్యాదులు గణనీయంగా వస్తున్నాయి.

ఈ సంవత్సరం..

Advertisement

2025లో అత్యధికంగా 199 కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే 75కు పైగా కేసులు రిజిష్టర్​ అయ్యాయి. అందిన సమాచారంతో చాలాసార్లు లంచాలు తీసుకున్న ఉద్యోగులను ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​ గా పట్టుకుంటున్నారు. మరికొన్నిసార్లు అధికారాన్ని ఉపయోగించుకుని వందల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేసి జైలుకు రిమాండ్​ చేస్తున్నారు. ఇలా అవినీతికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసిన తరువాత వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖకు రాతపూర్వకంగా సిఫార్సు చేస్తున్నారు. దాంతో ఆయా శాఖల ఉన్నతాధికారులు సదరు ఉద్యోగులను సస్పెండ్ కూడా చేస్తున్నారు.

Also Read: ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే అస్సలు తినలేరు!

అనుమతులేవీ..?

Advertisement

ఇక, దర్యాప్తు పూర్తి చేసిన తరువాత కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయడానికి ప్రాసిక్యూషన్‌ అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు సంబంధిత శాఖలకు లేఖలు రాస్తారు. ఆయా శాఖాధిపతులు వీటిపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ అంశంలో ఆయా డిపార్ట్​ మెంట్ల అధిపతులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నా ప్రాసిక్యూషన్‌ కు అనుమతులు ఇవ్వకుండా ఫైళ్లను పెండింగ్‌ లో పెడుతున్నారు. పైగా, కొన్ని కేసుల్లో శాఖాపరమైన చర్యలు చాలు…ప్రాసిక్యూషన్​ అవసరం లేదని పేర్కొంటూ ఫైళ్లను మూసివేయాల్సిందిగా సూచిస్తున్నారు.

ఇవిగో నిదర్శనాలు..

2020, అక్టోబర్​ 22న అప్పట్లో మహబూబ్​ నగర్ మున్సిపల్​ కమిషనర్​ గా ఉన్న అధికారి​ క్లోరినేషన్ ప్లాంట్ ఏర్పాటుకు ఆర్డర్​ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఈ కేసులో విచారణ పూర్తి చేసిన ఏసీబీ అధికారులు నిందితున్ని అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూషన్ చేయటానికి అనుమతి ఇవ్వాలని 2021-22లో తుది నివేదిక సమర్పించారు. అయితే, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రాసిక్యూషన్‌కు అనుమతిని నిరాకరిస్తూ గత ఏడాది ఫిబ్రవరి 27న మెమో జారీ చేసింది. దీనిపై శాఖాపరమైన చర్యలు మాత్రమే తీసుకోవాలని ఆదేశించింది. దాంతో గత ఆగస్టు 14న ఏసీబీ ప్రత్యేక కేసుల కోర్టు ఈ కేసును అధికారికంగా ముగించింది.ఇక, లైన్ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ రావు, జూనియర్ లైన్‌ మెన్ సతీష్ కుమార్, సూర్యాపేట రూరల్ మాజీ ఎస్ఐ లవ కుమార్, టీజీఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ చరణ్ సింగ్, వెల్దండ మాజీ తహసీల్దార్ సైదులులపై ఉన్న ట్రాప్ కేసులు కూడా గత ఏడాది జూలై, 2026 జనవరి మధ్య కాలంలో క్లోజ్ అయ్యాయి.

అక్రమాస్తుల కేసులు సైతం..

కోట్లాది రూపాయల అక్రమాస్తుల కేసులో 2018లో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ పురుషోత్తం రెడ్డిపై నమోదైన కేసును కూడా శాఖాపరమైన విచారణకు బదిలీ చేయడంతో కోర్టు గతేడాది నవంబర్‌లో కేసును కొట్టివేసింది. అలాగే ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ మాజీ జాయింట్ డైరెక్టర్ పద్మ, ఏసీపీ నరసింహారెడ్డి, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈఈ సుదర్శన్ రెడ్డిల కేసులు కూడా ఈ జాబితాలోకే చేరిపోయాయి. కష్టపడి, పక్కా ఆధారాలతో నమోదు చేసిన ట్రాప్, అక్రమాస్తుల కేసులను ఇలాంటి తేలికపాటి ప్రత్యామ్నాయాలతో ముగించడంపై ఏసీబీ క్షేత్రస్థాయి సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Also Read: అక్టోబర్‌లో ఓటీటీలోకి వస్తున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే… హారర్, థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు భారీ లిస్ట్

Tags

Related News

రాజకీయాల్లోకి వచ్చి నష్టపోయా! లేకపోతే.. మరో పది హోటళ్లు పెట్టేవాడిని..! ఆల్తుఫాల్తు గాన్ని కాదు.. ఆదాయం ఊరికే రాలేదు…!

గులాబీకి సవాల్‌గా ఖైరతాబాద్ ఎన్నిక.. సరైన అభ్యర్థి ఎంపికకోసం మల్లగుల్లాలు..!

నామినేటెడ్ పదవుల ఎంపికలో సీఎం రేవంత్ సంచలనం.. వారికే పెద్దపేట?

రేవంత్‌ పొలిటికల్‌ గేమ్‌లో సెల్ఫ్‌గోల్‌! అధికార పార్టీపై కౌంటర్‌ స్ట్రాటజీ అట్టర్‌ ఫ్లాప్.. తామే సీఎంకు అస్త్రాలను అంధించి..!

ముంబైలో షాకింగ్ ఘటన.. మళ్లీ జీవం వస్తుందని క్లినిక్‌లో 80 ఏళ్ల వృద్ధుడి బాడీ భద్రం!

సినిమా రేంజ్‌లో స్కెచ్చేసిన దొంగలు.. ఆర్టీసీ బస్సులో రూ.3 కోట్ల గోల్డ్ మాయం.. కానీ చివరకి..?

సకుటుంబ సపరివారానికీ.. తిట్ల తలంటు..! మీరిక వర్తమానం.. భవిష్యత్తు శూన్యం.. కొడుకు గడీనీ కూల్చుతాం!

Big Stories

Advertisement
×